Eligibility Test
-
సర్కార్ బడికి క్యూ
సాక్షి, సిద్దిపేట: ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి మీ పిల్లలను మా పాఠశాలలో జాయిన్ చేయించాలని తల్లిదండ్రులను కోరుతుంటారు. కానీ ఈ ప్రభుత్వ పాఠశాలలో సీన్రివర్స్గా మారింది. తల్లిదండ్రులే తమ పిల్లలను ఈ ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని ప్రవేశాల కోసం క్యూ కడుతున్నారు. అది ఎక్కడ అనుకుంటున్నారా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నతపాఠశాల. ఈ పాఠశాలను మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు దత్తత తీసుకున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా విద్యాబోధన అందిస్తుండటంతో ప్రవేశాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ పాఠశాలలో 1,208 మంది విద్యార్థులున్నారు. రాష్ట్రంలోనే మూడో అతి పెద్ద ప్రభుత్వ పాఠశాలగా దీనికి గుర్తింపు వచ్చింది. 6 నుంచి 10వ తరగతి వరకు.. ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో ఈ విద్యా సంవత్సరానికిగాను 6 నుంచి పదో తరగతి వరకు ప్రవేశాలకు ఈ నెల 12వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. 6వ తరగతిలో 200 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అదే పాఠశాల ప్రాంగణంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 5వ తరగతి పూర్తి చేసి.. 6వ తరగతి ప్రవేశం కోసం 61 మంది వచ్చారు. ఇంకా 129 సీట్లకు ఇతర పాఠశాలలకు చెందిన విద్యార్థులను ఎంపిక చేస్తారు. 6 నుంచి 10వ తరగతి వరకు 161 సీట్లు ఖాళీగా ఉండగా 630 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. దీంతో ప్రతిభ ఉన్న వారికి అవకాశం కలి్పంచాలనే ఉద్దేశంతో ఈ నెల 13న విద్యార్థులకు ప్రవేశపరీక్ష నిర్వహించారు. ఇఫ్లూ దత్తతఇందిరానగర్ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను హైదరాబాద్‌కు చెందిన ఇఫ్లూ (ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్) యూనివర్సిటీ దత్తత తీసుకుంది. 9వ తరగతి విద్యార్థులకు స్పాని‹Ù, ఫ్రెంచ్, స్పోకెన్ ఇంగ్లిష్ నేరి్పస్తున్నారు. 150 మంది విద్యార్థులకు వివిధ భాషలు నేరి్పంచారు. ఈ ఏడాది మరో 150 మందికి నేరి్పంచేందుకు ప్రణాళికలు రూపొందించారు. గురు, శుక్ర వారాల్లో ఆన్లైన్లో బోధిస్తుండగా, తరగతిగదిలో శనివారం ప్రొఫెసర్లు నేరుగా వచ్చి బోధిస్తున్నారు. విద్యార్థులు ధారాళంగా స్పాని‹Ù, ఫ్రెంచ్ భాషల్లో మాట్లాడుతున్నారు. డ్రామా, స్కిట్లు, సాంగ్స్ కూడా పాడుతున్నారు.రోబోటిక్స్... ఇందిరానగర్ పాఠశాలలో రోబోటిక్స్ విద్యను హైదరాబాద్‌కు చెందిన సోహం అకడమిక్ హ్యూమన్ ఎక్సలెన్స్ అనే స్వచ్ఛంద సంస్థ అందిస్తోంది. మూడు సంవత్సరాలుగా ప్రతీ ఏడాది 100 మంది విద్యార్థులకు నేరి్పస్తున్నారు. వారంలో రెండు రోజులు క్లాసులు నిర్వహిస్తున్నారు.గర్వపడుతున్నాం.. మెరుగైన విద్య, సౌకర్యాలు కల్పింస్తుండటంతో విద్యార్థులను చేర్పించేందుకు తల్లిదండ్రులు ముందుకు వస్తున్నారు. అందుకు గర్వపడుతున్నాం. విద్యార్థుల తాకిడి పెరగడంతో స్క్రీనింగ్‌కు పరీక్ష పెట్టాం. వీటిలో వచి్చన మార్కులు, వారి కుటుంబపరిస్థితిని బట్టి అడ్మిషన్లు ఇస్తాం. ఈ నెల 20తేదీలోగా ఎంపిక పూర్తవుతుంది. – రాజప్రభాకర్‌రెడ్డి, హెచ్ఎం, జెడ్పీ హైసూ్కల్, ఇందిరానగర్ సీటు కోసం వచ్చాను మా తమ్ముడి భార్య చనిపోయింది. నా మేనల్లుడిని ఇందిరానగర్ స్కూల్లో 6వ తరగతిలో చేరి్పంచేందుకు వచ్చాను. పరీక్ష రాయించాను. ఇందులో చదివితే విద్యావంతుడు అవుతాడని నమ్మకంతో సీటు కోసం తిరుగుతున్నా. – బాలలక్ష్మి, సిద్దిపేటఈ ఏడాది కొత్తగా ఎన్సీసీ ఈ ఏడాది కొత్తగా ఎన్సీసీ ప్రవేశపెట్టారు. కరీంనగర్‌కు చెందిన 9వ బెటాలియన్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నారు. 8వ తరగతి నుంచి 50 మంది విద్యార్థులను ఎంపిక చేస్తారు. ⇒ ఈ పాఠశాల విద్యార్థులు ట్రిపుల్ ఐటీ, కా ర్పొరేట్ కళాశాలలో ఉచిత సీట్లకు ఎంపికవుతున్నారు. 2023–2024 విద్యా ఏడాదిలో 231 మంది పదో తరగతి పరీక్ష రాయగా 229 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇటీవల విడుదలైన పాలిసెట్‌లో వెయ్యిలోపు ఐదుగురు విద్యార్థులు ర్యాంకులు సాధించారు. -
పదోన్నతులకు టెట్ చిక్కులు
సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఇప్పుడు సమస్యగా మారింది. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన విధానం వెల్లడించకపోతే పదోన్నతులు క్లిష్టంగా మారనున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పాఠశాల విద్యాశాఖాధికారులు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఉపాధ్యాయ సంఘాలు కూడా ముందుగా దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాయి. వీలైనంత త్వరగా డిపార్ట్మెంటల్ పరీక్ష తరహాలో దీన్ని నిర్వహించాలని సూచిస్తున్నాయి. టెట్ చేపట్టమని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పెద్దగా పట్టించుకోలేదని, దీనివల్ల తాము నష్టపోయామని పేర్కొంటున్నాయి. జాతీయ విద్యా విధానం–2020 అమలుకు సిద్ధమవుతున్న నేపథ్యంలోనూ టెట్ అర్హతకు ప్రాధాన్యత పెరిగిందని వారు అంటున్నారు. ఎప్పుడో చెప్పిన కేంద్రం ప్రతి ఉపాధ్యాయుడు విధిగా టెట్ పాసవ్వాలని కేంద్రం 2012లోనే నిబంధన విధించింది. పాసైన వారికే పదోన్నతులు కల్పించాల్సి ఉంటుంది. వాస్తవానికి 2012కు ముందు రాష్ట్రంలో టెట్ లేదు. జిల్లా నియామక మండలి పరీక్ష ద్వారానే టీచర్ల ఎంపిక జరిగింది. అందువల్ల అనేక మందికి టెట్ అర్హత ఉండే అవకాశం లేదని రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. టెట్ తప్పనిసరి నుంచి మినహాయింపు పొందింది. రాష్ట్రావిర్భావం తర్వాత కూడా ఇదే విధానం కొనసాగుతోంది. తాజా గా దీనిపై కేంద్రం మళ్ళీ స్పందించింది. ఉపాధ్యాయులందరికీ టెట్ తప్పనిసరి చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టారు. ఎన్నికల ముందు జరిగిన ఈ ప్రక్రియపై కొంతమంది కోర్టును ఆశ్రయించారు. టెట్ అర్హత ఉంటేనే పదోన్నతి కల్పించాల్సి ఉంటుందనే నిబంధనను కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో కోర్టు పదోన్నతులపై స్టే ఇచ్చింది. దీనిపై నిర్ణయం తీసుకునేలోపే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఖాళీలు తెలిసేందుకూ వీల్లేదు! రాష్ట్రంలో టెట్ ఉత్తీర్ణులు 4 లక్షల మంది ఉన్నారు. వీళ్ళంతా ఉపాధ్యాయ పోస్టుల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులు. కాగా ప్రభుత్వ టీచర్లు 1.05 లక్షల మంది ఉన్నారు. వీరిలో 2012 తర్వాత రిక్రూట్ అయిన 15 వేల మందికి మాత్రమే టెట్ అర్హత ఉంది. అంటే దాదాపు 90 వేల మంది టీచర్లకు అర్హత లేదు. దీంతో వీళ్ళు పదోన్నతులు పొందేందుకు అవకాశం ఉండదు. ఎస్జీటీలను స్కూల్ అసిస్టెంట్లుగా, స్కూల్ అసిస్టెంట్లను హెచ్ఎంలుగా పదోన్నతులు కల్పించాల్సి ఉంటుంది. అయితే పదోన్నతుల ప్రక్రియ ఆగిపోవడంతో కచ్చితమైన ఖాళీలు తెలిసే వీల్లేకుండా పోయింది. దీంతో టీచర్ రిక్రూట్మెంట్ ప్రక్రియకూ బ్రేకులు పడుతున్నాయి. దీన్ని నివారించేందుకు 80 వేల మంది టీచర్లకు డిపార్ట్మెంట్ టెస్ట్ మాదిరి అంతర్గతంగా టెట్ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. ఇదొక్కటే ప్రస్తుతం ఉన్న మార్గమని సూచిస్తున్నారు. ఏప్రిల్ లోపు ఈ తరహా టెట్ నిర్వహిస్తే.. వచ్చే జూన్, జూలైలో పదోన్నతులు చేపట్టేందుకు వీలుంటుందని చెబుతున్నారు. అయితే ప్రభుత్వం దృష్టి పెడితే తప్ప ఈ సమస్య పరిష్కారమయ్యే అవకాశం కన్పించడం లేదు. -
2,878 పరీక్ష కేంద్రాలు... 39,600 మంది ఇన్విజిలేటర్లు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విభాగాల్లో గ్రూప్–4 ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించిన అర్హత పరీక్షల నిర్వహణకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఒకవైపు అత్యధిక సంఖ్యలో పోస్టులు... మరోవైపు అత్యధిక సంఖ్యలో అభ్యర్థులుండటంతో టీఎస్పీఎస్సీ వ్యూహాత్మక కార్యాచరణతో చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో 9 వేల గ్రూప్–4 ఉద్యోగ ఖాళీలున్నాయి. వీటికి 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా... గురువారం రాత్రి వరకు 8.55 లక్షల మంది అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల పరిధిలో 2,878 పరీక్ష కేంద్రాల్లో గ్రూప్–4 పరీక్షల నిర్వహణకు కమిషన్ ఏర్పాట్లు చేసింది. ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక లైజన్ అధికారి, ఒక చీఫ్ సూపరింటెండెంట్ ఉంటారు. ఈ పరీక్షా కేంద్రాల పరిధిలో దాదాపు 40 వేల పరీక్ష హాల్లలో అభ్యర్థులను సర్దుబాటు చేస్తారు. ఒక్కో పరీక్ష హాలులో గరిష్టంగా 24 మంది అభ్యర్థులుంటారు. పరీక్షల నిర్వహణలో ఇన్విజిలేటర్ల పాత్ర కీలకం. దీంతో ఇన్విజిలేటర్లకు ప్రత్యేకంగా శిక్షణ సైతం టీఎస్పీఎస్సీ ఇచ్చింది. జూలై 1న శనివారం ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు పేపర్లు ఉంటాయి. పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రం గేట్లు మూసివేస్తారు. పరీక్ష కేంద్రంలో పక్కాగా పరిశీలన... గ్రూప్–4 ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో ఉండటంతో ఆశావహులు సైతం భారీగా ఉన్నారు. ఈ క్రమంలో అభ్యర్థుల పరిశీలన, నిర్ధారణకు టీఎస్పీఎస్సీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇన్విజిలేటర్లకు సైతం నిర్ధారణ బాధ్యతలు అప్పగించింది. తొలుత పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించే సమయంలో అభ్యర్థి హాల్‌టిక్కెట్‌తో పాటు గుర్తింపు కార్డులు పరిశీలిస్తారు. ఆ తర్వాత అభ్యర్థిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. అభ్యర్థులకు కనీసం బెల్టు సైతం అనుమతించబోమని టీఎస్పీఎస్సీ ఇప్పటికే తేల్చి చెప్పింది. పరీక్ష హాలులో అభ్యర్థిని ఇన్విజిలేటర్ మరోమారు తనిఖీ చేస్తారు. హాల్ టికెట్‌లోని ఫోటో ద్వారా, అభ్యర్థి ఫోటో గుర్తింపు కార్డు ద్వారా పరిశీలిస్తారు. ఆ తర్వాత ఓటీఆర్‌లో ఉన్న సంతకం ఆధారంగా అభ్యర్థి చేసిన సంతకాన్ని పరిశీలిస్తారు. నామినల్‌రోల్స్ పైన సంతకం తప్పనిసరి చేసింది. దీంతో పాటు అభ్యర్థి వేలిముద్రను పరీక్ష హాలులోనే సమర్పించాలి. ఐదు పద్ధతుల్లో ఎక్కడ పొరపాటు గుర్తించినా అభ్యర్థిని పరీక్షకు అనుమతించమని టీఎస్పీఎస్సీ తేలి్చచెప్పింది. గ్రూప్–4 పరీక్ష ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహిస్తున్నట్లు కమిషన్ తెలిపింది. ఓఎంఆర్ జవాబు పత్రంలో అభ్యర్థి ముందుగా హాల్‌టిక్కెట్ నంబర్, ప్రశ్నపత్రం కోడ్‌ను బబ్లింగ్ చేయాలి. ఓఎంఆర్ జవాబు పత్రంపై అభ్యర్థి హాల్‌టిక్కెట్ నంబర్, ఫోటో ఉంటాయని వస్తున్న ఊహాగానాలను పట్టించుకోవద్దని కమిషన్ ఇప్పటికే స్పష్టం చేసింది. తాళి తొలగిస్తే ఊరుకోం టీఎస్పీఎస్సీకి వీహెచ్‌పీ హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థినుల నుంచి మంగళ సూత్రాలను తొలగిస్తే ఊరుకునేది లేదని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) టీఎస్పీఎస్సీని హెచ్చరించింది. రకరకాల నిబంధనలతో హిందువులను అవమానిస్తే ఊరుకునేది లేదని, సంప్రదాయాలను మంటగలిపే దుర్మార్గమైన చర్యలకు పాల్పడితే తీవ్ర ప్రతిఘటన ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు గురువారం టీఎస్సీపీఎస్సీ చైర్మన్, కార్యదర్శికి వీహెచ్‌పీ రాష్ట్ర కార్యదర్శి పండరినాథ్, ఉపాధ్యక్షుడు జగదీశ్వర్, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వినర్ శివ రాములు తదితరులు కలిసి వినతి పత్రం సమర్పించారు. -
పరీక్షలు ముగిశాయి.. ఫలితాలే తరువాయి..
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లోని వివిధ తరగతుల్లో బ్యాక్లాగ్ ఖాళీలు, ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత పరీక్షల నిర్వహణ ఈనెల 10తో ముగిసిఇంది. నాలుగు సొసైటీల పరిధిలో అర్హత పరీక్షలన్నీ ముగియడంతో ఫలితాల విడుదలకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. మైనార్టీ గురుకుల సొసైటీ మినహా టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్, టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్, ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్, టీఎంఆర్ఈఐఎస్, టీఎస్ఆర్ఈఐఎస్లు ఐదోతరగతితో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాయి. వీటితో పాటు 6, 7, 8 తరగతుల్లో బ్యాక్లాగ్ ఖాళీలకు సొసైటీలు వేర్వేరుగా అర్హత పరీక్షలు నిర్వహించాయి. జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరం అడ్మిషన్లకు సైతం ఏ సొసైటీకా సొసైటీ అర్హత పరీక్షలు ముగిశాయి. ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీల పరిధిలోని సైనిక పాఠశాలల్లో ప్రవేశాలు, బీసీ గురుకుల సొసైటీ పరిధిలో అగ్రికల్చర్ డిగ్రీ, ఫ్యాషన్ టెక్నాలజీ డిగ్రీ ప్రవేశాలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ(ఈఎంఆర్ఎస్)లో ఆరోతరగతి ప్రవేశాలకు సంబంధించి ప్రత్యేకంగా సెట్ నిర్వహించారు. ఈ పరీక్షల ఫలితాలన్నీ వరుసగా విడుదల చేసేందుకు ఆయా సొసైటీలు సన్నద్ధమయ్యాయి. అర్హత పరీక్షల ఫలితాలను మరో వారం రోజుల్లో విడుదల చేసేందుకు గురుకుల సొసైటీలు సన్నద్ధమవుతున్నాయి. ముందుగా పాఠశాలల్లో ప్రవేశాల ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు చర్యలు మొదలుపెట్టారు. ఐదో తరగతి అడ్మిషన్లకు నిర్వహించిన వీటీజీసెట్–2023 ఫలితాలను వచ్చే వారాంతంలో విడుదల చేయనున్నారు. -
‘గురుకుల’ పోస్టుల పరీక్షలన్నీ ఆన్లైన్లోనే..!
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల్లోని ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అర్హత పరీక్షల నిర్వహణపై తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) పునరాలోచన చేస్తోంది. ప్రస్తుత నోటిఫికేషన్లలో పరీక్షలను ఓఎంఆర్ ఆధారితంగా లేదా ఆన్లైన్లో నిర్వహిస్తామని ప్రకటించినప్పటికీ... ఓఎంఆర్ ఆధారిత పరీక్షలకే ఏర్పాట్లు చేస్తూ వచ్చింది. కానీ టీఎస్పీఎస్సీలో పలు పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో ఓఎంఆర్ ఆధారిత పరీక్షల విధానంపై తర్జనభర్జన పడుతోంది. మరోవైపు టీఎస్పీఎస్సీ అన్ని రకాల పరీక్షలను కంప్యూటర్ ఆధారిత (కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్–సీబీఆర్టీ) విధానంలోనే నిర్వహించేందుకు చర్యలు చేపట్టడంతో గురుకుల ఉద్యోగ అర్హత పరీక్షలను కూడా ఈ విధానంలోనే నిర్వహించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను టీఆర్‌ఈఐఆర్‌బీ పరిశీలిస్తోంది. పరిమిత సౌకర్యాలున్నా.... కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానం అమలుకు రాష్ట్రంలో పరిమిత సౌకర్యాలే ఉన్నాయి. ప్రైవేటు ఏజెన్సీల ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో సెంటర్లున్నప్పటికీ ఒకే సమయంలో పరీక్ష నిర్వహిస్తే గరిష్టంగా 32 వేల మందే హాజరయ్యే వీలుంది. దీంతో గురుకుల పోస్టులకు లక్షల సంఖ్యలో అభ్య ర్థులుండటంతో ఈ విధానం అమలు సాధ్యం కాదని టీఆర్‌ఈఐఆర్‌బీ తొలుత భావించింది. కానీ ఒకే దఫా పరీక్షల నిర్వహణకు పోస్టులన్నీ ఒకే కేటగిరీకి సంబంధించినవి కాకపోవడంతో విడివిడిగా పరీక్షల నిర్వహణ అంశాన్ని బోర్డు పరిశీలిస్తోంది. టీజీటీ, పీజీటీ కేటగిరీలోనే 70% కొలువులున్నాయి. ఈ పోస్టుల్లో 15 సబ్జెక్టులున్నాయి. ఇవిగాకుండా జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ కేటగిరీల్లోనూ సబ్జెక్టుల వారీగా పోస్టులున్నాయి. ఒక సబ్జెక్టు పరీక్ష రాసే అభ్యర్థి మరో సబ్జెక్టును ఎంపిక చేసుకొనే అవకాశాలు తక్కువ. దీంతో ఒక్కో సబ్జెక్టు ఆధారంగా ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించడం సాధ్యమేనని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం గురుకుల ఉద్యోగాలకు సంబంధించి న దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మే 28 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించనున్నారు. దీంతో దరఖాస్తు గడువు ముగిశాక అందే దరఖాస్తుల సంఖ్యపై స్పష్టత రానుంది. ఈ క్రమంలో పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంటుందని బోర్డు అధికారులు అభిప్రాయపడుతున్నారు. బుకింగ్‌తో ముందుకు... గురుకుల పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో నిర్వహించాలంటే అందుకోసం ఆన్లైన్ టెస్టింగ్ ఏజెన్సీలతో ఒప్పందం తప్పనిసరి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని టెస్టింగ్ ఏజెన్సీలతో ఒప్పందం కోసం గురుకుల నియామకాల బోర్డు సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా కేంద్రాలు ఏయే తేదీల్లో ఖాళీగా ఉన్నాయనే వివరాలు సేకరిస్తోంది. ఖాళీగా ఉన్న తేదీల్లో పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై గురుకుల బోర్డు సమీక్షించనుంది. -
నవంబర్ 7న ఎఫ్ఎస్వో అర్హత పరీక్ష
సాక్షి, హైదరాబాద్: ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నవంబర్ 7న అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల హాల్‌టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. అభ్యర్థులు వెంటనే హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని, అర్హత పరీక్షను సీబీఆర్టీ పద్ధతిలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. హాల్టికెట్లలో నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా అభ్యర్థులు సన్నద్ధం కావాలని సూచించింది. -
ఇంటి నుంచే జీఆర్ఈ, టోఫెల్
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా విదేశీ విద్యకోసం నిర్వహించే జీఆర్ఈ, టోఫెల్ అర్హతా పరీక్షలను చైనా, ఇరాన్లో మినహా విద్యార్థులు ఇంటి నుంచే రాయవచ్చని ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్(ఈటీఎస్) వెల్లడించింది. పరీక్షా కేంద్రాల్లో నిర్వహించాల్సిన జీఆర్ఈ, టోఫెల్‌లను కోవిడ్ కారణంగా రద్దు చేశారు. ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రాలకు హాజరయ్యే పరిస్థితులు ఏర్పడే వరకూ ఇంటివద్దనుంచే పరీక్షలు రాసేందుకు అవకాశం ఇస్తున్నట్లు టోఫెల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీకాంత్ గోపాల్ వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి, ప్రోక్టార్ యూ అనే రిమోట్ పద్ధతుల ద్వారా పరీక్షలను పర్యవేక్షిస్తామని తెలిపారు. జీఆర్ఈలో జవాబు పత్రాన్ని తిరిగి సరిచేసుకునే అవకాశమూ, టోఫెల్లో రీడింగ్, లిజనింగ్ స్కోర్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. జూన్‌లో రాసే పరీక్షలకు రిజస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. -
ఎల్పీయూలో 3 లక్షలదాకా స్కాలర్షిప్
జలంధర్: పంజాబ్‌లోని జలంధర్‌లో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ)లో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి, ఉపకార వేతనానికి ఎల్‌పీయూనెస్ట్ అనే అర్హత పరీక్షను నిర్వహిస్తున్నట్లు ఎల్పీయూ ఓ ప్రకటనలో తెలిపింది. 58 దేశాల్లో ఈ పరీక్ష ఉంటుందనీ, విద్యార్థులు తాము ఎంచుకునే కోర్సును బట్టి రూ. 3 లక్షల వరకు ఉపకార వేతనం పొందొచ్చని ఎల్పీయూ వెల్లడించింది. విద్యార్థులు జూన్ 30లోపు ఎల్పీయూనెస్ట్కు దరఖాస్తు చేసుకోవాలనీ, ఈ ఎల్పీయూనెస్ట్తోపాటు బోర్డు పరీక్షలు, ఇతర జాతీయ స్థాయి పరీక్షల్లోనూ సాధించిన మార్కులను పరిగణనలోనికి తీసుకుని ఉపకార వేతనాలకు విద్యార్థులను ఎంపిక చేస్తామంది. -
అర్హత పరీక్షల్లో రిజర్వేషన్‌కు వీల్లేదు
న్యూఢిల్లీ: అర్హత పరీక్షల్లో రిజర్వేషన్లు ఉండటానికి వీల్లేదని సుప్రీంకోర్టు తేల్చింది. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటీఈటీ–(సీటెట్)–2019లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను జడ్జీలు జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ సంజీవ్ ఖన్నాల వెకేషన్ బెంచ్ సోమవారం విచారించింది. ఎవరికైనా రిజర్వేషన్ అనేది అడ్మిషన్ల వేళ మాత్రమే పరిశీలనలోకి వస్తుందంది. అర్హత పరీక్షలకు రిజర్వేషన్ అనేది అర్ధరహితమని పేర్కొంది. సీటెట్ అనేది అర్హత పరీక్ష మాత్రమేనని, రిజర్వేషన్ అంశం అడ్మిషన్ల సమయంలోనే తెరపైకి వస్తుందని తెలిపింది. జూలై 7వ తేదీన జరగనున్న సీటెట్ పరీక్ష నోటిఫికేషన్ గురించి పిటిషనర్ తరఫు లాయర్ ప్రస్తావించగా ధర్మాసనం స్పందించింది. ఈ పరీక్ష నోటిఫికేషన్ ఎస్సీలకు కానీ, ఎస్టీలకుగానీ రిజర్వేషన్ ఇవ్వడం లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో తొలుత పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు..ఈ అంశాన్ని పరిశీలించాల్సిందిగా లాయర్ మరోసారి అభ్యర్థించడంతో తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. సీటెట్–2019 నిర్వహణ కోసం సీబీఎస్ఈ జనవరి 23వ తేదీన పత్రికా ప్రకటన జారీ చేసింది. ఐఏఎస్, ఐపీఎస్‌ల కేడర్‌పై విచారణ 2018 బ్యాచ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేడర్ కేటాయింపులు చెల్లవంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు కోర్టు అంగీకరించింది. జస్టిస్ ఇందిర, జస్టిస్ సంజీవ్‌ల బెంచ్ సోమవారం ఈ పిటిషన్‌ను విచారించింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ తన వాదనలు వినిపిస్తూ.. 2018 ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు శిక్షణ పూర్తి చేసుకుని, కేటాయించిన కేడర్లలో ఈ నెల 10వ తేదీన వారు జాయిన్ కావాల్సి ఉందన్నారు. ఈ సమయంలో అధికారుల కేటాయింపుల ప్రక్రియను మళ్లీ చేపట్టాలంటూ హైకోర్టు ఆదేశించిందని తెలిపారు. దీంతో ఈ పిటిషన్‌పై 17న వాదనలు వింటామని కోర్టు తెలిపింది. కేడర్ కేటాయింపులు అన్యాయంగా ఉన్నాయంటూ నలుగురు ఐపీఎస్ అధికారులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతోకేటాయింపుల ప్రక్రియను మళ్లీ చేపట్టాలంటూ హైకోర్టు ఆదేశించడం తెల్సిందే. కాగా, తీవ్రమైన ఎండలు, రంజాన్ నెల కారణంగా ఆఖరి దశ లోక్‌సభ ఎన్నికల ఓటింగ్‌ను ఉదయం 7కు బదులు 5.30గంటలకే మొదలయ్యేలా ఈసీను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. -
సెట్లన్నీ ఆన్లైన్లోనే
మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం: రాష్ట్రంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే రాష్ట్ర స్థాయి అర్హత పరీక్షలను ఈ విద్యాసం వత్సరం నుంచి ఆన్లైన్లో నిర్వహించను న్నట్లు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఏయూ సెనేట్ మందిరంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో అన్ని పరీక్షలను ఆన్లైన్లోనే నిర్వహించడం జరుగుతుందన్నారు. రానున్న విద్యాసం వత్సరం నుంచి ఎంసెట్ నిర్వాహించా లా? వద్దా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోం దన్నారు. దీనికి పరిష్కారం చూపే విధంగా త్వరలో దీనిపై ప్రత్యేక నిపుణుల కమిటీని నియమిస్తామన్నారు. ఈ సందర్భంగా పలు సెట్లకు కన్వీనర్ల వివరాలను ప్రకటించారు. ఎంసెట్‌ను జేఎన్టీయూ కాకినాడ నిర్వహించనుండగా.. కన్వీనర్‌గా ఆచార్య సీహెచ్ సాయిబాబు వ్యవహరిస్తారు. -
11న ఏపీసెట్ అర్హత పరీక్ష
18 కేంద్రాలు, పరీక్షలు రాయనున్న అభ్యర్థులు 8,799 మంది కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : విశ్వవిద్యాలయాల్లో, డిగ్రీ కళాశాలల్లో అర్హత సాధించే ఏపీసెట్ 2016 పరీక్ష ఈనెల 11న రాజమహేంద్రవరం కేంద్రంగా జరగనుందని ఆ పరీక్షల రీజనల్ కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎస్.టేకి శుక్రవారం తెలిపారు. 18 పరీక్షాకేంద్రాల్లో జరిగే ఏపీసెట్‌కు మొత్తం 8,799 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలున్నర గంటల వరకు మూడు విభాగాల్లో ఈ పరీక్ష జరుగుతుంది. దీనిలో ఉత్తీర్ణులైన వారు యూనివర్సిటీ, డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులుగా పనిచేసేందుకు అర్హత సాధిస్తారు. పరీక్షా కేంద్రాలివే...: గైట్ ఇంజినీరింగ్ కళాశాల, గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (ఎన్‌హెచ్ 5లో) ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల, ఆదిత్య డిగ్రీ కళాశాల, ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల, సంహిత డిగ్రీ కళాశాల, ఆదిత్య జూనియర్ కళాశాల, శ్రీప్రకాశ్ విద్యానికేతన్, ఎస్‌కేవీటీ డిగ్రీ కళాశాల, రాజమహేంద్రి డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, శ్రీమతి జాస్తిబుల్లెమ్మాయి కళాశాల, శ్రీరామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(రాజమండ్రి రూరల్ పిడింగొయ్యిలోనున్న ఈ పరీక్ష కేంద్రంకు రవాణా సౌకర్యం అంతంతమాత్రమే, కనీసం అరగంట ముందుగానే ఇక్కడికి చేరుకునేలా అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకోవాలి) మెగా జూనియర్ కళాశాల, ప్రగతి జూనియర్ కళాశాల, ఆదికవి నన్నయ యూనివర్సిటీ, ప్యూచర్ కిడ్స్ స్కూలు, ఎస్కేఆర్ మహిళా కళాశాల. -
తెయూలో ప్రశాంతంగా సెట్
తెయూ (డిచ్పల్లి) : నిజామాబాద్ రీజియన్ పరిధిలో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి అర్హత పరీక్ష (సెట్) ప్రశాంతంగా ముగిసింది. పకడ్బందీ ఏర్పాట్లతో, తెలంగాణ యూనివర్సిటీ అధికారుల పర్యవేక్షణలో పరీక్షల ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని సెట్ రీజినల్ కో-ఆర్డినేటర్ ప్రొఫెసర్ యాదగిరి తెలిపారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా సెట్‌ను ప్రశాంతంగా నిర్వహించడంపై వర్సిటీ రిజిస్ట్రార్ ఆర్.లింబాద్రి సంతృప్తి వ్యక్తం చేశారు. సెట్ బాధ్యులను, వర్సిటీ అబ్జర్వర్లను, కళాశాలల యాజమాన్యాలను, సిబ్బందిని అభినందించారు. తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, యూజీసీ సంయుక్త ఆధ్వర్యంలో నిజామాబాద్ రీజియన్ పరిధిలోని 18 పరీక్షా కేంద్రాలలో సెట్‌ను నిర్వహించారు. 7,344 మంది అభ్యర్థులకుగాను 5,814 మంది హాజరయ్యూరని యాదగిరి తెలిపారు. 1,530 మంది గైర్హాజరయ్యారు. సెట్ పర్యవేక్షుడు ఆంధ్రా యూనివర్సిటీ కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఆర్.మురళీకృష్ణ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. -
16న బీసీ స్టడీసర్కిళ్లలో సివిల్స్ శిక్షణకు అర్హత పరీక్ష
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని బీసీ స్టడీసర్కిళ్లలో సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఉచితంగా శిక్షణ పొందగోరు అభ్యర్థులకు ఈ నెల 16న అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు బీసీ స్టడీసర్కిల్ డెరైక్టర్ మల్లికార్జునరావు తెలిపారు. పరీక్షకు హాజరుకానున్న తెలంగాణ అభ్యర్థులు tsbcstudycricles. cgg.gov.in,. ఆంధ్ర అభ్యర్థులు apbc welfare.cgg.gov.in వెబ్సైట్లలో హాల్‌టికెట్లను గురువారం నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. -
ఒకే రోజు మూడు పరీక్షలా!
జోగిపేట, న్యూస్‌లైన్: ఒకే రోజు మూడు ఉద్యోగాలకు సంబంధించిన అర్హత పరీక్ష నిర్వహిస్తూ అధికారులు నిరుద్యోగుల ఆశలకు గండి కొట్టారు. దీంతో నిరుద్యోగులు రెండు ఉద్యోగ అర్హత పరీక్షలకు గైర్హాజరు కాక తప్పడంలేదు. మూడింటిలో ఏదో ఒక దానికే హాజరు కావాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయం సంబంధిత అధికారులకు విన్నవించినా వారు స్పందించకపోవడంతో నిరుద్యోగుల ఆశలు ఆవిరయ్యాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జూనియర్ ఇంజినీర్, పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఈ నెల 25 పరీక్ష జరుగనుంది. అదే అటవీ శాఖ ఆధ్వర్యంలో సెక్షన్ ఆఫీసర్ల ఉద్యోగానికి కూడా అర్హత పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ మూడు ఉద్యోగాలకు ఇంచుమించుగా డిగ్రీ, ఇంజినీరింగ్, సైన్స్ గ్రూపు విద్యార్థులు అర్హులు. అటవీ శాఖ పరీక్షను వాయిదా వేయాలని అధికారులను కోరినా వారు పట్టించుకోలేదు. పోస్టల్ అసిస్టెంట్ పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఏదేని డిగ్రీ చదివిన అభ్యర్థులు అర్హులు. 25వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. అటవీశాఖలో సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగం.. అటవీ శాఖలో సెక్షన్ అధికారి ఉద్యోగానికి బీఎస్సీ సైన్స్ గ్రూపు, ఇంజినీరింగ్‌లో మెకానికల్, సివిల్, కెమికల్ డిగ్రీ చదివిన వారు అర్హులు. ఈ ఉద్యోగానికి ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహిస్తారు. జూనియర్ ఇంజినీర్ ఉద్యోగం.. జూనియర్ ఇంజినీర్ ఉద్యోగానికి ఇంజినీరింగ్ చదివిన వారు అర్హులు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. నష్టపోనున్న నిరుద్యోగులు పోస్టల్ ఉద్యోగానికి ఏదేని డిగ్రీ చదివిన వారు అర్హులు. అదేవిధంగా ఇంజనీరింగ్, అటవీ శాఖ ఉద్యోగానికి ఇంజనీరింగ్, బీఎస్సీ చదివిన వారు అర్హులు. మూడింటిలో ప్రతి రెండు ఉద్యోగాలకు ఇంజినీరింగ్‌తో పాటు ఏదేని డిగ్రీ చదివిన అభ్యర్థులు అర్హులు. దాదాపుగా మూడు ఉద్యోగాలకు నిరుద్యోగులు దరఖాస్తు చేసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం ముందుగానే తేదీలను ప్రకటించింది. అటవీశాఖ ముందుగా నిర్ణయించిన తేదీలను వాయిదా వేసి ఈనెల 25న పరీక్ష నిర్వహిస్తోంది. దీంతో నిరుద్యోగులు జేఎన్టీయూ అధికారులను పరీక్ష వాయిదా వేయాలని వేడుకుంటున్నారు. అయినప్పటికీ లాభం లేకుండా పోయింది. దీంతో అభ్యర్థులు మూడింటిలో ఏదేని ఒక పరీక్షనే రాయాల్సి ఉంటుంది. మూడింటిలో ఏదో ఒకటి రాకపోతుందా అనే యోచనలో ఉన్న అభ్యర్థుల ఆశలు ఆవిరయ్యాయి. ఈ తేదీలను ముందు చూపుతో నిర్ణయించకపోవడం వల్ల అర్హులైన నిరుద్యోగులు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.