సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్‌గా చింతలచెరువు సత్యనారాయణరెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం తాడేపల్లి సీఎస్ఆర్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారోత్సవంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని అభినందనలు తెలియజేశారు.
గత నెలలో ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు కేటాయించారు. 137 పోస్టుల్లో మహిళలకు 69, పురుషులకు 68 పదవులు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment