మారిషస్ అధ్యక్షుడికి లవ్లీ వర్సిటీ డాక్టరేట్ | Lovely University and a doctorate from the President of Mauritius | Sakshi
Sakshi News home page

మారిషస్ అధ్యక్షుడికి లవ్లీ వర్సిటీ డాక్టరేట్

Published Fri, Apr 24 2015 12:36 AM | Last Updated on Sun, Sep 3 2017 12:45 AM

మారిషస్ అధ్యక్షుడికి లవ్లీ వర్సిటీ డాక్టరేట్

మారిషస్ అధ్యక్షుడికి లవ్లీ వర్సిటీ డాక్టరేట్

జలంధర్: మారిషస్ అధ్యక్షుడు రాజ్‌కేశ్వర్ పుర్యాగ్‌ను ప్రతిష్టాత్మక లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. ఈ నెల 20, 21వ తేదీల్లో నిర్వహించిన నాలుగో స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయనకు డాక్టరేట్ అందజేసినట్లు వర్సిటీ ఒక ప్రకటనలో పేర్కొంది.

పంజాబ్ గవర్నర్ కప్తాన్‌సింగ్ సోలంకి, సీఎం ప్రకాశ్‌సింగ్ బాదల్‌తో పాటు లవ్లీ గ్రూప్ చైర్మన్ రమేశ్ మిట్టల్, వైస్ చైర్మన్ నరేశ్ మిట్టల్, వర్సిటీ చాన్స్‌లర్ అశోక్ మిట్టల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని.. ఈ స్నాతకోత్సవంలో 2013, 2014 బ్యాచ్‌లకు చెందిన 306 మంది అకడమిక్ టాపర్లతో పాటు మొత్తంగా 30,878 మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేశామని తెలిపింది. ఈ సందర్భంగా తనను డాక్టరేట్‌తో సత్కరించిన లవ్లీ వర్సిటీకి మారిషస్ అధ్యక్షుడు కృతజ్ఞతలు తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement