కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ సోమవారం తిరుపతి రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహించారు.
తిరుపతి: కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ సోమవారం తిరుపతి రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే డివిజన్ ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తామని మంత్రి చెప్పారు. ఇందుకోసం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. రైల్వేల అభివృద్ధికి విదేశీ పెట్టుబడులు అవసరమని సదానంద గౌడ అభిప్రాయపడ్డారు.
రైల్వే మంత్రి రాక సందర్భంగా పోలీసులు అతిగా వ్యవహరించారు. మీడియా ప్రతినిధులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించి నెట్టేవేశారు.