
జలంధర్: నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్‌ఐఆర్‌ఎఫ్)ర్యాంకింగ్‌లలో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ మిట్టల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ దేశంలోని టాప్–40 బిజినెస్ స్కూళ్లలో ఒకటిగా నిలిచింది. ఎల్‌పీయూ ఫార్మసీ డిపార్ట్‌మెంట్ 26వ స్థానంలో నిలిచింది.
మానవ వనరుల అభివృద్ధి శాఖ ఈ ర్యాంకులను ప్రకటించింది. పంజాబ్ యూనివర్సిటీ, ఐఐఎం రాంచీ, బిట్స్ లాంటి ఉన్నత విద్యా సంస్థలను అధిగమించి ఎల్‌పీయూ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ పంజాబ్ రీజియన్‌లో అగ్రస్థానం దక్కించుకుంది. ‘ఔట్‌రీచ్ అండ్ ఇంక్లూజివిటీ’ విభాగంలో అన్ని ఐఐఎంలను దాటుకుని తొలిస్థానంలో నిలిచింది.