ట్రిపుల్‌ ఐటీలో క్యాంపస్‌ ఇంటర్వూ ‍్యలు | Campus Interviews in IIIT | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ ఐటీలో క్యాంపస్‌ ఇంటర్వూ ‍్యలు

Published Thu, Nov 3 2016 11:32 PM | Last Updated on Tue, Aug 27 2019 4:36 PM

ట్రిపుల్‌ ఐటీలో క్యాంపస్‌ ఇంటర్వూ ‍్యలు - Sakshi

ట్రిపుల్‌ ఐటీలో క్యాంపస్‌ ఇంటర్వూ ‍్యలు

వేంపల్లె : ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో గురువారం ప్రముఖ బహుళ జాతి సంస్థలలో ఒకటైన టీసీఎస్‌ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌) నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో 21 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. తొలి దశలో 450 మందికి ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించగా.. ఇందులో 117 మంది టెక్నికల్‌ ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. వీరికి ఎస్‌ఆర్‌ నిర్వహించిన ఇంటర్వ్యూలో 21 మంది విద్యార్థులు తమ ప్రతిభతో ఉద్యోగాలు సాధించారు. ఈసీఈ 13 మంది, సీఎస్‌ఈ 5 మంది, మెకానికల్‌ 2, సివిల్‌ ఒకరు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులకు రూ. 3.40 లక్షల వార్షిక వేతనం లభించనుందని అధికారులు తెలిపారు. ఈ ఎంపిక పట్ల డైరెక్టర్‌ భగవన్నారాయణ, పరిపాలనాధికారి అమరేంద్ర కుమార్, అధికారులు కేఎల్‌ఎన్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, అమరనాథరెడ్డి, ప్లేస్‌మెంటు అధికారులు అశోక్‌ సుందర్ హర్షం వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement