రైల్వే స్టేషన్‌లో మంత్రి తనిఖీలు
తిరుపతి : కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ సోమవారం తిరుపతి రైల్వే స్టేషన్‌లో తనిఖీలు నిర్వహించారు. కృష్ణపట్నం పర్యటన ముగించుకుని ప్రత్యేక రైలులో మంత్రి ఉదయం 11.30 గంటలకు తిరుపతికి చేరుకున్నారు. రైల్వే క్యాటరింగ్ విభాగంలో తనిఖీలు నిర్వహించిన అనంతరం ప్లాట్‌ఫాంపై ఉన్న తాగునీటి కొళాయిలను, ప్రయాణికులు సామాన్లు భద్రపరిచే (క్లాక్‌రూం) గదిని, టాయ్‌లెట్లను పరిశీలించారు.
మంత్రికి రైల్వే గుంతకల్ డివిజన్ మేనేజర్ మనోజ్ జోషి, అసిస్టెంట్ డివిజన్ మేనేజర్ సత్యనారాయణ, లైజనింగ్ ఆఫీసర్ కుప్పాళ్ల సత్యనారాయణ, స్టేషన్ మేనేజర్ గంగులప్ప, రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ నాయకుడు గిరిధర్‌కుమార్, రాస్ ప్రధాన కార్యదర్శి గుత్తా మునిరత్నం, సింగంశెట్టి సుబ్బరామయ్య, బీజేపీ నాయకులు భానుప్రకాష్‌రెడ్డి తదితరులు మంత్రికి స్వాగతం పలికారు. మునుపెన్నడూ లేని విధంగా మంత్రి రాక సందర్భంగా భారీ సంఖ్యలో పోలీసులు మోహరించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాగా రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల సౌ కర్యార్థం మెడికల్ క్లినిక్‌ను ఏర్పాటు చేయాలని బీజే యువమోర్చా నాయకులు మంత్రిని కోరారు. వృద్ధు లు, వికలాంగుల కోసం వీ ల్‌చైర్లు అందుబాటులో ఉం చాలని బీజేవైఎం నాయకు లు విశ్వనాథ్ మంత్రికి విన తి పత్రం సమర్పించారు. దీనిపై ఆయన సానుకూలం గా స్పందించారు.