
నారాయణపేట: ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్ మధ్య రహస్య ఒప్పందాలున్నాయని కేంద్ర మాజీమంత్రి, ఏఐసీసీ అధికార ప్రతినిధి జైపాల్‌రెడ్డి విమర్శించారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట నియోజకవర్గ కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఇక్కడ ఓ వైపు కేంద్రంపై విమర్శలు చేస్తూ, మరోవైపు ఢిల్లీకి వెళ్లి ప్రధా నిని కలసి రహస్య మంతనాలు చేస్తుంటారని ఆరోపించారు. రాష్ట్ర వనరులను కేసీఆర్ దోచుకుంటున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పవనాలు బలంగా వీస్తున్నాయని, ముందస్తు ఎన్నికలు వస్తే రాష్ట్రంలోలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయ మన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్‌కు 14 స్థానాలు వస్తాయని.. టీఆర్‌ఎస్‌కు ఒకే సీటు వస్తుందంటూ కేసీఆర్ చేయించిన సర్వేలో తేలినట్లు సమాచారం ఉందన్నారు. 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఒకేవిడతలో రైతుల రుణాలు మాఫీ చేశారని గుర్తు చేశారు.