నేత జైపాల్‌రెడ్డి, నరేంద్రమోదీ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మండిపడ్డారు. కేసీఆర్ చెబుతున్న థర్డ్‌ఫ్రంట్.. ఒక పెద్ద స్టంట్ అని ఆయన కొట్టిపారేశారు. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కేసీఆర్‌తో కలిసి వెళ్లబోరని, ఆమె తమతోనే ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్, బిహార్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమిని ప్రస్తావిస్తూ.. ఇక పార్టీకి అన్ని పరాజయాలేనని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో తన నియోజకవర్గం వారణాసిలో ఓడిపోతారని జైపాల్‌రెడ్డి జోస్యం చెప్పారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలు బాధాకరమని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్ శాసనసభ్యత్వాలను రద్దుచేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment