LPU (Lovely Professional University): గూగుల్ ‌లాంటి పెద్ద కార్పొరేట్‌ సంస్థల్లో ఆఫర్లు | The Indian University Where Google and Microsoft Hire - Sakshi
Sakshi News home page

గూగుల్ ‌లాంటి పెద్ద కార్పొరేట్‌ సంస్థల్లో ఆఫర్లు

Published Wed, May 13 2020 4:41 PM | Last Updated on Thu, Jul 28 2022 7:24 PM

Placements Join Lovely Professional University  - Sakshi

విద్యావ్యవస్థ రోజురోజుకీ సాంకేతిక సంతరించుకుంటోంది. పాఠశాల స్థాయి నుంచే టెక్నాలజీ పరంగా మార్పులెన్నో చోటు చేసుకుంటున్నాయి. ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలు ఆధునిక బాటలో పయనిస్తున్నాయి. ఉన్నత విద్యకు సంబంధించి యూనివర్సిటీలు మాత్రం ఆధునికత, సాంకేతికను అందిపుచ్చుకోవడంలో ముందంజ వేయడం లేదు. ఒకవైపు అగ్రశ్రేణి ప్రభుత్వ యూనివర్సిటీలు మౌలిక సదుపాయాల కల్పన కోసమే ప్రయత్నిస్తుంటే మరోవైపు ప్రైవేటు వర్సిటీలు నాణ్యమైన విద్య, సహజ అభ్యసన పద్ధతులు, పరిశ్రమ శిక్షణతో పాటు మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ వంటి భారీ సంస్థలకు ఎంపికయ్యేలా కంప్లీట్‌ ప్యాకేజీని అందిస్తున్నాయి.

అలా.. కంప్లీట్‌ ప్యాకేజీని అందిస్తున్న విద్యా సంస్థల్లో ముందుంది లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ (ఎల్‌పీయూ). 2005లో స్థాపించిన నాటి నుంచి నాణ్యమైన విద్యను అందిస్తూ ఎదిగింది. భారతదేశంలో అతిపెద్ద సింగిల్‌ క్యాంపస్‌ యూనివర్సిటీగా పేరు పొందింది. అతి తక్కువ వ్యవధిలోనే ఉన్నత విద్యలో నూతన ప్రమాణాలు నెలకొల్పింది. తిరుగులేని ప్లేస్‌మెంట్‌ రికార్డులు ఇప్పటికే దీనిని నిరూపించాయి. ఏటా లవ్లీ యూనివర్సిటీ విద్యార్థులను బహుళ జాతి సంస్థలు (ఎంఎన్‌సీ) ఎంపిక చేసుకుంటున్నాయి.

అమెజాన్‌, శాప్‌, సిస్కో, మైక్రోసాఫ్ట్‌, ఇన్ఫోసిస్‌, బాష్‌, డెల్‌ సహా మరెన్నో కంపెనీలు పేస్ల్‌మెంట్‌ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నాయి. మీకో సంగతి తెలుసా! ఎల్‌పీయూ ఇంజినీరింగ్‌ విద్యార్థి తాన్య అరోరాను 2019లో మైక్రోసాఫ్ట్‌ రూ.42 లక్షల వార్షిక ప్యాకేజీతో ఎంపిక చేసుకుంది. ఆ ఏడాది అప్పుడే బయటకు వచ్చిన ఇంజినీరింగ్‌ విద్యార్థి పొందిన అత్యధిక వేతనం ఇదే.

భారీ కంపెనీలు ఎల్‌పీయూ విద్యార్థులనే ఎంచుకోవడానికి కారణమేంటి?
ఒక విద్యార్థి విద్యాసంస్థ నుంచి బయటకు వచ్చినప్పుడు అతడి చేతిలో సర్టిఫికెట్‌ మాత్రమే ఉండటం ముఖ్యం కాదు. పరిశ్రమల్లో పనిచేసేందుకు అవసరమైన ప్రతిభ, విజ్ఞానంతో అతడు సిద్ధంగా ఉండాలి. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌తో పాటు వ్యక్తిగత, పరిశ్రమ నైపుణ్యాల్లో ఆరితేరాలి. ఎల్‌పీయూ ఇదే చేస్తోంది. అందుకే లవ్లీ విద్యార్థులను ఎంపిక చేసుకొనేందుకు, భారీ ఆఫర్లు ఇచ్చేందుకు కంపెనీలన్నీ ముందుకొస్తున్నాయి.

మరి విద్యార్థులను ఎల్‌పీయూ ఎలా సిద్ధం చేస్తోంది?
ఏదైనా ఒక ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించాలంటే దానికి రాకెట్‌, లాంచ్‌ప్యాడ్‌ అవసరం. విద్యార్థులు పరిశ్రమల్లోకి అడుగుపెట్టేందుకు అవసరమైన అత్యద్భుతమైన మౌలిక వసతులు, సాంకేతికత రూపంలో ఎల్‌పీయూ లాంచ్‌ప్యాడ్‌లను ఏర్పాటు చేసింది. ప్రపంచ స్థాయిలో ఎయిరో డైనమిక్‌, ఐమ్యాక్‌ ల్యాబ్‌, ప్రతి రంగానికీ సంబంధించిన ప్రయోగశాలల్ని నెలకొల్పింది. వీటిని ఉపయోగించుకోవడం వల్ల విద్యార్థుల ప్రాక్టికల్‌ స్కిల్స్‌ మెరుగవుతాయి. ఇక సొంత వ్యాపారాలు ఆరంభించేందుకు, అందులో ఆరితేరేందుకు విద్యార్థులే నడిపే ఆన్‌ క్యాంపస్‌ షాపింగ్‌ మాల్‌ ఇక్కడుంది. దీంతో వ్యాపార, వాణిజ్య నైపుణ్యాలు వారికి అబ్బుతున్నాయి. వీటితో పాటు క్యాంపస్‌లో అతిపెద్ద క్రీడా ప్రాంగణం ఉంది. ఒలింపిక్‌ పోటీల పరిమాణంలో ఈత కొలను ఉంది. ఆన్‌క్యాంపస్‌ ఆస్పత్రి, ఆరు అంతస్తుల్లో గ్రంథాలయం, ఆధునిక తరగతి గదులు, ఆడిటోరియాలు ఉన్నాయి. విద్యార్థులకు అవసరమైన ప్రతిదీ ఎల్‌పీయూలో ఉంటుంది.(అడ్వర్టోరియల్‌)

గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ ఎంపిక చేసుకుంటున్న భారత వర్సిటీ.. ఎల్‌పీయూ
విద్యావ్యవస్థ రోజురోజుకీ సాంకేతిక సంతరించుకుంటోంది. పాఠశాల స్థాయి నుంచే టెక్నాలజీ పరంగా మార్పులెన్నో చోటు చేసుకుంటున్నాయి. ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలు ఆధునిక బాటలో పయనిస్తున్నాయి. ఉన్నత విద్యకు సంబంధించి యూనివర్సిటీలు మాత్రం ఆధునికత, సాంకేతికను అందిపుచ్చుకోవడంలో ముందంజ వేయడం లేదు. ఒకవైపు అగ్రశ్రేణి ప్రభుత్వ యూనివర్సిటీలు మౌలిక సదుపాయాల కల్పన కోసమే ప్రయత్నిస్తుంటే మరోవైపు ప్రైవేటు వర్సిటీలు నాణ్యమైన విద్య, సహజ అభ్యసన పద్ధతులు, పరిశ్రమ శిక్షణతో పాటు మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ వంటి భారీ సంస్థలకు ఎంపికయ్యేలా కంప్లీట్‌ ప్యాకేజీని అందిస్తున్నాయి.

వైవిధ్యానికి పెద్దపీట
భారతీయులే కాకుండా 50+ దేశాల నుంచి విద్యార్థులు ఎల్‌పీయూకు వస్తారు. ఇది భిన్నత్వంలో ఏకత్వం తరహా సంస్కృతిని నెలకొల్పింది. వాతావరణం వైవిధ్యభరితంగా ఉంటుంది. బహుళ సంస్కృతులకు ఇక్కడి విద్యార్థులు అలవాటు పడివుంటారని గుర్తించిన అంతర్జాతీయ కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి.

అకాడమిక్స్
అధ్యాపక బృందం: విద్యార్థులకు పరిశ్రమలపై అవగాహన, అనుభవం, మార్గదర్శనం అవసరం. ఎల్‌పీయూలో వివిధ రంగాలకు చెందిన నిపుణులు, అనుభవజ్ఞులు అధ్యాపక బృందంలో ఉన్నారు.
లైవ్‌ ప్రాజెక్టులు: విద్యార్థులకు ప్రత్యక్ష శిక్షణ, అనుభవం ఎంతో అవసరం. ఇందుకోసం ఎల్‌పీయూ విద్యార్థుల చేత సౌర విద్యుత్‌ కార్ల తయారీ సహా ఎన్నో లైవ్‌ ప్రాజెక్టులను చేయిస్తోంది. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ విద్యార్థులు ఇక్కడ సొంతంగా ఓ హోటల్‌ను నడిపిస్తున్నారు.
పరిశ్రమ అనుభవం: ఎల్‌పీయూ విద్యతో పాటు పరిశ్రమ అనుభవం అందిస్తోంది. ఫుల్‌టైమ్‌ ఐచ్ఛిక/తప్పనిసరి ఇంటర్న్‌షిప్‌లు, వేసవి శిక్షణ, వైజ్ఞానిక పర్యటనలు, ఆన్‌ ద జాబ్‌ ట్రైనింగ్‌ సహా మరెన్నో ఎక్స్‌ట్రా కరిక్యులమ్‌ యాక్టివిటీస్‌ను విద్యకు అనుసంధానం చేసింది.
అతిథి ఉపన్యాసాలు/కార్యశాలలు: వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారితో ఎల్‌పీయూ నిరంతరం ఉపన్యాసాలు ఏర్పాటు చేస్తుంది. వర్క్‌షాప్స్‌ను నిర్వహిస్తుంది.

ప్లేస్‌మెంట్‌ వర్క్‌షాప్స్
ఉద్యోగం వస్తుందా రాదా అనేది విద్యార్థిపై ఆధారపడి ఉంటుంది. ప్లేస్‌మెంట్‌ సెషన్స్‌ ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు ఎల్‌పీయూ ప్రయత్నిస్తోంది. మున్ముందు జరగబోయే ఇంటర్వ్యూల్లో విజయవంతం అయ్యేందుకు విద్యార్థులకు మెంటార్‌షిప్‌ను ఏర్పాటు చేసింది. దీంతో పాటు సాఫ్ట్‌స్కిల్స్‌ కోర్సులను అందిస్తోంది. అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, డెల్‌, బాష్‌ వంటి అంతర్జాతీయ సంస్థలు ఎల్‌పీయూలో ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నాయి. ఏటా ఎంతమంది ఎంపికవుతున్నారో అందరికీ తెలిసిందే. ఎల్‌పీయూ విద్యార్థులకు ఆయా సంస్థల్లో అత్యున్నత స్థాయి ఉద్యోగాలు లభిస్తున్నాయి. క్వాల్‌కామ్‌ వంటి టెక్నాలజీ సంస్థలూ ఎంపిక చేసుకుంటున్నాయి. ఐఐటీ, ఐఐఎమ్‌లకు వచ్చే 110కి పైగా కంపెనీలు ఎల్‌పీయూకూ వస్తున్నాయి. అన్ని రకాల విద్య, నైపుణ్యాలు, శిక్షణ అందించడంతో యాపిల్‌, గూగుల్‌ వంటి సంస్థలకూ విద్యార్థులు ఎంపికవుతున్నారు.

 

ఆన్‌లైన్‌ ద్వారా ప్రవేశాలు
కొవిడ్‌-19 మహమ్మారి ఉన్నప్పటికీ ప్రవేశాల కోసం విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రవేశాల ప్రక్రియను ఎల్‌పీయూ పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలోకి మార్చేసింది. దరఖాస్తు నుంచి ప్రవేశం వరకు ఆన్‌లైన్‌ ద్వారా సాధ్యమవుతుంది.  ఫోన్‌ లేదా ల్యాప్‌ట్యాప్‌ ద్వారా ఈ ప్రక్రియల్లో పాల్గొనొచ్చు. ఇంటి నుంచే ఎల్‌పీయూఎన్‌ఈఎస్‌టీ పరీక్షకు హాజరుకావొచ్చు. ఎల్‌పీయూలో ప్రవేశాల కొరకు చివరి తేదీ త్వరలో ముగియనున్నది. మరిన్ని వివరాల కోసం www.lpu.in లేదా 1800 102 4057 ద్వారా సంప్రదించొచ్చు. యూనివర్సిటీ వాట్సాప్‌ నంబర్ 09876022222. (అడ్వర్టోరియల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement