ఎల్‌పీయూలో 3 లక్షలదాకా స్కాలర్‌షిప్‌ | Students enrolling at LPU can avail scholarship upto Rs 3 lakhs till 30th June | Sakshi
Sakshi News home page

ఎల్‌పీయూలో 3 లక్షలదాకా స్కాలర్‌షిప్‌

Published Tue, Jun 18 2019 4:54 AM | Last Updated on Tue, Jun 18 2019 4:54 AM

Students enrolling at LPU can avail scholarship upto Rs 3 lakhs till 30th June - Sakshi

జలంధర్‌: పంజాబ్‌లోని జలంధర్‌లో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ (ఎల్‌పీయూ)లో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి, ఉపకార వేతనానికి ఎల్‌పీయూనెస్ట్‌ అనే అర్హత పరీక్షను నిర్వహిస్తున్నట్లు ఎల్‌పీయూ ఓ ప్రకటనలో తెలిపింది. 58 దేశాల్లో ఈ పరీక్ష ఉంటుందనీ, విద్యార్థులు తాము ఎంచుకునే కోర్సును బట్టి రూ. 3 లక్షల వరకు ఉపకార వేతనం పొందొచ్చని ఎల్‌పీయూ వెల్లడించింది. విద్యార్థులు జూన్‌ 30లోపు ఎల్‌పీయూనెస్ట్‌కు దరఖాస్తు చేసుకోవాలనీ, ఈ ఎల్‌పీయూనెస్ట్‌తోపాటు బోర్డు పరీక్షలు, ఇతర జాతీయ స్థాయి పరీక్షల్లోనూ సాధించిన మార్కులను పరిగణనలోనికి తీసుకుని ఉపకార వేతనాలకు విద్యార్థులను ఎంపిక చేస్తామంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement