
పోర్ట్ లూయిస్/న్యూఢిల్లీ: మార్చి 12వ తేదీన జరిగే మారిషస్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ గౌరవ అతిథిగా హాజరుకానున్నారు. మారిషస్ ప్రధానమంత్రి రాం గులామ్ శుక్రవారం జాతీయ అసెంబ్లీలో ఈ విషయం ప్రకటించారు. ద్వైపాక్షిక సన్నిహిత సంబంధాలకిది నిదర్శనమన్నారు.
‘నా ఆహ్వానం మేరకు మన దేశ 57వ స్వాతంత్య్ర దినం సందర్భంగా జరిగే జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సహృదయంతో అంగీకరించారని తెలిపేందుకు ఎంతో సంతోషిస్తున్నాను’అని ఆయన తెలిపారు. ఇటీవలే ఫ్రాన్స్, అమెరికాల్లో పర్యటనలు ముగించుకుని వచ్చిన మోదీ బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ తన ఆహా్వనాన్ని మన్నించారన్నారు.