సమావేశంలో పాల్గొన్న రెడ్డి జేఏసీ ప్రతినిధులు
హైదరాబాద్: రెడ్డి సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు నెరవేరుస్తారా.. లేదా? అనేది సీఎం కేసీఆర్ ప్రగతి నివేదన సభలోనైనా స్పష్టత ఇవ్వాలని రెడ్డి జేఏసీ డిమాండ్ చేసింది. శనివారం సికింద్రాబాద్‌లోని రాయల్ రివే హోటల్‌లో రాష్ట్ర స్థాయి రెడ్డి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది.
అనంతరం జేఏసీ కో చైర్మన్లు జైపాల్‌రెడ్డి, పైళ్ల హరినాథ్‌రెడ్డి, వసంతరెడ్డి, అసోసియేట్ చైర్మన్ రాంరెడ్డి విలేకరులతో మాట్లాడారు. రెడ్లకు ప్రత్యేక కార్పొరేషన్, విద్యార్థులకు ప్రత్యేక గురుకులాలు, స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే రెడ్డి విద్యార్థులకు విదేశీ విద్యానిధి పథకం వర్తింపజేసి రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందించాలన్నారు. రెడ్డి భవన్‌కు 100 ఎకరాలు, సంక్షేమానికి రూ.100 కోట్లు కేటాయించాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment