ఎల్‌పీయూ బీటెక్‌ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీతో ప్లేస్‌మెంట్‌ | Lovely Professional University B.Tech student securing job offer of Rs 2.5 cr package | Sakshi
Sakshi News home page

ఎల్‌పీయూ బీటెక్‌ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీతో ప్లేస్‌మెంట్‌

Published Tue, Mar 18 2025 12:12 PM | Last Updated on Tue, Mar 18 2025 1:12 PM

Lovely Professional University B.Tech student securing job offer of Rs 2.5 cr package

1,700 మందికి పైగా విద్యార్థులకు ఏటా రూ.10 లక్షల వేతనం

మరో ఎల్‌పీయూ గ్రాడ్యుయేట్‌కు ఐటీ కంపెనీలో రికార్డు స్థాయిలో రూ.3 కోట్ల ప్యాకేజీ

లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్శిటీ (ఎల్‌పీయూ)కు ఈ ఏడాది చాలా ఉత్సాహంతో మొదలైంది. యూనివర్సిటీ విద్యార్థుల్లో ఇద్దరు ప్రతిష్ఠాత్మకంగా కోట్ల రూపాయాల వేతన మార్కును అధిగమించి ఉద్యోగాలు సాధించారు. బీటెక్‌ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ) ఫైనల్ ఇయర్ చదువుతున్న శ్రీవిష్ణు ప్రముఖ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కంపెనీలో రూ.2.5 కోట్ల ప్యాకేజీని సొంతం చేసుకుని రికార్డులను బద్దలు కొట్టారు. ఈ విజయం భారతదేశంలో గ్రాడ్యుయేట్ విద్యార్థికి అత్యధిక ప్యాకేజీని సూచిస్తుంది. ఇది భారత్‌లోని ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్ఐటీల్లో ఉన్న రికార్డులను అధిగమించింది. దాంతో టాప్ టైర్ రిక్రూట్‌మెంట్‌లో లీడర్‌గా ఎల్‌పీయూ స్థానాన్ని మరింత పటిష్టం చేసింది.

ప్రముఖ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కంపెనీలో రూ.1.03 కోట్లు (1,18,000 డాలర్లు) ప్యాకేజీ పొందిన ఈసీఈ ఫైనల్ ఇయర్ విద్యార్థి బేతిరెడ్డి నాగవంశీరెడ్డి మరో ఘనత సాధించారు. మొత్తంగా 1,700 మందికి పైగా ఎల్‌పీయూ విద్యార్థులకు టాప్ ఎంఎన్‌సీల నుంచి ఆఫర్లు వచ్చాయి. విదార్థులకు రూ .10 ఎల్‌పీఏ నుంచి రూ.2.5 కోట్ల వరకు ప్యాకేజీలు ఉన్నాయి. వందలాది మంది ఎల్‌పీయూ విద్యార్థులు అమెరికా, యూకే, ఆస్ట్రేలియాల్లోని ప్రఖ్యాత సంస్థల్లో పనిచేస్తూ రూ.కోటికి పైగా ప్యాకేజీలు పొందుతున్నారు. మరో ఎల్పీయూ గ్రాడ్యుయేట్‌కు ఐటీ కంపెనీలో రూ.3 కోట్ల ప్యాకేజీ లభించింది. అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులను తయారు చేసే ఎల్‌పీయూ సామర్థ్యం యొక్క బలం, ప్రపంచవ్యాప్త పరిధికి ఇది ఉదాహరణ. పాలో ఆల్టో నెట్వర్క్స్‌, న్యూటానిక్స్, మైక్రోసాఫ్ట్, సిస్కో, పేపాల్‌, అమెజాన్ వంటి ప్రతిష్టాత్మక బహుళజాతి కంపెనీల్లో ప్లేస్‌మెంట్‌లు పొందిన వివిధ బీటెక్‌ విద్యార్థులకు మొత్తం 7,361 ఆఫర్లు అందాయి. వీటిలో టాప్ ఎంఎన్‌సీలు అందించే సగటు ప్యాకేజీ ఏటా రూ.16 లక్షలుగా నమోదైంది. ఇది జాబ్ మార్కెట్‌లో ఎల్‌పీయూ గ్రాడ్యుయేట్లకు అధిక డిమాండ్‌ను నొక్కిచెబుతోంది.

గతంలోని ప్లేస్‌మెంట్‌ సీజన్ కూడా అంతే ఆకట్టుకుంది. పరిశ్రమ దిగ్గజాలు ఆకర్షణీయమైన పరిహార ప్యాకేజీలను అందిస్తున్నాయి. అత్యధిక వేతనం చెల్లించే కంపెనీల్లో పాలోఆల్టో నెట్వర్క్స్ రూ.54.75 ఎల్పీఏతో అగ్రస్థానంలో నిలవగా, న్యూటానిక్స్ రూ.53 ఎల్పీఏ, మైక్రోసాఫ్ట్ రూ.52.20 ఎల్పీఏతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మొత్తం 1,912 మల్టిపుల్ జాబ్ ఆఫర్లను అందిచగా, 377 మందికి మూడు ఆఫర్లు, 97 మందికి నాలుగు, 18 మందికి ఐదుగురికి, ఏడుగురు విద్యార్థులకు ఆరు జాబ్ ఆఫర్లు లభించాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ విద్యార్థి ఆదిరెడ్డి వాసు అద్భుతమైన ఏడు జాబ్ ఆఫర్లను సాధించి అరుదైన రికార్డును నెలకొల్పాడు.

పైన పేర్కొన్న కంపెనీలతో పాటు అమెజాన్ (రూ.48.64 ఎల్పీఏ), ఇన్ట్యూట్ లిమిటెడ్ (రూ.44.92 ఎల్పీఏ), సర్వీస్ నౌ (రూ.42.86 ఎల్పీఏ), సిస్కో (రూ.40.13 ఎల్పీఏ), పేపాల్‌ (రూ.34.4 ఎల్పీఏ), ఏపీఎన్ఏ (రూ.34 ఎల్పీఏ), కామ్వాల్ట్ (రూ.33.42 ఎల్పీఏ), స్కేలర్ (రూ.33.42 ఎల్పీఏ) వంటి టాప్ రిక్రూటర్లు ఎల్‌పీయూ విద్యార్థులకు అవకాశం కల్పించారు. దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్, అధునాతన సాంకేతితక నిపుణులకు  ప్రాధాన్యమిచ్చారు.

యాక్సెంచర్, క్యాప్ జెమినీ, టీసీఎస్ వంటి ప్రముఖ కంపెనీలు అతిపెద్ద రిక్రూటర్లలో ఉండటంతో ఎల్‌పీయూ గ్రాడ్యుయేట్ల సాంకేతిక పరంగా అధిక డిమాండ్ ఏర్పడింది. క్యాప్ జెమినీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనలిస్ట్, సీనియర్ అనలిస్ట్ పోస్టులకు 736 మంది విద్యార్థులను, గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులకు మైండ్ ట్రీ 467 మంది విద్యార్థులను నియమించుకుంది. కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ 418 మంది విద్యార్థులను జెన్సీ ఉద్యోగాలకు రిక్రూట్ చేసుకుంది. యాక్సెంచర్ (279 నియామకాలు), టీసీఎస్ (260 నియామకాలు), కేపీఐటీ టెక్నాలజీస్ (229 నియామకాలు), డీఎక్స్‌సీ టెక్నాలజీ (203 నియామకాలు), ఎంఫసిస్‌ (94 నియామకాలు)తోపాటు తదితర కంపెనీలు ఎల్‌పీయూ విదార్థులకు 279 కొలువులు అందించాయి.

రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ వంటి కోర్ ఇంజినీరింగ్ విభాగాల్లో అత్యధిక ప్లేస్‌మెంట్ దక్కింది. పాలోఆల్టో నెట్వర్క్స్, సిలికాన్ ల్యాబ్స్, ట్రైడెంట్ గ్రూప్, న్యూటానిక్స్, ఆటోడెస్క్, అమెజాన్ వంటి పరిశ్రమ దిగ్గజాలు ఈ విభాగాల నుండి భారీగా నియామకాలు చేస్తున్నాయి.

పార్లమెంటు సభ్యుడు (రాజ్యసభ), ఎల్‌పీయూ వ్యవస్థాపక ఛాన్సలర్ డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ మాట్లాడుతూ..‘వేగంగా మారుతున్న ప్రపంచంలో విజయం సాధించేలా విద్యార్థులను సిద్ధం చేయడానికి ఎల్‌పీయూ కట్టుబడి ఉంది. యూనివర్సిటీ ఆకట్టుకునే ప్లేస్‌మెంట్‌ విజయాలు దీన్ని ప్రతిబింబిస్తున్నాయి. విద్యార్థులు ఉన్నత స్థాయి ఉద్యోగాలను సాధిస్తున్నారు. స్థిరంగా కొత్త రికార్డులను నెలకొల్పుతున్నారు. ఎల్‌పీయూ విద్యాభ్యాసం వాస్తవ-ప్రపంచ పరిశ్రమ విధానాలతో మిళితం చేయడం ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు అందుతున్నాయి. వృత్తి విజయాలకు విద్యార్థులను సిద్ధం చేయడమే కాకుండా పరిశ్రమకు విలువను జోడించేందుకు, సృజనాత్మకతను ప్రోత్సహించడానికి అవసరమయ్యే నైపుణ్యాలను అందించేలా విద్యార్థులను సిద్ధం చేస్తున్నారు. ఎడ్యుకేషన్‌లో వచ్చే రివల్యూషన్ విద్యార్థుల భవిష్యత్తును రూపొందిస్తోంది. వారు అభివృద్ధి చెందడానికి, ప్రపంచ ఉద్యోగ మార్కెట్లో అగ్రగామిగా నిలిచి మెరుగైన ప్లేస్‌మెంట్లు సాధించేందుకు ఎల్‌పీయూ అవకాశాలను సృష్టిస్తోంది’ అని తెలిపారు.

2025 బ్యాచ్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ దగ్గరపడింది. ఎల్‌పీయూలో అడ్మిషన్లకు పోటీ ఎక్కువ. యూనివర్శిటీలో అడ్మిషన్‌ కోసం విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అలాగే ‘ఎల్‌పీయూ నెస్ట్‌ 2025’, ఇంటర్వ్యూలలోనూ పాసైన వారికి మాత్రమే కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లోకి ప్రవేశం లభిస్తుంది. పరీక్ష, అడ్మిషన్‌ ప్రాసెస్‌ గురించి తెలుసుకోవాలనుకునే ఆసక్తిగల విద్యార్థులు https://bit.ly/43340ai ను సందర్శించగలరు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 

పోల్