ఏఐ సాంకేతికత ప్రస్తుతం ఓ ప్రభంజనంలా దూసుకుపోతోంది. రోజుకో కొత్త సాంకేతికతను పరిచయం చేస్తూ..అన్నింటిని ఏఐతో చక్కపెట్టేసుకోవచ్చు అనేంతగా శరవేగంగా వెళ్లిపోతుంది. మొన్నటి వరకు ఎంప్లాయిస్ లేకుండా జస్ట్ ఏఐ సాంకేతికతో ఎంప్లాయిస్‌ని సృష్టించి వర్క్ పూర్తి చెయ్యొచ్చు అన్నారు. అసలే నిరుద్యోగ సమస్యతో సతమతమవుతుంటే మళ్లీ ఇదా! అని అంతా బెంబేలెత్తిపోయారు. ఇప్పడూ ఏకంగా ప్రేమ, సాన్నిహిత్యం, ఓ కంపెనీ వంటివి కూడా ఏఐ సాంకేతికతోనా!. ఔను! మీరు వింటుంది నిజమే..! ఓ మహిళ ఏఐతో రూపొందించిన హోలోగ్రామ్‌ని వివాహం చేసుకుంటుందట.
ఈ షాకింగ్ ఘటన స్పెయిన్‌లో చోటు చేసుకుంది. ప్రపంచంలోనే తొలిసారిగా స్పెయిన్‌కి చెందిన పెర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ అలీసియా ఫ్రామిస్ అనే మహిళ కృత్రిమ మేధతో రూపొందించిన హోలోగ్రామ్‌ని పెళ్లి చేసుకోనుంది. డిజిటల్ సంస్థ మెషిన్ లెర్నింగ్ అండ్ హోలోగ్రామ్ సాంకేతికతో కూడిన మనిషిని రూపొదించినట్లు తెలిపింది. అంతేగాదు తమ వివాహం కోసం పెళ్లిమండపాన్ని కూడా బుక్ చేసుకుందట. ఈ ఏడాది రోటర్‌డామ్‌లోని మ్యూజియంలో ఆమె వివాహం జరగనుంది. ఇక ఆమె పెళ్లి చేసుకోనున్న ఏఐ హోలోగ్రామ్ పేరు అలెక్స్.
తన భావోద్యేగాలన్నింటిని పంచుకునేలా ఈ హోలోగ్రామ్‌ని రూపొందించినట్లు తెలిపింది. తన వర్చువల్ భాగస్వామి మద్య వయస్కుడైన వ్యక్తిగా ఉన్నాడని చెబుతోంది. 'హైబ్రిడ్ కపుల్' అనే కొత్ర ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ హోలోగ్రామ్‌ని డిజైన్ చేసినట్లు అలీసియా పేర్కొంది. ఇప్పుడూ ఏఐ సాంకేతికతను ప్రేమ, సాన్నిహిత్యం, వంటి సరిహద్దులను అందుకునేలా ప్రయోగాలు చేస్తున్నట్లు తెలిపింది.. ఇంతవరకు ఐఏ సాంకేతికతను కవిత్వం కళల దిశగా ప్రయోగాలు చేయలేదని పేర్కొంది. తన భాగస్వామితో కొనసాగనున్న కొత్త జీవితం గురించి ఓ డాక్యుమెంటరీని కూడా రూపొందించనుందని అలీసియా తెలిపింది.
అలాగే తన వర్చువల్ భాగస్వామిని జీవితంలోకి ఎలా ఆహ్వానించాలి, అతనితో మసులకోవాలో అనే వాటి గురించి కలలు కంటున్నట్లు వెల్లడించింది. అంతేగాదు తమ వివాహ దుస్తులను కూడా డిజైన్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు అలీయాసీ తన ఇన్‌స్టాగ్రాంలో తన భాగస్వామి అలెక్సీతో కలిసి దిగిన వీడియోలను కూడా షేర్ చేసింది. ఆ పోస్ట్‌లో రోబోలు, హోలోగ్రామ్‌లోతో ప్రేమ, శృంగార జీవిత అనివార్యం అనేది గొప్ప వాస్తవం. అయితే వారు గొప్ప సహచరులుగా సానుభూతిని వ్యక్తపర్చగలరని రాసుకొచ్చింది.
ఫోన్‌లు ఒంటరితనం నుంచి రక్షించి జీవితంలోని శూన్యాన్ని దూరం చేశాయి. అలాగే ఈ హోలోగ్రామ్‌లు మన ఇళ్లల్లో ఉంటూ మనతో ఇంటరాక్టివ్ అవుతూ ఉనికిని చాటుకుంటాయని అంటోంది అలీసియా. అందుకోసం తన స్నేహితురాలి జీవితాన్ని ఉదాహరిస్తూ..తన స్నేహితురాలు భర్త చనిపోవడం వితంతువుగా మిగిలిపోయిందని, ఇప్పుడు ఆమెకు భర్త లేని లోటుని భర్తీ చేయడం కష్టం అని చెప్పుకొచ్చింది. అలాంటప్పుడూ ఈ ఏఐ మానవ సహచరులు మనకు బెస్ట్ ఆప్షన్ అవ్వొచ్చు అని ధీమాగా చెబుతోంది. మనం ఇష్టపడ్డ ఇష్టపకపోయినా కొత్త తరం ప్రేమ పుట్టుకొస్తుంది. హోలోగ్రామ్‌లు, రోబోలను పెళ్లి చేసుకునే రోజులు వస్తాయి అని చెబుతోంది అలీసియా. ఇక భాగస్వామ్య సహచర్యం కూడా ఏఐ మాయతోనేనా..!.
(చదవండి: నెల రోజులు పాలు, పెరుగు మానేస్తే ఏమవుతుందో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment