ఇడుపులపాయ : వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో ఓ విద్యార్థిని గురువారం ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాల ప్రకారం.. ట్రిపుల్‌ఐటీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న వాణి(18) అనే విద్యార్థిని గురువారం బిల్డింగ్ రెండవ అంతస్తు నుంచి దూకటంతో చేయి విరిగింది. వెంటనే అక్కడున్నవారు ఆమెను 108లో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు ప్రాణాపాయమేమి లేదని తెలిపారు. కాగా విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.