Idupulapaya IIIT
-
వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్
సాక్షి, ఇడుపులపాయ: ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని సీఎం వైఎస్ జగన్ బుధవారం ఆవిష్కరించారు. అనంతరం రూ.190 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఆర్జీయుకేటీ, ఆర్కే వ్యాలీలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించడంలో భాగంగా రూ.139.83 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన కొత్త ఎకడమిక్ కాంప్లెక్స్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. (చదవండి: అమ్మ నాన్నను చూసిన విధానమే ఈ పుస్తకం: సీఎం జగన్) 10.10 కోట్ల అంచనాతో నిర్మించనున్న కంప్యూటర్ సెంటర్‌కు సీఎం శంఖుస్థాపన చేశారు. ఇందులో నాలుగు కంప్యూటర్ ల్యాబ్‌లు, రెండు లెక్చర్ హాళ్లు ఉంటాయి. 616 మంది కూర్చునే సామర్థ్యంతో 0.75 ఎకరాలలో విశాలమైన ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ ద్వారా కంప్యూటర్ సెంటర్ నిర్మాణం చేపట్టబోతున్నారు. 40 కోట్ల అంచనా వ్యయంతో అంతర్జాతీయ స్థాయిలో నిర్మించనున్న డాక్టర్ వైఎస్సార్ ఆడిటోరియానికి సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. ఇది రెండు అంతస్తుల ప్రపంచ స్థాయి ఆడిటోరియం. 1700 మంది విద్యార్థులకు సీటింగ్ సామర్థ్యం కలిగి ఉంటుంది. 6 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో మొత్తం ప్లిన్త్ ఏరియా 75,881.00 చదరపు అడుగులలో దీనిని నిర్మించనున్నారు. వీటితో పాటు 3 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. తద్వారా విశ్వవిద్యాలయానికి ఏడాదికి 1.51 కోట్ల విద్యుత్ ఖర్చుని ఆదా చేయబోతున్నారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం అనంతరం సీఎం వైఎస్ జగన్ ఇడుపులపాయల నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. (చదవండి: ప్రతి పేదోడి గుండెల్లో వైఎస్సార్ చిరంజీవుడే) -
విషాదం: ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, వైఎస్సార్ జిల్లా : ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విషాదం చోటు చేసుకుంది. కళాళాలలో మెకానికల్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న మంజునాథరెడ్డి అనే విద్యార్ధి శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థి స్వగ్రామం మైదుకూరు. అయితే హాజరు తక్కువ ఉండటంతో పరీక్షలకు అనుమతించలేదని మనస్తాపం చెందిన ముంజునాథరెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. -
ట్రిపుల్ ఐటీ విద్యార్థిని అదృశ్యం
సాక్షి, వైఎస్సార్ కడప: వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటీ విద్యార్థిని అదృశ్యం కలకలం రేపుతోంది. తూర్పుగోదావరి జిల్లా ఇరుసుమందకు చెందిన అనిత ట్రిపుల్ ఐటీలో మొదటి సంవత్సరం చదువుతోంది. ఆదివారం సాయంత్రం నుంచి అనిత కనిపించడం లేదని తోటి విద్యార్థులు తెలిపారు. విద్యార్థి అదృశ్యంతో ట్రిపుల్ ఐటీ అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఆర్కే వ్యాలీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
వేంపల్లె : ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కె.వి.సత్యనారాయణ, జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణలు సోమవారం పరిశీలించారు. ఈనెల 11వ తేదీ బుధవారం సాయంత్రం 3గంటల నుంచి 5గంటల వరకు ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో జరిగే ద్వితీయ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి గంటా శ్రీనివాసరావులు రానున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేసిన వేదిక, గ్యాలరీ, హెలీప్యాడ్లను పరిశీలించారు. గతంలో గ్యాలరీ పక్కనే ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారని... ప్రస్తుతం అలా కాకుండా వేదిక వెనుకవైపున ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేయాలని డైరెక్టర్లు భగవన్నారాయణ, విశ్వనాథరెడ్డిలకు వారు సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీ అన్బురాజన్, ఎస్ఐలు మస్తాన్ బాషా, మధుమల్లేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ట్రిపుల్ ఐటీ లెక్చరర్ దుర్మరణం
వేంపల్లి: వైఎస్సార్ జిల్లా వేంపల్లి ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ లో పనిచేస్తున్న అకడమిక్ అసిస్టెంట్ లాల్ బహుదూర్ శాస్రీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ సంఘటనలో ఇంగ్లీష్ మేటర్ వెంకటరమణ కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వెంకటరమణను కడప రిమ్స్‌కు తరలించారు. లాల్బహుదూర్శాస్త్రీ, వెంకటరమణ ఇద్దరూ స్వంత పనుల నిమిత్తం శనివారం సాయంత్రం ఇడుపులపాయ నుంచి ద్విచక్రవాహనంలో కడపకు వెళ్లారు. తిరుగుప్రయాణంలో అర్థరాత్రి సమయంలో చీమలపెంట వద్ద పంది అడ్డంగా రావడంతో ద్విచక్రవాహనం అదుపు తప్పి ఇద్దరూ కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో లాల్ బహుదూర్ శాస్రీ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. ఒంగోలు స్వస్థలం కాగా పులివెందులలో నివాసం ఉంటున్నారు. విధుల్లో చేరిన మూడు రోజులకే శాస్రీ మృతి చెందడంతో కుటుంబంలోను ట్రిపుల్ ఐటీ లో విషాదఛాయలు అలుముకున్నాయి. గాయపడిన వెంకటరమణ ది పీలేరు కాగా ట్రిపుల్ ఐటీ లో ఇంగ్లీష్ మేటర్ గా పని చేస్తున్నారు. -
ట్రిపుల్ ఐటీలో క్యాంపస్ ఇంటర్వూ ్యలు
వేంపల్లె : ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గురువారం ప్రముఖ బహుళ జాతి సంస్థలలో ఒకటైన టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో 21 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. తొలి దశలో 450 మందికి ఆన్లైన్ పరీక్ష నిర్వహించగా.. ఇందులో 117 మంది టెక్నికల్ ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. వీరికి ఎస్ఆర్ నిర్వహించిన ఇంటర్వ్యూలో 21 మంది విద్యార్థులు తమ ప్రతిభతో ఉద్యోగాలు సాధించారు. ఈసీఈ 13 మంది, సీఎస్ఈ 5 మంది, మెకానికల్ 2, సివిల్ ఒకరు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులకు రూ. 3.40 లక్షల వార్షిక వేతనం లభించనుందని అధికారులు తెలిపారు. ఈ ఎంపిక పట్ల డైరెక్టర్ భగవన్నారాయణ, పరిపాలనాధికారి అమరేంద్ర కుమార్, అధికారులు కేఎల్ఎన్రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, అమరనాథరెడ్డి, ప్లేస్‌మెంటు అధికారులు అశోక్ సుందర్ హర్షం వ్యక్తం చేశారు.