అప్పు..ఇద్దరి ప్రాణాలు తీసింది | 2 commit suicide in medak district | Sakshi
Sakshi News home page

అప్పు..ఇద్దరి ప్రాణాలు తీసింది

Published Fri, Jul 15 2016 2:20 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM

2 commit suicide in medak district

దౌల్తాబాద్: మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అప్పు విషయంపై తలెత్తిన వివాదం రెండు కుటుంబాల్లో పెద్ద దిక్కు లేకుండా చేసింది. ఈ సంఘటన  జిల్లాలో దౌల్తాబాద్ దౌల్తాబాద్ మండలం తిరుమలాపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కరుణాకర్‌రెడ్డి అనే వ్యక్తి వద్ద యాదగిరి అనే రైతు కొంతమొత్తం అప్పు తీసుకున్నాడు. ఆ రుణం తీర్చలేకపోవటంతో శుక్రవారం ఉదయం కరుణాకర్ రెడ్డి.. యాదగిరికి చెందిన రెండు కాడెడ్లను తన ఇంటికి తీసుకు వెళ్లాడు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన యాదగిరి పొలంలో పురుగు మందు తాగి మృతిపోయాడు. యాదగిరి మృతితో ఆగ్రహించిన అతని కుటుంబీకులు కరుణాకర్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆందోళన చేపట్టారు. అందుకు మనస్తాపం చెందిన కరుణాకర్‌రెడ్డి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement