జలంధర్: పంజాబ్‌లోని జలంధర్‌లో జరిగిన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ(ఎల్‌పీయూ) 9వ స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆ తర్వాత స్నాతకోత్సవంలో భాగంగా గోల్డ్ మెడల్ సాధించిన 98 మంది టాపర్లకు, పీహెచ్‌డీ డిగ్రీలు పూర్తి చేసిన 54 మంది విద్యార్థులకు డిగ్రీలు, మెడల్స్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్య ప్రదానం చేశారు. స్నాతకోత్సవంలో యూనివర్సిటీ 2017, 2018 బ్యాచ్‌లకు చెందిన 38,000 మంది విద్యార్థులకు డిగ్రీలు/డిప్లమోలను ప్రదానంచేసింది.
వీరితోపాటు 13,018 మంది రెగ్యులర్ విద్యార్థులు, 223 మంది పార్ట్‌టైమ్, 24,685 మంది డిస్టెన్స్ విద్యార్థులు డిగ్రీ/డిప్లమోలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ విద్యార్థులతోపాటు 70కిపైగా దేశాల నుంచి వచ్చి ఎల్‌పీయూలో విద్యనభ్యసించిన విదేశీ విద్యార్థులూ డిగ్రీ/డిప్లమోలు సాధించారు. ఈ కార్యక్రమంలో ఎల్‌పీయూ చాన్స్‌లర్ అశోక్ మిట్టల్, వైస్ చాన్స్‌లర్ నరేశ్ మిట్టల్, ఉన్నతాధికారులు, వేలాది మంది విద్యార్థులు, తల్లిదండులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment