రైల్వే ప్రాజెక్టుల పరిశీలనకు డ్రోన్లు
న్యూఢిల్లీ: ప్రాజెక్టుల పురోగతి పరిశీలనకు డ్రోన్లు ఉపయోగించుకోవాలని రైల్వే నిర్ణయించింది. తొలిసారి డ్రోన్లతో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (డీఎఫ్‌సీ)ప్రాజెక్టును పరిశీలించనున్నారు. ఆ తర్వాత పనులు జరుగుతున్న ఇతర ప్రాజెక్టుల్లో కూడా ఈ విధానాన్ని వినియోగించనున్నారు.
డీఎఫ్‌సీ కారిడార్‌లో మూడు రోజులు ప్రయోగాత్మకంగా డ్రోన్ల ద్వారా పరిశీలించి దీని ద్వారా స్థాయీ నివేదిక త్వరగా తయారు చేయవచ్చని డీఎఫ్‌సీ ఎండీ ఆదేశ్ శర్మ తెలిపారు.