తెయూలో ప్రశాంతంగా సెట్
తెయూ (డిచ్‌పల్లి) : నిజామాబాద్ రీజియన్ పరిధిలో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి అర్హత పరీక్ష (సెట్) ప్రశాంతంగా ముగిసింది. పకడ్బందీ ఏర్పాట్లతో, తెలంగాణ యూనివర్సిటీ అధికారుల పర్యవేక్షణలో పరీక్షల ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని సెట్ రీజినల్ కో-ఆర్డినేటర్ ప్రొఫెసర్ యాదగిరి తెలిపారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా సెట్‌ను ప్రశాంతంగా నిర్వహించడంపై వర్సిటీ రిజిస్ట్రార్ ఆర్.లింబాద్రి సంతృప్తి వ్యక్తం చేశారు. సెట్ బాధ్యులను, వర్సిటీ అబ్జర్వర్లను, కళాశాలల యాజమాన్యాలను, సిబ్బందిని అభినందించారు.
తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, యూజీసీ సంయుక్త ఆధ్వర్యంలో నిజామాబాద్ రీజియన్ పరిధిలోని 18 పరీక్షా కేంద్రాలలో సెట్‌ను నిర్వహించారు. 7,344 మంది అభ్యర్థులకుగాను 5,814 మంది హాజరయ్యూరని యాదగిరి తెలిపారు. 1,530 మంది గైర్హాజరయ్యారు. సెట్ పర్యవేక్షుడు ఆంధ్రా యూనివర్సిటీ కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఆర్.మురళీకృష్ణ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.