- హామీలను నెరవేర్చే సత్తా వైఎస్‌ఆర్‌సీపీకే ఉంది
తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్: మహిళల కష్టాలు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికే తెలుసని, ఆయన పాలనలో మహిళలు మహరాణులుగా బతకతారని తిరుపతి ఎమ్మెల్యే భూమ న కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. తిరుమల బైపాస్ రోడ్డులోని ఓ కల్యాణ మం డపంలో శనివారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర మహిళా అధ్యక్షురాలు చెలి కం కుసుమారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు వెలగపల్లి వరప్రసాద్, పార్టీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, కరుణాకరరెడ్డి సోదరి సుగుణారెడ్డి, సతీమణి రేవతమ్మ హాజరయ్యారు. కరుణాకరరెడ్డి మాట్లాడుతూ వైఎస్.రాజశేఖరరెడ్డి ఆరే ళ్ల పాలనలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని గుర్తుచేశారు.
ప్రతి పేదవాడికీ కార్పొరేట్ వైద్యం అందించాలన్న సంకల్పంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి లక్షలాది మందికి పునర్జన్మ ప్రసాదించారని తెలిపారు. మహిళలకు పావలా వడ్డీకే రుణాలిచ్చారని చెప్పా రు. చంద్రబాబునాయుడు కేవలం రూ. 75లు మాత్రమే పెన్షన్ ఇచ్చేవాడని ఎద్దేవా చేశారు. మహానేత హయాంలో వితంతువులకు రూ.200ల నుంచి రూ.500ల వరకు పెన్షన్ అందించారని కొనియాడారు. తిరుపతి పార్లమెంటు ని యోజకవర్గ పరిశీలకులు వెలగపల్లి వరప్రసాద్ మాట్లాడుతూ తాను జిల్లా కలెక్టర్‌గా పనిచేశానని, పేదల కష్టాలు పూర్తి గా తెలుసని అన్నారు.
తిరుపతి ఎంపీ చింతామోహన్‌లా ఓట్లు కోసం మహిళలకు ఇళ్లు ఇస్తానని, షాపులు పెట్టిస్తానని, ఇంటింటికీ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఉత్తుత్తి హామీలు ఇచ్చి మోసగించలేనని చెప్పారు. తిరుపతి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయగల సత్తా ఒక్క కరుణాకరరెడ్డికే ఉందన్నా రు. అనంతరం భూమన సుగుణారెడ్డి, భూమన రేవతమ్మ మాట్లాడారు.
రాష్ట్ర విభజనకు కారకులైన కిరణ్, చంద్రబాబునాయుడులను వచ్చే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. పార్టీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, మహిళా అధ్యక్షురాలు చెలికం కుసుమారెడ్డి మాట్లాడుతూ తిరుపతి స మస్యలపై అసెంబ్లీలో గొంత్తెత్తి చాటిన మొనగాడు కరుణాకరరెడ్డి అన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాళ్లు పద్మావతమ్మ, రమణమ్మ, గీతాయాదవ్, లతారెడ్డి, పుష్పాచౌదరి, గౌరి, మంజుల, సులోచన, పుణీత, సాయికుమారి, షర్మిల, పూజారి లక్ష్మి, మునీశ్వరమ్మ, అనూరాధ, రత్నమ్మ, కవితమ్మ, శారద, సరస్వతమ్మ, లక్ష్మి, రెడ్డెమ్మ తదితరులు పాల్గొన్నారు.
మహిళల కష్టాలు జగన్‌కే తెలుసు
Published Sun, Mar 30 2014 4:24 AM | Last Updated on Fri, Aug 17 2018 8:19 PM
Advertisement
Advertisement