
ఎస్.కె.జోషికి వినతిపత్రం ఇస్తున్న తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్య వేదిక నేతలు
హైదరాబాద్: తెలంగాణలో పేద రెడ్ల సంక్షేమం కోసం రెడ్డి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయా లని డిమాండ్ చేస్తూ తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం సచివాలయం ముట్టడి చేపట్టారు. తమ సమస్యల్ని పరిష్కరించా లని 2015 నుంచి సభలు, సమావేశాలు, పాద యాత్రలు వంటి అనేక రూపాల్లో తమ గళాన్ని విన్పిస్తున్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఏనుగు సంతోష్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
నిరసన తెలిపేందుకు వచ్చిన వీరిని పోలీసులు అడ్డుకోవడంతో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్.కె.జోషికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఐక్యవేదిక సహాధ్యక్షుడు భూంపల్లి రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి సంది తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment