
సాక్షి, హైదరాబాద్: రెడ్డి సామాజిక వర్గ నేతలను అణచి వేసేందుకు రాజకీయ పార్టీలన్నీ కుట్రలు పన్నుతున్నాయని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ..రెడ్డి వర్గానికి చెందిన నేతలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదుగుతున్నారనే కోపంతో పార్టీలు అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నాయని తెలిపారు.
కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డి, ప్రతాప్‌రెడ్డిలపై కేసులు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై ఐటీ దాడులు జరిగాయని కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి ఇప్పటివరకు టికెట్ హామీ లభించకపోవడం శోచనీయమన్నారు. మహాకూటమి అధ్యక్షుడిగా, సీఎం అభ్యర్థిగా రెడ్డి నేతను ప్రకటించే దమ్ము, ధైర్యం కాంగ్రెస్‌కు ఉందా అని ప్రశ్నించారు. ఓసీ సమస్యలను అన్ని పార్టీలు తమ ఎన్నిక ప్రణాళికలో చేర్చి ప్రధాన ఎజెండాగా పరిగణించడం హర్షణీయమని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment