అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ల కోసం సత్వరమే రాజ్యాంగ సవరణ చేయాలని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ: అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ల కోసం సత్వరమే రాజ్యాంగ సవరణ చేయాలని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఫరీదాబాద్‌లో ‘ఆలిండియా యాంటీ రిజర్వేషన్ ఫ్రంట్’ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. సామాజిక వివక్షత అంతరించి అర్థిక వివక్షత కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.