సాక్షి, హైదరాబాద్: నిరుపేద ఓసీల సమస్యలను ప్రస్తుత పార్ల మెంటు సమావేశాల్లో చర్చించి పరిష్కరించాలని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నిరుపేద ఓసీల సమస్యలను పార్లమెంటులో చర్చించాలని కోరుతూ వచ్చే వారం ఢిల్లీలో వివిధ రాష్ట్రాలకు చెందిన పార్లమెంటు సభ్యులను కలసి వినతి పత్రాలు సమర్పిస్తామని తెలిపారు.
దేశంలో ఉన్న నిరుపేద ఓసీల అభివృద్ధికి రూ.50 వేల కోట్లతో జాతీయ ఓసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా ఆరు కోట్ల మందికి పైగా ఉన్న నిరుపేద ఓసీలను ఓబీసీ జాబితాలో చేర్చాలన్న మేజర్ జనరల్ సిన్హా నివేదికను తక్షణమే పార్లమెంటులో చర్చించి ఆమోదించాలని ఆయన డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల విధానాన్ని సమీక్షించి ఆర్థిక వెనుకబాటు ప్రాతిపదికన అగ్రవర్ణపేదలకు విద్య, ఉద్యోగ, రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఆర్థిక ప్యాకేజీ అంశాన్ని దేశంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ ప్రధాన ఎజెండాగా పరిగణించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment