
సాక్షి, వైఎస్సార్ కడప: వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటీ విద్యార్థిని అదృశ్యం కలకలం రేపుతోంది. తూర్పుగోదావరి జిల్లా ఇరుసుమందకు చెందిన అనిత ట్రిపుల్ ఐటీలో మొదటి సంవత్సరం చదువుతోంది.
ఆదివారం సాయంత్రం నుంచి అనిత కనిపించడం లేదని తోటి విద్యార్థులు తెలిపారు. విద్యార్థి అదృశ్యంతో ట్రిపుల్ ఐటీ అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఆర్కే వ్యాలీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment