Lovely Professional University
-
మానస స్వప్నం నిరుపేదలకు ఓపాడ్ ఇళ్లు
సొంతింట్లో నివసించాలని కోరుకునే వారు మన సమాజంలో చాలామంది ఉంటారు. పేద, మధ్యతరగతి వారి సొంతింటి కలను సాకారం చేసేందుకు 23 ఏళ్ల పేరాల మానస రెడ్డి సరికొత్త ఐడియాతో ముందుకొచ్చింది. డ్రైనేజి నీటి పారుదల కోసం ఉపయోగించే.. పైపుల్లో సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లను అతి తక్కువ ఖర్చుకే అందించనున్నట్లు మానస ప్రకటించింది. ప్రకటించినట్లుగానే రెండు వేల మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన కాంక్రీట్ పైపు (తూము)లో 120 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓపాడ్స్ లేదా మైక్రో ఇళ్లుగా పిలిచే ఇల్లును నిర్మించి ఔరా అనిపిస్తోంది. కరీంనగర్ జిల్లా బొమ్మకల్ గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించింది మానస. తను మూడో తరగతి చదువుతున్న సమయంలో తండ్రి మరణించడంతో మానసను, ఆమె చెల్లిని తల్లి ఎంతో కష్టపడి పెంచింది. చిన్నప్పటి నుంచి తల్లి పడుతోన్న కష్టాలను దగ్గర నుంచి చూస్తూ పెరిగిన మానస... తల్లి ప్రోత్సాహంతో ‘లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ’లో సివిల్ ఇంజనీరింగ్‌లో బి.టెక్ పూర్తిచేసింది. ఇంజినీరింగ్ అయిన తరువాత మరో ఆరు నెలలపాటు కొత్త కొత్త ఇళ్ల నిర్మాణ నమూనాలపై ఆమె పరిశోధనలు చేసింది. పరిశోధనలో భాగంగా జపాన్, హాంగ్‌కాంగ్, ఇతర ప్రదేశాల్లో అక్కడి వాతావరణ స్థితిగతులకు అనుగుణంగా నిర్మించిన ఇళ్ల నమూనాలపై లోతుగా అధ్యయనం చేసింది. వీటి ఆధారంగా మన దేశంలోని వాతావరణానికి తగ్గట్టుగా తక్కువ ఖర్చుతో ఎలాంటి ఇంటిని నిర్మించవచ్చో నిర్ణయించుకుని కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టడానికి రిజిస్టర్ చేసుకుంది. నిరుపేద కుటుంబాల కోసం 12 రకాల డిజైన్లు రూపొందించగా... ఇప్పుడు ఒక నమూనాతో ‘ఓపాడ్’ ఇంటిని నిర్మించింది. ఓపాడ్.. సిమెంటు తూములు (పైపు)ల్లో నిర్మించే ఈ ఇళ్లు చిన్నగా... చూడముచ్చటగా కనిపిస్తాయి. ఓపాడ్ లో ఒక బెడ్రూమ్, కిచెన్, హాల్, వాష్‌రూమ్‌లు ఉంటాయి. వస్తువులను పెట్టుకునేందుకు అల్మారాలు, ఎలక్ట్రిసిటీæ, వాటర్, డ్రైనేజీ సదుపాయాలు ఉంటాయి. పైపు పైన లాంజ్ లాంటి బాల్కనీ కూడా ఉంది. ఈ ఇంటిలో ఒకరు లేదా ఇద్దరు సౌకర్యంగా జీవించవచ్చు. ఇండియాలోనే తొలిసారి నిర్మించే ఈ ఓపాడ్ ఇళ్లు 40 నుంచి 120 చదరపు అడుగుల విస్తీర్ణంలో 15 రోజుల్లో నివసించడానికి వీలుగా తయారవుతుంది. ‘‘అన్ని వాతావరణ పరిస్థితుల్లో అటూ ఇటూ కదపగల ఈ ఇళ్లæజీవిత కాలం వందేళ్లు అని, ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.3.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఖర్చవుతుందని మానస చెప్పింది. సరికొత్త ఓపాడ్ ఇళ్లలో డబుల్, త్రిబుల్ బెడ్రూమ్ ఇళ్లను త్వరలో నిర్మించనున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా మానస మాట్లాడుతూ..‘‘పట్టణాలు, గ్రామాలు, స్లమ్స్‌లో నివసించే వారు ఎక్కువగా పూరి గుడిసె ల్లో నివసిస్తుంటారు. వర్షం పడిందంటే ఇళ్లలోకి నీరు చేరడం, పైకప్పు నుంచి వర్షం కురవడం, కొన్నిసార్లు నీటి ప్రవాహానికి ఇళ్లు కొట్టుకుపోవడం వంటివి సంభవిస్తుంటాయి. నేను బి.టెక్ చదివేటప్పుడు ఇటువంటి సందర్భాలెన్నింటినో దగ్గరగా గమనించాను. సమస్యలు ఏవీ ఎదురుకాని ఇళ్లను నిర్మించాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. ఈ క్రమంలోనే తక్కువ ఖర్చుతో తయారయ్యే ఓపాడ్ ఇళ్లను నిర్మిస్తున్నాను. ఈ ఇళ్లు ఎంతో చల్లగా ఉండడంతో పాటు ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. నిరుపేదలకోసం రూపొందించిన ఈ డిజైన్లలో కొన్ని రెస్టారెంట్లు, రిసార్టులు, మొబైల్ హోమ్స్, మొబైల్ క్లినిక్‌లు, గెస్ట్ హౌస్, గార్డులు నివసించే రూములుగా కూడా ఉపయోగపడతాయి’’ అని వివరించింది. మానస తల్లి రమాదేవి మాట్లాడుతూ.. మా అమ్మాయి మానసకు వచ్చిన ఐడియాను మొదట్లో ఎవరూ ప్రోత్సహించలేదు. కానీ ఇప్పుడు ఎంతోమంది తన డిజైన్స్ గురించి మెచ్చుకోవడం నాకెంతో సంతోషంగా, గర్వంగా ఉంది. మానస నిరుపేదలు ఖర్చుచేయగల సరసమైన ధరలకు ఇళ్లను నిర్మించాలని కోరుకుంటున్నాను’’ అని రమాదేవి చెప్పారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శి, సీనియర్ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ... మానసకు వచ్చిన ఆలోచన కొత్త ఆవిష్కరణలకు పునాది వేసేదిగా ఉంది. ఇది తన విజయ ప్రస్థానంలో కేవలం ప్రారంభం మాత్రమే. ముందుముందు తను మంచి విజయాలను అందుకుంటుందని ఆశిస్తున్నాను’’ అని చెప్పారు. మానస చెంగిచెర్లలో డెమో కోసం నిర్మించిన ఓపాడ్ ఇల్లు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తల్లి రమాదేవితో మానస -
భారతీయ విద్యార్థికి రూ.1.3కోట్ల స్కాలర్షిప్
న్యూఢిల్లీ: లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ(ఎల్పీయూ)కి చెందిన ఓ విద్యార్థికి ప్లాంట్స్ సైన్స్ అంశంలో ఆస్ట్రేలియాలో పీహెచ్డీ చేసేందుకు గాను 1.3 కోట్ల రూపాయలు ఫుల్ పెయిడ్ స్కాలర్షిప్ లభించింది. ఈ రంగంలో ఇంతవరకు లభించిన అత్యధిక స్కాలర్షిప్ ఇదే కావడం విశేషం. వివరాలు.. సుమంత్ బిందాల్ అనే యువకుడు ఎల్పీయూలో వ్యవసాయ రంగంలో ప్రత్యేకంగా జన్యుశాస్త్రం, మొక్కల పెంపకంలో మాస్టర్స్ ఆఫ్ సైన్స్ చదువుతున్నాడు. ఈ క్రమంలో బిందాల్‌కు ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ(ఏఎన్‌యూ)లో పీహెచ్డీ చేయడానికి స్కాలర్షిప్ లభించింది. దీనితో బిందాల్ టమోటా మొక్కలను నాశనం చేసే ఫ్యూసేరియం అనే ఒక రకమైన ఫంగస్ గురించి పరిశోధన చేయాల్సి ఉంటుంది. ఈ ఫంగస్ వల్ల ఏటా భారతదేశంలో టమోటా రైతులు 45శాతం దిగుబడిని కోల్పోతున్నారు. (ఆస్ట్రేలియాలో సింబా) ఈ నేపథ్యంలో బిందాల్ మాట్లాడుతూ.. ‘ఈ స్కాలర్షిప్ అందుకున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఏఎన్‌యూ ప్రపంచంలోని ప్రముఖ పరిశోధనా సంస్థల్లో ఒకటి. ఇక్కడ పీహెచ్డీ చేయాలనేది నా జీవిత ఆశయం. ఇందుకు సహకరించిన నా అధ్యాపకులకు, సలహాదారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అన్నారు. -
ఇక్కడ చదివితే; ప్లేస్‌మెంట్స్ పక్కా!
విద్యావ్యవస్థ రోజురోజుకీ సాంకేతిక సంతరించుకుంటోంది. పాఠశాల స్థాయి నుంచే టెక్నాలజీ పరంగా మార్పులెన్నో చోటు చేసుకుంటున్నాయి. ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలు ఆధునిక బాటలో పయనిస్తున్నాయి. ఉన్నత విద్యకు సంబంధించి యూనివర్సిటీలు మాత్రం ఆధునికత, సాంకేతికను అందిపుచ్చుకోవడంలో ముందంజ వేయడం లేదు. ఒకవైపు అగ్రశ్రేణి ప్రభుత్వ యూనివర్సిటీలు మౌలిక సదుపాయాల కల్పన కోసమే ప్రయత్నిస్తుంటే మరోవైపు ప్రైవేటు వర్సిటీలు నాణ్యమైన విద్య, సహజ అభ్యసన పద్ధతులు, పరిశ్రమ శిక్షణతో పాటు మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి భారీ సంస్థలకు ఎంపికయ్యేలా కంప్లీట్ ప్యాకేజీని అందిస్తున్నాయి. అలా.. కంప్లీట్ ప్యాకేజీని అందిస్తున్న విద్యా సంస్థల్లో ముందుంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ). 2005లో స్థాపించిన నాటి నుంచి నాణ్యమైన విద్యను అందిస్తూ ఎదిగింది. భారతదేశంలో అతిపెద్ద సింగిల్ క్యాంపస్ యూనివర్సిటీగా పేరు పొందింది. అతి తక్కువ వ్యవధిలోనే ఉన్నత విద్యలో నూతన ప్రమాణాలు నెలకొల్పింది. తిరుగులేని ప్లేస్మెంట్ రికార్డులు ఇప్పటికే దీనిని నిరూపించాయి. ఏటా లవ్లీ యూనివర్సిటీ విద్యార్థులను బహుళ జాతి సంస్థలు (ఎంఎన్సీ) ఎంపిక చేసుకుంటున్నాయి. అమెజాన్, శాప్, సిస్కో, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, బాష్, డెల్ సహా మరెన్నో కంపెనీలు పేస్ల్మెంట్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నాయి. మీకో సంగతి తెలుసా! ఎల్పీయూ ఇంజినీరింగ్ విద్యార్థి తాన్య అరోరాను 2019లో మైక్రోసాఫ్ట్ రూ.42 లక్షల వార్షిక ప్యాకేజీతో ఎంపిక చేసుకుంది. ఆ ఏడాది అప్పుడే బయటకు వచ్చిన ఇంజినీరింగ్ విద్యార్థి పొందిన అత్యధిక వేతనం ఇదే. భారీ కంపెనీలు ఎల్పీయూ విద్యార్థులనే ఎంచుకోవడానికి కారణమేంటి? ఒక విద్యార్థి విద్యాసంస్థ నుంచి బయటకు వచ్చినప్పుడు అతడి చేతిలో సర్టిఫికెట్ మాత్రమే ఉండటం ముఖ్యం కాదు. పరిశ్రమల్లో పనిచేసేందుకు అవసరమైన ప్రతిభ, విజ్ఞానంతో అతడు సిద్ధంగా ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు వ్యక్తిగత, పరిశ్రమ నైపుణ్యాల్లో ఆరితేరాలి. ఎల్పీయూ ఇదే చేస్తోంది. అందుకే లవ్లీ విద్యార్థులను ఎంపిక చేసుకొనేందుకు, భారీ ఆఫర్లు ఇచ్చేందుకు కంపెనీలన్నీ ముందుకొస్తున్నాయి. మరి విద్యార్థులను ఎల్పీయూ ఎలా సిద్ధం చేస్తోంది? ఏదైనా ఒక ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించాలంటే దానికి రాకెట్, లాంచ్‌ప్యాడ్ అవసరం. విద్యార్థులు పరిశ్రమల్లోకి అడుగుపెట్టేందుకు అవసరమైన అత్యద్భుతమైన మౌలిక వసతులు, సాంకేతికత రూపంలో ఎల్పీయూ లాంచ్ప్యాడ్లను ఏర్పాటు చేసింది. ప్రపంచ స్థాయిలో ఎయిరో డైనమిక్, ఐమ్యాక్ ల్యాబ్, ప్రతి రంగానికీ సంబంధించిన ప్రయోగశాలల్ని నెలకొల్పింది. వీటిని ఉపయోగించుకోవడం వల్ల విద్యార్థుల ప్రాక్టికల్ స్కిల్స్ మెరుగవుతాయి. ఇక సొంత వ్యాపారాలు ఆరంభించేందుకు, అందులో ఆరితేరేందుకు విద్యార్థులే నడిపే ఆన్ క్యాంపస్ షాపింగ్ మాల్ ఇక్కడుంది. దీంతో వ్యాపార, వాణిజ్య నైపుణ్యాలు వారికి అబ్బుతున్నాయి. వీటితో పాటు క్యాంపస్‌లో అతిపెద్ద క్రీడా ప్రాంగణం ఉంది. ఒలింపిక్ పోటీల పరిమాణంలో ఈత కొలను ఉంది. ఆన్‌క్యాంపస్ ఆస్పత్రి, ఆరు అంతస్తుల్లో గ్రంథాలయం, ఆధునిక తరగతి గదులు, ఆడిటోరియాలు ఉన్నాయి. విద్యార్థులకు అవసరమైన ప్రతిదీ ఎల్పీయూలో ఉంటుంది.(అడ్వర్టోరియల్) గూగుల్, మైక్రోసాఫ్ట్ ఎంపిక చేసుకుంటున్న భారత వర్సిటీ.. ఎల్పీయూ విద్యావ్యవస్థ రోజురోజుకీ సాంకేతిక సంతరించుకుంటోంది. పాఠశాల స్థాయి నుంచే టెక్నాలజీ పరంగా మార్పులెన్నో చోటు చేసుకుంటున్నాయి. ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలు ఆధునిక బాటలో పయనిస్తున్నాయి. ఉన్నత విద్యకు సంబంధించి యూనివర్సిటీలు మాత్రం ఆధునికత, సాంకేతికను అందిపుచ్చుకోవడంలో ముందంజ వేయడం లేదు. ఒకవైపు అగ్రశ్రేణి ప్రభుత్వ యూనివర్సిటీలు మౌలిక సదుపాయాల కల్పన కోసమే ప్రయత్నిస్తుంటే మరోవైపు ప్రైవేటు వర్సిటీలు నాణ్యమైన విద్య, సహజ అభ్యసన పద్ధతులు, పరిశ్రమ శిక్షణతో పాటు మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి భారీ సంస్థలకు ఎంపికయ్యేలా కంప్లీట్ ప్యాకేజీని అందిస్తున్నాయి. వైవిధ్యానికి పెద్దపీట భారతీయులే కాకుండా 50+ దేశాల నుంచి విద్యార్థులు ఎల్‌పీయూకు వస్తారు. ఇది భిన్నత్వంలో ఏకత్వం తరహా సంస్కృతిని నెలకొల్పింది. వాతావరణం వైవిధ్యభరితంగా ఉంటుంది. బహుళ సంస్కృతులకు ఇక్కడి విద్యార్థులు అలవాటు పడివుంటారని గుర్తించిన అంతర్జాతీయ కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. అకాడమిక్స్ అధ్యాపక బృందం: విద్యార్థులకు పరిశ్రమలపై అవగాహన, అనుభవం, మార్గదర్శనం అవసరం. ఎల్పీయూలో వివిధ రంగాలకు చెందిన నిపుణులు, అనుభవజ్ఞులు అధ్యాపక బృందంలో ఉన్నారు. లైవ్ ప్రాజెక్టులు: విద్యార్థులకు ప్రత్యక్ష శిక్షణ, అనుభవం ఎంతో అవసరం. ఇందుకోసం ఎల్పీయూ విద్యార్థుల చేత సౌర విద్యుత్ కార్ల తయారీ సహా ఎన్నో లైవ్ ప్రాజెక్టులను చేయిస్తోంది. హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులు ఇక్కడ సొంతంగా ఓ హోటల్‌ను నడిపిస్తున్నారు. పరిశ్రమ అనుభవం: ఎల్పీయూ విద్యతో పాటు పరిశ్రమ అనుభవం అందిస్తోంది. ఫుల్‌టైమ్ ఐచ్ఛిక/తప్పనిసరి ఇంటర్న్‌షిప్‌లు, వేసవి శిక్షణ, వైజ్ఞానిక పర్యటనలు, ఆన్ ద జాబ్ ట్రైనింగ్ సహా మరెన్నో ఎక్స్ట్రా కరిక్యులమ్ యాక్టివిటీస్‌ను విద్యకు అనుసంధానం చేసింది. అతిథి ఉపన్యాసాలు/కార్యశాలలు: వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారితో ఎల్పీయూ నిరంతరం ఉపన్యాసాలు ఏర్పాటు చేస్తుంది. వర్క్‌షాప్స్‌ను నిర్వహిస్తుంది. ప్లేస్మెంట్ వర్క్‌షాప్స్ ఉద్యోగం వస్తుందా రాదా అనేది విద్యార్థిపై ఆధారపడి ఉంటుంది. ప్లేస్మెంట్ సెషన్స్ ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు ఎల్పీయూ ప్రయత్నిస్తోంది. మున్ముందు జరగబోయే ఇంటర్వ్యూల్లో విజయవంతం అయ్యేందుకు విద్యార్థులకు మెంటార్షిప్ను ఏర్పాటు చేసింది. దీంతో పాటు సాఫ్ట్‌స్కిల్స్ కోర్సులను అందిస్తోంది. అమెజాన్, మైక్రోసాఫ్ట్, డెల్, బాష్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఎల్పీయూలో ప్లేస్మెంట్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నాయి. ఏటా ఎంతమంది ఎంపికవుతున్నారో అందరికీ తెలిసిందే. ఎల్పీయూ విద్యార్థులకు ఆయా సంస్థల్లో అత్యున్నత స్థాయి ఉద్యోగాలు లభిస్తున్నాయి. క్వాల్కామ్ వంటి టెక్నాలజీ సంస్థలూ ఎంపిక చేసుకుంటున్నాయి. ఐఐటీ, ఐఐఎమ్‌లకు వచ్చే 110కి పైగా కంపెనీలు ఎల్పీయూకూ వస్తున్నాయి. అన్ని రకాల విద్య, నైపుణ్యాలు, శిక్షణ అందించడంతో యాపిల్, గూగుల్ వంటి సంస్థలకూ విద్యార్థులు ఎంపికవుతున్నారు. ఆన్లైన్ ద్వారా ప్రవేశాలు కొవిడ్-19 మహమ్మారి ఉన్నప్పటికీ ప్రవేశాల కోసం విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రవేశాల ప్రక్రియను ఎల్పీయూ పూర్తిగా ఆన్లైన్ విధానంలోకి మార్చేసింది. దరఖాస్తు నుంచి ప్రవేశం వరకు ఆన్లైన్ ద్వారా సాధ్యమవుతుంది. ఫోన్ లేదా ల్యాప్‌ట్యాప్ ద్వారా ఈ ప్రక్రియల్లో పాల్గొనొచ్చు. ఇంటి నుంచే ఎల్‌పీయూఎన్‌ఈఎస్‌టీ పరీక్షకు హాజరుకావొచ్చు. ఎల్పీయూలో ప్రవేశాల కొరకు చివరి తేదీ త్వరలో ముగియనున్నది. మరిన్ని వివరాల కోసం www.lpu.in లేదా 1800 102 4057 ద్వారా సంప్రదించొచ్చు. యూనివర్సిటీ వాట్సాప్ నంబర్ 09876022222. (అడ్వర్టోరియల్) -
లవ్లీ ప్రొఫెషన్ల్ యునివర్సిటీకి నోటీసులు
చండీగఢ్ : లాక్డౌన్ నిబంధనలను ఉల్లఘింనందుకు పంజాబ్‌లోని లవ్లీ ఫ్రొఫెషనల్ యునివర్సటీ యాజమాన్యానికి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ శనివారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్రం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అత్యవసర సేవలు మినహా మిగతావన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదని కేంద్ర, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ఇందుకు పంజాబ్ ప్రభుత్వం మార్చి 13నుంచే రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యా సంస్థలును మూసివేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలవుతున్న వేళ పగ్వారాలోని కపుర్తలా జిల్లాలో ఉన్న లవ్లీ ప్రొఫెషన్ల్ యునివర్సిటీ నిబంధనలను బేఖాతరు చేసింది. దాదాపు 3వేల మందిని( విద్యార్థులు, ఫ్యాకల్టీతో కలిపి) క్యాంపస్ అనుబంధ హాస్టల్లో ఉండేదుకు యునివర్సిటీ యాజమాన్యం అనుమతులు ఇచ్చింది. తాజాగా ఏప్రిల్ 12న యునివర్సిటీలో ఉంటున్న విద్యార్థికి కరోనా పాజిటివ్ రావడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు ఉల్లఘించిన సదరు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వెంటనే రంగంలోకి దిగిన ఉన్నత విద్యాశాఖ అధికారులు ఎల్పీయూ యాజమన్యం తీరును తప్పుబడుతూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. (డ్రగ్స్ కేసులో పంజాబ్ సింగర్ అరెస్ట్) కరోనా విస్తరిస్తున్న వేళ ఇలా వేలమందిని ఒక దగ్గరే ఉంచి వారిని ప్రమాదంలోకి నెట్టేస్తారా అంటూ మండిపడింది. ఇంత ఆపత్కాల సమయంలో నిర్లక్ష్యం, బాధ్యతారహితంగా ఉంటారా అంటూ చివాట్లు పెట్టింది. ఎల్పీయూ యాజమాన్యానికి ఏడు రోజుల గడువును నిర్ధేశించిన అధికారులు సమయంలోగా అన్ని వివరాలు తెలపాలని ఆదేశించింది. వేల మందిని హాస్టల్లో ఉంచడానికి అనుమతులు ఎవరు ఇచ్చారని, ఎన్వోసీ చూపించాలని షోకాజ్ నోటీసులో పేర్కొంది. అంతకుముందు ఎమ్మెల్యే రాణా గురుజిత్ సింగ్ ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ద్రుష్టికి తీసుకెళ్లారు. దీంతో అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందు జాగ్రత్తగా వారందరికి కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాయి. ఇప్పటివరకు పంజాబ్ రాష్ట్రంలో 200కు పైగా కరోనా పాజిటివ్ కేసులు రాగా, మృతుల సంఖ్య 13గా ఉంది. తాజా ఉదంతంతో పంజాబ్ రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో చూడాలి. -
ఆమె జీతం రూ. 5.04 కోట్లు కాదు.. రూ. 42 లక్షలే
లవ్లీ ప్రొపెషనల్ యునివర్సిటీ(ఎల్పీయూ)కి చెందిన తాన్యా అరోరా అనే విద్యార్థినికి ఏడాదికి రూ. 5.04 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు వార్తలు కూడా వచ్చాయి. అయితే తాన్యా అరోరాకు ఉద్యోగం వచ్చిన విషయం వాస్తమే అయినప్పటికీ ఆమె వార్షిక వేతనం ఏడాదికి రూ. 42 లక్షలు మాత్రమే. ఏటా రూ. 5.04 కోట్ల భారీ వేతనంతో ఉద్యోగం వచ్చినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని తాజాగా తేలింది. ఇదే విషయంపై ఎల్పీయూ ట్విటర్ వేదికగా స్పందించింది. తాన్యా అరోరా ఎల్పీయూలో బీటెక్(సీఎస్ఈ) చదువుతోందని, ఈ మధ్యే మైక్రోసాఫ్ట్‌లో ఏడాదికి రూ.42 లక్షల వేతనంతో ఆమె ఉద్యోగం సాధించిందని ఎల్పీయూ తెలిపింది. ఏడాదికి రూ. 42 లక్షలు కాగా, దానిని నెలవారి వేతనంగా భావించి పొరపాటుగా ప్రచారం చేస్తున్నారని ఎల్పీయూ ట్వీట్ చేసింది. దీంతో ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని స్పష్టమైంది. -
ఎల్పీయూలో 3 లక్షలదాకా స్కాలర్షిప్
జలంధర్: పంజాబ్‌లోని జలంధర్‌లో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ)లో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి, ఉపకార వేతనానికి ఎల్‌పీయూనెస్ట్ అనే అర్హత పరీక్షను నిర్వహిస్తున్నట్లు ఎల్పీయూ ఓ ప్రకటనలో తెలిపింది. 58 దేశాల్లో ఈ పరీక్ష ఉంటుందనీ, విద్యార్థులు తాము ఎంచుకునే కోర్సును బట్టి రూ. 3 లక్షల వరకు ఉపకార వేతనం పొందొచ్చని ఎల్పీయూ వెల్లడించింది. విద్యార్థులు జూన్ 30లోపు ఎల్పీయూనెస్ట్కు దరఖాస్తు చేసుకోవాలనీ, ఈ ఎల్పీయూనెస్ట్తోపాటు బోర్డు పరీక్షలు, ఇతర జాతీయ స్థాయి పరీక్షల్లోనూ సాధించిన మార్కులను పరిగణనలోనికి తీసుకుని ఉపకార వేతనాలకు విద్యార్థులను ఎంపిక చేస్తామంది. -
సౌరశక్తితో నడిచే డ్రైవర్‌లెస్ బస్
ఫగ్వాడా (రాజస్థాన్): డ్రైవర్ లేకుండా నడిచే (స్వయంచాలిత) వాహనాల అభివృద్ధి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఊపందుకుంది. ఇందులో గూగుల్ ముందు వరుసలో ఉంది. డ్రైవర్‌లెస్ కారును రూపొందించి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది గూగుల్. కానీ వీటి వాడకం మాత్రం ఇంకా అధికారికంగా అందుబాటులోకి రాలేదు. ఇప్పటి వరకు రూపొందించిన అన్ని డ్రైవర్‌లెస్ వెహికిల్స్ డీజిల్ లేదా పెట్రోల్‌తో నడిచేవే. అయితే తొలిసారి సౌరశక్తితో నడిచే డ్రైవర్‌లెస్ వాహనాన్ని రూపొందించారు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు. ఒక్కసారి చార్జి చేస్తే ఈ బస్సు 70 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. తొలి నమూనా సిద్ధమైన ఈ వాహనానికి రూ.15 లక్షలే ఖర్చు కావడం విశేషం. రాజస్థాన్‌లోని ఫగ్వాడాలోగల లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి చెందిన 300 మంది విద్యార్థులు, 50 మంది అధ్యాపకులు సమిష్టిగా దీనిని తయారు చేశారు. యూనివర్సిటీ ప్రాంగణంలోని వర్క్‌షాప్‌లోనే దీనికి ప్రాణం పోశారు. 2014లో డ్రైవర్ లేని గోల్ఫ్‌కార్ట్ తయారు చేశామని, ఇప్పుడు ఒకడుగు ముందుకువేసి సౌరశక్తితో నడిచే డ్రైవర్ లెస్ బస్సును సిద్ధం చేశామని ప్రాజెక్ట్ లీడర్ మణిదీప్ సింగ్ చెప్పారు. -
కెరీర్ లక్ష్యంగా విద్యాబోధన
ఈ రోజుల్లో విద్య వ్యాపారమే. ఎవరూ కాదనలేని సత్యం ఇది. ధనార్జనే ధ్యేయంగా సంస్థలు నడిపేవాళ్లు ఎందరో ఉన్నారు. కానీ ఒక్క మినహాయింపుగా కనిపిస్తుంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ. దేశం నలుమూలల నుంచి దాదాపు 40 వేల మంది విద్యార్థులు జలంధర్ సమీపంలోని 600 ఎకరాల క్యాంపస్‌లో విద్యను అభ్యసిస్తుండటమూ.. ప్రైవేట్ యూనివర్సిటీగానే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహణ చేపట్టడమూ.. వర్సిటీ రూటు సపరేటు అనేందుకు తార్కాణాలు. 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను కూడా విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో యూనివర్సిటీ కులపతి అశోక్ మిట్టల్‌తో ‘సాక్షి’ప్రత్యేక ఇంటర్వ్యూ. ప్రశ్న: ఎల్పీయూలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులే 20 శాతం వరకూ ఉన్నారు కదా.. మరింత మందిని ఆకర్షించేందుకు దక్షిణాదిలో రెండో క్యాంపస్ ఏర్పాటు చేయవచ్చు కదా? జవాబు: ప్రపంచం మొత్తమ్మీద ఏ ఉన్నతస్థాయి విశ్వవిద్యాలయానికీ రెండో క్యాంపస్ లేదు. దక్షిణాదిలో ఇంకో క్యాంపస్ పెడితే. ఈ క్యాంపస్ మానవ వనరులను పంచుకోవాల్సి వస్తుంది. ఇది నాణ్యతతో రాజీపడటమే. నాణ్యమైన విద్య అందిస్తున్నందుకే అంత దూరం నుంచి విద్యార్థులు వస్తున్నారు. కాబట్టి రెండో క్యాంపస్ ఎందుకు? ప్ర: మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుందంటారు. మరి.. ఇంతమంది విద్యార్థుల కారణంగా బోధన నాణ్యత దెబ్బతింటుంది కదా..? జ: విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటం నాణ్యతకు ఏమాత్రం సమస్య కాదు. అందుబాటులో ఉన్న వనరులను పూర్తిస్థాయిలో ఉపయోగించుకునేందుకు ఇది సహకరిస్తుంది. ఉదాహరణకు ప్రభుత్వ వ్యవసాయ యూనివర్సిటీలకు వేల ఎకరాల భూమి ఉంది. విద్యార్థుల సంఖ్య తక్కువ. ఇది పరోక్షంగా పన్ను డబ్బులను వృథా చేయడమే. అక్కడ ఫీజులు తక్కువగానే ఉన్నా వనరుల దుర్వినియోగం అవుతున్న మాటేమిటి? ఎల్పీయూలో కరిక్యులం రూపకల్పన మొదలు.. పరీక్షల నిర్వహణ వరకూ అన్నింటినీ స్వతంత్ర వ్యవస్థల ఆధ్వర్యంలో నడుపుతున్నాం. అధ్యాపకుల బోధనకు సంబంధించి ప్రతీ క్లాస్ ఆడియో, వీడియో రికార్డింగ్ జరుగుతుంది. దీనిపై తరచూ సమీక్ష జరిపి వారి లోటుపాట్లను సరిదిద్దే వ్యవస్థనూ ఏర్పాటు చేశాం. వీటన్నింటికీ అదనంగా బయటి సంస్థల నిపుణులు మా విద్యార్థుల సామర్థ్యాలను అంచనా కట్టేందుకు అవకాశం కల్పిస్తున్నాం కూడా. ప్ర: ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ప్రమాణాలు క్షీణిస్తున్నాయని అంటున్నారు. మీ దృష్టిలో దీనికి కారణాలేమిటి? జ: అవి మా కంటే ముందుగా ఏర్పాటైన సంస్థలు. అంటే మాకు అన్నల్లాంటి వారు. లోపాలు ఉండవచ్చుగానీ.. ఆ తప్పులు ఎంచేందుకు నాకు ఏ హక్కూ లేదు. మాలోనూ కొన్ని లోపాలు ఉన్నాయి.. ఉంటాయి కూడా. వాటిని గుర్తుంచుకుని దిద్దుకోవడం మేం చేయగలిగిన పని. అదే పని అక్కడ కూడా జరుగుతోందని అనుకుంటున్నాం. ప్ర: విద్యావిధానం విషయంలో ఎల్పీయూ ప్రత్యేకత ఏమిటి? జ: మిగతా విద్యాసంస్థల్లో ముందు చదువు చెబు తారు. డిగ్రీ ఇస్తారు. విద్యార్థులకు ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది. ఎల్పీయూ ప్రణాళిక దీనికి పూర్తిగా భిన్నం. అందుబాటులో ఉన్న అన్ని రకాల ఉద్యోగ అవకాశాల అధ్యయనం తర్వాత వాటికి అవసరమైన నైపుణ్యాలు, అర్హతల ఆధారంగా కరికులం రూపొందిస్తాం. కోర్సు సాగినన్ని రోజులు విద్యార్థులు తమ ఇష్టాఇష్టాలకు తగిన ఉద్యోగాన్ని సంపాదించు కునేందుకు కావాల్సిన అన్ని రకాల శిక్షణకు అవకాశాలు కల్పిస్తాం. తొలి ఏడాదిలో అవకాశాల గురించి వివరిస్తే.. రెండో ఏడాది ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఉన్న మార్గాలను చెబుతాం. అవసరమైతే విద్యార్థి తన మునుపటి ఆప్షన్‌ను సరిచేసుకునేందుకూ వీలుంటుంది. ఈ ప్రణాళిక కారణంగానే ఎల్పీయూ విద్యార్థుల ఉద్యోగ అవకాశాలు 70–80 శాతం వరకూ ఉన్నాయి. జాగ్రఫీ డిగ్రీ చేసిన వారు కూడా మంచి ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. ప్ర: ఎల్పీయూలో 200 కోర్సుల వరకూ ఉన్నాయి. వీటి ఫీజుల గురించి చెబుతారా? జ: సగటున ఒక్కో ఇంజనీరింగ్ విద్యార్థి చెల్లించాల్సిన ఫీజు ఏడాదికి సగటున రూ.1.25 లక్షల వరకూ ఉంటుంది. ఈ వర్సిటీ రూటు సపరేటు అనేందుకు ఒక నిదర్శనం. హాస్టల్ ఫీజు రూ.50 వేల నుంచి మొదలవుతుంది. దేశంలోని ఏ ప్రైవేట్ యూనివర్సిటీ ఫీజులతో పోల్చినా ఇది 20 నుంచి 40 శాతం వరకూ తక్కువ. ఎల్పీయూ నెస్ట్ పరీక్షలో మంచి మార్కులు సంపాదించిన వారికి స్కాలర్‌షిప్పులూ ఇస్తున్నాం. ప్ర: ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఆర్ట్స్, హ్యుమానిటీస్ కోర్సులు ఉండటం చాలా అరుదు? జ: నిజమే. అయితే మానవ వికాసంలో ఆర్ట్స్, హ్యుమానిటీస్ రంగాలు చాలా కీలకమనేది మా నమ్మకం. పైగా విద్య ఏదో ఒక అంశానికి మాత్రమే పరిమితం కాకూడదన్న ఉద్దేశంతో మేము బీఏ, బీకామ్‌లతోపాటు ఫైన్ ఆర్ట్స్ కోర్సులూ ప్రవేశపెట్టాం. పైగా ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ సబ్జెక్టులు తెలుసుకోవడం అవసరమవుతుంది. ప్ర: ఎల్పీయూలో వైద్య విద్య కోర్సు లేకపోవడానికి ప్రత్యేక కారణమేమైనా ఉందా? జ: కొన్నేళ్ల క్రితం ఈ కోర్సు కోసం ప్రయత్నించాం. అయితే బోలెడన్ని అనుమతులు, నిబంధనలు ఉన్నాయి. పైగా అక్కడ వ్యవస్థ పనితీరు కూడా అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో మా ఆలోచన విరమించుకున్నాం. ఈ ప్రభుత్వ హయాంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రక్షాళనకు ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా.. అవి పూర్తయ్యాక ఆలోచిస్తాం. ప్ర: లవ్లీ మిఠాయి దుకాణం ద్వారా మీ ప్రస్థానం మొదలైంది. విద్యారంగం వైపు మళ్లేందుకు కారణాలు? జ: మిఠాయిల వ్యాపారం ద్వారా ఎంతో సంపాదించాం. సమాజానికి ఎంతో కొంతతిరిగి ఇచ్చేయాలని అనుకున్నాం. ఆస్పత్రులు కట్టడం మొదలుకొని వృద్ధాశ్రమాలు, ఇతర సేవ కార్యక్రమాలన్నింటినీ పరిశీలించాం. ప్రాథమిక స్థాయి విద్యా బోధనలో ప్రైవేట్ సంస్థలు ఇప్పటికే బాగా రాణిస్తున్న నేపథ్యంలో ప్రమాణాలు తగ్గిపోతున్నాయని భావించి ఉన్నత విద్యారంగంలోకి ప్రవేశించాం. సమాజ అభివృద్ధికి దోహదపడే ఉపాధి అవకాశాలు అందించడమే లక్ష్యంగా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. – గిళియార్ గోపాలకృష్ణ మయ్యా -
లైసెన్స్‌కూ ‘ఆధార’మే!
జలంధర్: దేశంలో డ్రైవింగ్ లైసెన్సులు పొందేందుకు త్వరలోనే ఆధార్‌ను తప్పనిసరి చేస్తామని కేంద్ర న్యాయ, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. దీనివల్ల నకిలీ, డూప్లికేట్ లైసెన్సుల జారీకి అడ్డుకట్ట పడుతుందన్నారు. పంజాబ్‌లోని జలంధర్‌లో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో జరిగిన 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో ఆయన మాట్లాడారు. డ్రైవింగ్ లైసెన్సులను ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు ఉద్దేశించిన బిల్లు ప్రస్తుతం పార్లమెంటులో పెండింగ్‌లో ఉందని ప్రసాద్ వెల్లడించారు. ‘పార్లమెంటులో పెండింగ్‌లో ఉన్న మోటార్ వాహనాల చట్టంలో మరో కీలక సవరణ చేయబోతున్నాం. త్వరలోనే మోటార్ వాహనాల లైసెన్సులకు ఆధార్‌ను అనుసంధానం చేయడం తప్పనిసరి కానుంది. వ్యక్తుల గుర్తింపును ధ్రువీకరించడంలో ఆధార్ అన్నది గొప్ప పరిణామం’ అని పేర్కొన్నారు. ఆధార్–డ్రైవింగ్ లైసెన్సు అనుసంధానంతో వచ్చే ప్రయోజనాలపై మాట్లాడుతూ..‘ఉదాహరణకు ఓ తాగుబోతు వాహనం నడుపుతూ నలుగురు వ్యక్తులను గుద్ది చంపేశాడనుకోండి. ప్రస్తుత పరిస్థితుల్లో అతను పంజాబ్ నుంచి మరో రాష్ట్రానికి పారిపోయి తప్పుడు డాక్యుమెంట్లతో కొత్త డ్రైవింగ్ లైసెన్సు పొందగలడు. కానీ ఆధార్‌తో డ్రైవింగ్ లైసెన్సును అనుసంధానిస్తే.. ఇలాంటి ఘటనలు నిలిచిపోతాయి. ఓ వ్యక్తి మహా అయితే తన పేరును మార్చుకోగలడు తప్ప చేతి వేలిముద్రలను మార్చుకోలేడు. ఎవరైనా వ్యక్తులు నకిలీ పేరుతో డ్రైవింగ్ లైసెన్సు పొందేందుకు యత్నిస్తే.. కొత్త వ్యవస్థ బయోమెట్రిక్ ఆధారంగా సదరు వ్యక్తికి ఇప్పటికే లైసెన్స్ ఉందని హెచ్చరిస్తుంది. అంతేకాకుండా వాహనదారుల ట్రాఫిక్ ఉల్లంఘనలు, జరిమానాలు ఆధార్‌తో అనుసంధానం అవుతాయి. దీనివల్ల జరిమానాలు కట్టకుండా వాహనాలు నడపడం కష్టమవుతుంది. ప్రస్తుతం దేశంలో 124 కోట్ల మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి’ అని పేర్కొన్నారు. -
సైన్స్ కాంగ్రెస్‌లో టైమ్ క్యాప్సూ్యల్
జలంధర్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వేదిక లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ(ఎల్పీయూ)లో శుక్రవారం ఒక చారిత్రక ఘట్టం నమోదు అయింది. ప్రస్తుతం మనుషులు రోజూ వాడుతున్న పరికరాలను టైమ్ క్యాప్సూ్యల్(కాలనాళిక)లో ఉంచి భూగర్భంలో నిక్షిప్తం చేశారు. నోబెల్ అవార్డు గ్రహీతలు డంకన్ హాల్డెన్, అవ్ రామ్ హెర్‡్ష కోవ్, థామస్ సుడాఫ్ ఒక మీట నొక్కగానేప్రత్యేకంగా తయారైన ఉక్కు అల్మారా భూమికి పది అడుగుల లోతైన గుంతలోకి వెళ్లింది. ఎల్పీయూలోని యునిపోలిస్ ఆడిటోరియంలో నిక్షిప్తమైన క్యాప్సూ్యల్‌ను 100 సంవత్సరాల తర్వాత తెరుస్తారు. స్మార్ట్‌ఫోన్, ల్యాప్ టాప్, డ్రోన్, వీఆర్ గ్లాస్, ఎలక్ట్రిక్ కుక్ టాప్‌లతో పాటు భారత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన పురోగతికి గుర్తుగా మంగళ్యాన్, తేజస్ యుద్ధ విమానం, బ్రహ్మోస్ క్షిపణి నమూనాలను అందులో దాచినట్లు ఎల్పీయూ చాన్స్‌లర్ అశోక్ మిట్టల్ తెలిపారు. మెచ్చినట్లుగా ముత్యాల తయారీ! ముత్యపు చిప్పలోకి ప్రత్యేక పద్ధతిలో ముత్యపు కేంద్రకాన్ని చొప్పించడం ద్వారా మనకు నచ్చిన ఆకారంలో ముత్యాలను తయారు చేసుకోవచ్చునని భారత వ్యవసాయ పరిశోధన సమాఖ్య (ఐసీఏఆర్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జేకే జెన్నా తెలిపారు. వినాయకుడి విగ్రహం మొదలుకొని వేర్వేరు ఆకారాల్లో వీటిని తయారు చేయవచ్చని తెలిపారు. పరిజ్ఞానం 15 ఏళ్లుగా ఉన్నా మానవవనరుల కొరత కారణంగా ప్రాచుర్యం పొందలేదన్నారు. -
జై జవాన్, జై కిసాన్.. జై అనుసంధాన్
జలంధర్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి/గురుదాస్‌పూర్: దేశంలోని కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఓ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పరిశోధన–అభివృద్ధి రంగంలో ఏ దేశపు శక్తిసామర్థ్యాలైనా అక్కడి జాతీయ పరిశోధనాశాలలు, ఐఐటీ, కేంద్రీయ విశ్వవిద్యాలయాల వంటి సంస్థలపై ఆధారపడి ఉంటాయని వ్యాఖ్యానించారు. ఈ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో పరిశోధనకు అనుకూలమైన వాతావరణాన్ని, వసతులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. చికున్ గున్యా, డెంగీ, మెదడువాపు వ్యాధులతో పాటు పౌష్టికాహారలోపంపై టెక్నాలజీ ఆధారిత, చవ ౖMðన పరిష్కారాన్ని భారత శాస్త్రవేత్తలు కనుగొనాల్సిన సమయం ఆసన్నమయిందని అభిప్రాయపడ్డారు. పంజాబ్‌లోని జలంధర్‌లో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ(ఎల్పీయూ)లో ప్రారంభమైన ‘106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్’ వేడుకలకు మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దివంగత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ‘జై జవాన్ జై కిసాన్’ అని నినాదం ఇచ్చారనీ, దానికి మాజీ ప్రధాని దివంగత వాజ్‌పేయి జై విజ్ఞాన్‌ను జోడించారనీ.. తాజాగా తాను దీనికి జై అనుసంధాన్ అనే పదాన్ని జోడిస్తున్నట్లు పేర్కొన్నారు. నాలుగేళ్లలోనే ఎక్కువ స్టార్టప్‌లు.. ప్రస్తుతం దేశంలోని విద్యార్థుల్లో 95 శాతం మంది రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో చేరుతున్నారని ప్రధాని తెలిపారు. ‘‘ఈ విద్యా సంస్థలో పరిశోధనల్ని ప్రోత్సహించేందుకు కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖతో చర్చించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ప్రధానమంత్రి శాస్త్ర, సాంకేతిక మండలిని కోరుతున్నా. దీనివల్ల వేర్వేరు మంత్రిత్వశాఖల మధ్య సమన్వయం పెరగడంతో పాటు విధానపరమైన ఉమ్మడి నిర్ణయాలను అమలు చేయడం వీలవుతుంది. ఇది ఇన్నొవేషన్, స్టార్టప్‌లకు ఎంతో అవసరం. గత 40 ఏళ్ల కంటే కేవలం గత నాలుగేళ్లలోనే టెక్నాలజీ రంగంలో ఎక్కువ స్టార్టప్‌లను స్థాపించాం. నేటి నినాదం ఏంటంటే ‘జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్’ ఈ నినాదానికి జై అనుసంధాన్ అనే పదాన్ని నేను జోడించాను’’ అని వెల్లడించారు. దేశంలోని జాతీయ సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు ఎక్కువగా జరుగుతున్నాయనీ, రాష్ట్ర స్థాయి వర్సిటీలు, కళాశాలల్లో వీటిని పెంపొందించాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. మళ్లీ ఆ అవకాశం వచ్చింది.. ‘భారత్‌లో ప్రాచీన జ్ఞానం అంతా పరిశోధన ద్వారా లభించిందే. గణితం, సైన్స్, కళలు, సంస్కృతి విషయంలో భారత్ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచింది. అదే స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఇండియాకు మరోసారి లభించింది. ఇందుకోసం దేశంలో కీలకమైన వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాలు ఏకమై మన పరిశోధనలు, ఆవిష్కరణల ద్వారా ప్రపంచానికి దిశానిర్దేశం చేయాల్సి ఉంటుంది. బిగ్ డేటా అనాలసిస్, కృత్రిమ మేధ, బ్లాక్ చైన్ టెక్నాలజీని వ్యవసాయ రంగంలో ముఖ్యంగా చిన్న కమతాలు ఉన్న రైతులకు సాయంచేసేందుకు వినియోగించాలి. ప్రజల జీవితాలను మరింత సుఖమయం చేసేలా శాస్త్రవేత్తల పరిశోధనలు కొనసాగాలి’ అని మోదీ పేర్కొన్నారు. భవిష్యత్ అంతా కనెక్టెట్ టెక్నాలజీలదే అని ప్రధాని వ్యాఖ్యానించారు. దేశంలోని పరిశోధన–అభివృద్ధి రంగం వాణిజ్యపరంగా ముందుకు వెళ్లాలనీ, అప్పుడే సరికొత్త పారిశ్రామిక ఉత్పత్తులతో భారత్‌కు లబ్ధి చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. దేశీయ సాంకేతికత అభివృద్ధి అవసరం: సతీశ్ భారత రక్షణ రంగానికి సంబంధించి భవిష్యత్ అవసరాలను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు డీఆర్డీవో చైర్మన్ డా.జి.సతీశ్ రెడ్డి తెలిపారు. తర్వాతితరం రక్షణ వ్యవస్థలకు సంబంధించి పదార్థాలు, స్మార్ట్ వస్త్రాలు, తయారీ రంగం, త్రీడీ ప్రింటింగ్‌పై దృష్టి సారించినట్లు వెల్లడించారు. ఈ కొత్త సాంకేతికతలను దేశీయంగా, చవకగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సైబర్ భద్రత రంగంలో ఇజ్రాయెల్ అగ్రగామిగా నిలవడానికి అక్కడి యువతే కారణమన్నారు. వారికి సీఎం పదవులిస్తోంది పంజాబ్‌లో రుణమాఫీపై పెద్దపెద్ద మాట లు చెప్పిన కాంగ్రెస్ అధికారం దక్కాక మాత్రం రైతులను మోసగించిందని ప్రధాని మోదీ విమర్శించారు. గతంలో పేదరికాన్ని తరిమేద్దాం(గరీబీ హఠావో) పేరుతో ప్రజలను ఏళ్ల పాటు మోసం చేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు రైతులను రుణమాఫీ పేరుతో మోసం చేస్తున్నారన్నా రు. అంతేకాకుండా 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో పాల్గొన్నవారికి పార్టీ ముఖ్యమంత్రి పదవులను కూడా అప్పగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుదాస్‌పూర్‌లో గురువారం జరిగిన సభలో మాట్లాడుతూ.. ‘కేవలం ఒకే కుటుంబం ఆదేశాలతో అల్లర్లలో పాలుపంచుకున్న వ్యక్తుల కేసు ఫైళ్లను మరుగున పడేశారు. కానీ వీటిని వెలికితీసిన ఎన్డీయే ప్రభుత్వం విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. దాని ఫలితాలు ఇప్పుడు మీముందు ఉన్నాయి’ అని తెలిపారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి పాక్‌లోని కర్తార్‌పూర్ వరకూ కర్తార్‌పూర్ కారిడార్ నిర్మించాలని కేంద్రం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. కర్ణాటకలో రైతులు రుణాలు చెల్లించకపోవడంతో పోలీసులు అరెస్ట్‌చేయడానికి వస్తున్నారనీ, దీంతో రైతులు ఇళ్ల నుంచి పారిపోతున్నారన్నారు. -
డ్రైవర్ అక్కర్లేని సోలార్ బస్
సాక్షి, హైదరాబాద్: లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ(ఎల్పీయూ) విద్యార్థులు దేశంలోనే తొలి డ్రైవర్ రహిత, సౌరశక్తితో నడిచే బస్‌కు రూపకల్పన చేశారు. వర్సిటీలో జనవరి 3 నుంచి జరిగే జాతీయ సైన్స్ కాంగ్రెస్ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ బస్సు లో తొలిసారిగా ప్రయాణిస్తారని యూనివర్సిటీ చాన్స్‌లర్ అశోక్ మిట్టల్ తెలిపారు. త్వరలోనే ఈ బస్‌ను వాణిజ్య వినియోగంలోకి కూడా తెస్తామ న్నారు. దీన్ని రూపొందించేందుకు విద్యార్థులు ప్రత్యేకంగా వెహికల్ టు వెహికల్ (విటువి) టెక్నాలజీని వినియోగించారని, దీనివల్ల అల్ట్రా సోనిక్, ఇన్ఫ్రారెడ్ సంకేతాల ఆధారంగా, జీపీఎస్, బ్లూటూత్ ద్వా రా నేవిగేషన్ ప్రక్రియ సాగు తుందని తెలిపారు. సౌరశక్తి, బ్యాటరీ ఇంజిన్‌తో నడిచే ఈ బస్ విలువ సాధారణ బస్‌లతో పోలిస్తే రూ.6 లక్షలు అధికమని పేర్కొన్నారు. బస్సు సామర్థ్యం ఆధారంగా 10 నుంచి 30 మంది వరకు ప్రయాణించవచ్చని, 30 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుందని వివరించారు. -
ఎల్పీయూ స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి
జలంధర్: పంజాబ్‌లోని జలంధర్‌లో జరిగిన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ(ఎల్పీయూ) 9వ స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆ తర్వాత స్నాతకోత్సవంలో భాగంగా గోల్డ్ మెడల్ సాధించిన 98 మంది టాపర్లకు, పీహెచ్డీ డిగ్రీలు పూర్తి చేసిన 54 మంది విద్యార్థులకు డిగ్రీలు, మెడల్స్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్య ప్రదానం చేశారు. స్నాతకోత్సవంలో యూనివర్సిటీ 2017, 2018 బ్యాచ్‌లకు చెందిన 38,000 మంది విద్యార్థులకు డిగ్రీలు/డిప్లమోలను ప్రదానంచేసింది. వీరితోపాటు 13,018 మంది రెగ్యులర్ విద్యార్థులు, 223 మంది పార్ట్‌టైమ్, 24,685 మంది డిస్టెన్స్ విద్యార్థులు డిగ్రీ/డిప్లమోలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ విద్యార్థులతోపాటు 70కిపైగా దేశాల నుంచి వచ్చి ఎల్పీయూలో విద్యనభ్యసించిన విదేశీ విద్యార్థులూ డిగ్రీ/డిప్లమోలు సాధించారు. ఈ కార్యక్రమంలో ఎల్పీయూ చాన్స్‌లర్ అశోక్ మిట్టల్, వైస్ చాన్స్‌లర్ నరేశ్ మిట్టల్, ఉన్నతాధికారులు, వేలాది మంది విద్యార్థులు, తల్లిదండులు పాల్గొన్నారు. -
సైన్స్ కాంగ్రెస్‌పై పంజాబ్ గవర్నర్ సమీక్ష
జలంధర్: పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ(ఎల్పీయూ)లో వచ్చే ఏడాది జనవరిలో జరగబోయే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఏర్పాట్లను పంజాబ్ గవర్నర్ వీపీసింగ్ బాద్నోర్ పరిశీలించారు. గవర్నర్ వెంట 40 మందితో కూడిన భారత ప్రభుత్వ ప్రతినిధి బృందం ఉంది. ఇప్పటి వరకు జరిగిన ఏర్పాట్లపై గవర్నర్, ప్రతినిధి బృందం సంతృప్తి వ్యక్తం చేశారని వర్సిటీ వర్గాలు తెలిపాయి. రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన పనులపై సూచనలు చేశారని తెలిపాయి. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, కౌన్సిల్ సభ్యులను ఉద్దేశించి బాద్నోర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా క్యాంపస్‌లో 106వ సైన్స్ కాంగ్రెస్ విజ్ఞాన్ జ్యోతి ర్యాలీని నిర్వహించారు. -
పాపులారిటీలో ఎల్‌పీయూకు 5వ ర్యాంకు
జలంధర్: పాపులారిటీ పరంగా దేశంలో ఢిల్లీ యూనివర్సిటీ అన్ని విద్యా సంస్థల్లోకెల్లా అగ్రస్థానంలో నిలిచింది. జలంధర్ కేంద్రంగా పనిచేస్తున్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ(ఎల్పీయూ)కి ఐదో స్థానం దక్కింది. ప్రముఖ విద్యా సంస్థలు, వర్సిటీలకు ర్యాంకులు ప్రకటించే అంతర్జాతీయ సంస్థ ‘యూనిర్యాంక్’ 2018 ఏడాదికి తాజాగా జాబితాను విడుదల చేసింది. 878 ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులిచ్చింది. కాన్పూర్, మద్రాస్, బాంబే ఐఐటీలు వరుసగా 2, 3, 4 స్థానాలు పొందాయి. ఐఐటీ ఖరగ్‌పూర్‌కు ఆరు, ఐఐటీ ఢిల్లీకి 8వ ర్యాంకులు దక్కాయి. -
ఎల్పీయూలో సైన్స్ కాంగ్రెస్
జలంధర్: వచ్చే ఏడాది జరిగే 106వ జాతీయ సైన్స్ కాంగ్రెస్‌కు జలంధర్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ(ఎల్పీయూ) ఆతిథ్యమివ్వనుంది. 2019, జనవరి 3–7 మధ్య జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. 300 మంది ప్రముఖ శాస్త్రవేత్తలు, నోబెల్ గ్రహీతలు సహా సుమారు 15 వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ‘ఫ్యూచర్ ఇండియా: సైన్స్ అండ్ టెక్నాలజీ’ అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వైద్యం, పర్యావరణం, రసాయన శాస్త్రం తదితరాలపై సుమారు 18 ప్లీనరీ సెషన్లు జరుగుతాయి. జాతీయ సైన్స్ కాంగ్రెస్‌కు ఆతిథ్యమిచ్చే గౌరవం దక్కడంపై ఎల్పీయూ చాన్స్‌లర్ అశోక్ మిట్టల్ హర్షం వ్యక్తం చేశారు. -
టాప్–40 బిజినెస్ స్కూళ్లలో ఎల్పీయూ
జలంధర్: నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్ఐఆర్ఎఫ్)ర్యాంకింగ్‌లలో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ మిట్టల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ దేశంలోని టాప్–40 బిజినెస్ స్కూళ్లలో ఒకటిగా నిలిచింది. ఎల్పీయూ ఫార్మసీ డిపార్ట్మెంట్ 26వ స్థానంలో నిలిచింది. మానవ వనరుల అభివృద్ధి శాఖ ఈ ర్యాంకులను ప్రకటించింది. పంజాబ్ యూనివర్సిటీ, ఐఐఎం రాంచీ, బిట్స్ లాంటి ఉన్నత విద్యా సంస్థలను అధిగమించి ఎల్పీయూ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ పంజాబ్ రీజియన్‌లో అగ్రస్థానం దక్కించుకుంది. ‘ఔట్రీచ్ అండ్ ఇంక్లూజివిటీ’ విభాగంలో అన్ని ఐఐఎంలను దాటుకుని తొలిస్థానంలో నిలిచింది. -
ఎల్పీయూ అవార్డుల ప్రదానం
న్యూఢిల్లీ: ఉత్తమ పాఠశాలలు, ఉపాధ్యాయులకు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ‘ఎల్పీయూ ట్రాన్స్ఫార్మింగ్ ఎడ్యుకేషన్’ అవార్డులను తన నివాసంలో ప్రదానం చేశారు. దేశవ్యాప్తంగా 89 పాఠశాలలు, 29 కోచింగ్ సెంటర్లకు రూ. కోటి విలువైన గ్రాంట్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు ప్రోత్సాహకంగా నగదు బహుమతులను అందజేశారు. విద్యార్థులతో మాట్లాడేందుకు వీలుగా ‘ప్రణబ్ సర్ కి పాఠశాల’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా తొలి కార్యక్రమంలో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ(ఎల్పీయూ) విద్యార్థులతో ముచ్చటిస్తూ.. రిజర్వేషన్లు, సమానత్వం, భావి భారత దార్శనికత తదితర అంశాలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. -
రిపబ్లిక్ డే పరేడ్‌కు ఎల్పీయూ విద్యార్థిని
జలంధర్: ఈ ఏడాది జనవరి 26న ఢిల్లీలో నిర్వహించే రిపబ్లిక్ డే పరేడ్‌కు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ(ఎల్పీయూ)కి చెందిన అంబికా మిశ్రా ఎంపికయ్యారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన అంబిక ప్రస్తుతం ఎల్పీయూలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్‌గా ఏడాదిలో 145 గంటలు పనిచేయడంతో పాటు కథక్ నృత్యం, పాటలు, ఉపన్యాసం తదితర విభాగాల్లో చూపిన ప్రతిభ ఆధారంగా అంబిక పరేడ్‌కు ఎంపికైనట్లు ఎల్పీయూ చాన్స్‌లర్ అశోక్ మిట్టల్ తెలిపారు. -
మిమ్మల్ని, దేశాన్ని, సృష్టికర్తను నమ్మండి
లవ్లీ వర్శిటీ స్నాతకోత్సవంలో యువతకు కామన్వెల్త్ ఆఫ్ డొమినికా ప్రధాని స్కెర్రిట్ పిలుపు జలంధర్: ప్రపంచాన్ని సానుకూలంగా ఎదుర్కోవడానికి మిమ్మల్ని, మీ దేశాన్ని, సృష్టికర్తను విశ్వసించాలని.. అప్పుడే ప్రతి ఒక్కరు ఒక ప్రధాని, సీఈవో, ప్రపంచ ప్రసిద్ధ ఎంట్రప్రెన్యూర్లు కాగలుగుతారని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) విద్యార్థులను ఉద్దేశించి కామన్వెల్త్ ఆఫ్ డొమినికా (నార్త్ అమెరికా) ప్రధాని రూజ్వెల్ట్ స్కెర్రిట్ పిలుపునిచ్చారు. యూనివర్సిటీలోని శాంతి దేవీ మిట్టల్ ఆడిటోరియంలో మంగళవారం జరిగిన వర్సిటీ ఆరో స్నాతకోత్సవంలో ప్రపంచంలోనే అత్యంత పిన్నవయసు ప్రధాని అయిన స్కెర్రిట్ పాల్గొన్నారు. స్కెర్రిట్ పాలనా దక్షతకు, ప్రపంచ వ్యాప్తంగా శాంతిని నెలకొల్పడానికి చేస్తున్న కృషికిగాను వర్సిటీ ఆయనకు ‘ఆనరిష్ కాసా డాక్టర్ ఆఫ్ లెటర్స్’ డిగ్రీని ప్రదానం చేసింది. అనంతరం పెద్ద సంఖ్యలో హాజరై విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఉద్దేశించి స్కెర్రిట్ మాట్లాడుతూ ఎల్పీయూలో అందుకున్న ఈ గౌరవాన్ని ఇరు దేశాల యువతకు అంకితం ఇస్తున్నట్టు ఆయన తెలిపారు. విద్యార్థులు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పరస్పరం కలసి పనిచేయడానికి తాను భారత్‌లో ఎల్పీయూతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఆసక్తితో ఎదురుచూస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన 2015 బ్యాచ్‌కు సంబంధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్‌ను ప్రదానం చేశారు. మొత్తం 7,810 మంది విద్యార్థులు డిగ్రీలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో డొమినికా రిపబ్లిక్ క్యాబినెట్ సెక్రటరీ స్టీవ్ ఫెర్కొల్, అజిత్ గ్రూప్ పబ్లికేషన్స్ చీఫ్ ఎడిటర్ పద్మ భూషణ్ డా.బర్జిందర్ సింగ్ హమ్దార్, లవ్లీ గ్రూప్ చైర్మన్ రమేష్ మిట్టర్, వైస్ చైర్మన్ నరేష్ మిట్టల్, ఎల్పీయూ చాన్స్‌లర్ అశోక్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు. స్కెర్రిట్ 31 ఏళ్ల వయసులో ప్రధాని పదవి చేపట్టారు. -
మారిషస్ అధ్యక్షుడికి లవ్లీ వర్సిటీ డాక్టరేట్
జలంధర్: మారిషస్ అధ్యక్షుడు రాజ్‌కేశ్వర్ పుర్యాగ్ను ప్రతిష్టాత్మక లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. ఈ నెల 20, 21వ తేదీల్లో నిర్వహించిన నాలుగో స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయనకు డాక్టరేట్ అందజేసినట్లు వర్సిటీ ఒక ప్రకటనలో పేర్కొంది. పంజాబ్ గవర్నర్ కప్తాన్‌సింగ్ సోలంకి, సీఎం ప్రకాశ్‌సింగ్ బాదల్‌తో పాటు లవ్లీ గ్రూప్ చైర్మన్ రమేశ్ మిట్టల్, వైస్ చైర్మన్ నరేశ్ మిట్టల్, వర్సిటీ చాన్స్‌లర్ అశోక్ మిట్టల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని.. ఈ స్నాతకోత్సవంలో 2013, 2014 బ్యాచ్‌లకు చెందిన 306 మంది అకడమిక్ టాపర్లతో పాటు మొత్తంగా 30,878 మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేశామని తెలిపింది. ఈ సందర్భంగా తనను డాక్టరేట్‌తో సత్కరించిన లవ్లీ వర్సిటీకి మారిషస్ అధ్యక్షుడు కృతజ్ఞతలు తెలిపారు. -
ఎల్పీయూ బీటెక్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు
జలంధర్: పంజాబ్‌లోని ప్రఖ్యాత లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) అందించే బీటెక్ కోర్సులకు ప్రవేశ పరీక్ష 'ఎల్పీయూ నేషనల్ ఎంట్రెన్స్ అండ్ స్కాలర్షిప్ టెస్ట్ (ఎల్‌పీయూనెస్ట్-2015)' దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ అమ్మకాల వెబ్సైట్ ఫ్లిప్కార్ట్లోనూ దరఖాస్తులను పొందేలా ఎల్పీయూ ఒప్పందం కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా 113 నగరాల్లో మార్చి నుంచి మే వరకు ఈ పరీక్షను ఆన్లైన్లో నిర్వహిస్తారు. విద్యార్థులు తమకు అనుకూలమైన సమయంలో అపాయింట్మెంట్ తీసుకుని పరీక్షకు హాజరుకావచ్చు. మరిన్ని వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ను చూడవచ్చు. -
ఎల్పీయూలో భారీగా క్యాంపస్ రిక్రూట్మెంట్లు
జలంధర్: పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ)లో ఈ ఏడాది భారీ ఎత్తున క్యాంపస్ రిక్రూట్మెంట్లు జరిగాయి. 150కిపైగా ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో పాటు దాదాపు 300 కంపెనీలు ఎల్పీయూ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించాయి. కాగ్నిజెంట్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఐబీఎం, హెచ్‌పీ, టీసీఎస్, వొడాఫోన్ వంటి గ్లోబల్ కంపెనీలతో పాటు ఈసారి కొత్తగా అనేక సంస్థలు ఎల్పీయూలో రిక్రూట్మెంట్లు నిర్వహించాయి. ఐటీ, కన్సల్టెన్సీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇంజనీరింగ్, ఫ్యాషన్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, ఫార్మా, రిటైల్, హోటల్ మేనేజ్మెంట్ వంటి రంగాలకు సంబంధించిన ప్రఖ్యాత కంపెనీల్లో ఉద్యోగాలు పొందారు.