కృష్ణకు ‘ఆట’ పురస్కారం | Krishna is the 'aata' award | Sakshi
Sakshi News home page

కృష్ణకు ‘ఆట’ పురస్కారం

Dec 4 2017 2:09 AM | Updated on Dec 4 2017 2:09 AM

Krishna is the 'aata' award - Sakshi

సూపర్‌స్టార్‌ కృష్ణకు ‘ఆట’ (అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌) జీవన సాఫల్య పురస్కారం అందించనుంది. అమెరికాలో స్థిరపడిన తెలుగువారు ‘ఆట’ సంస్థ ఏర్పరచుకున్న విషయం తెలిసిందే. ప్రతి రెండేళ్లకు ఇండియా వచ్చి ‘ఆట వేడుకలు’ పేరుతో  పలు సేవా కార్యక్రమాలు నిర్వహించే ఈ సంస్థ ఈ ఏడాది పలు అంశాలపై అవగాహన సదస్సులు, ఉచిత వైద్య శిబిరాలకు శ్రీకారం చుట్టింది. నవంబర్‌ 26న ప్రారంభమైన ఈ వేడుకలు ఈ నెల 23న ముగియనున్నాయి.

ముగింపు రోజున కృష్ణకు ‘ఆట జీవన సాఫల్య పురస్కారం’ ప్రదానం చేయనున్నామని ‘ఆట’ ప్రస్తుత అధ్యక్షుడు కరుణాకర్‌ అసిరెడ్డి, కాబోయే అధ్యక్షుడు (ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌) పరమేష్‌ భీమిరెడ్డి తెలిపారు. ఆట చేపట్టబోయే కార్యక్రమాలను ‘ఆట’ గౌరవ సలహాదారు దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ‘ఆట’ ఓవర్‌సీస్‌ కో–ఆర్డినేటర్స్‌ లోహిత్, మధుసూధన్‌ కోడూరు, ‘ఆట’ ఫౌండర్‌ మెంబర్‌ డాక్టర్‌ రంగారావు, బోర్డు మెంబర్స్‌ అనిల్‌ బొద్దిరెడ్డి, భువనేశ్‌ బూజాల, డాక్టర్‌ సురేంద్రరెడ్డి తదితరులు పత్రికాముఖంగా వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement