hologram
-
ప్రపంచంలోనే తొలి AI మ్యారేజ్!!
ఏఐ సాంకేతికత ప్రస్తుతం ఓ ప్రభంజనంలా దూసుకుపోతోంది. రోజుకో కొత్త సాంకేతికతను పరిచయం చేస్తూ..అన్నింటిని ఏఐతో చక్కపెట్టేసుకోవచ్చు అనేంతగా శరవేగంగా వెళ్లిపోతుంది. మొన్నటి వరకు ఎంప్లాయిస్ లేకుండా జస్ట్ ఏఐ సాంకేతికతో ఎంప్లాయిస్‌ని సృష్టించి వర్క్ పూర్తి చెయ్యొచ్చు అన్నారు. అసలే నిరుద్యోగ సమస్యతో సతమతమవుతుంటే మళ్లీ ఇదా! అని అంతా బెంబేలెత్తిపోయారు. ఇప్పడూ ఏకంగా ప్రేమ, సాన్నిహిత్యం, ఓ కంపెనీ వంటివి కూడా ఏఐ సాంకేతికతోనా!. ఔను! మీరు వింటుంది నిజమే..! ఓ మహిళ ఏఐతో రూపొందించిన హోలోగ్రామ్‌ని వివాహం చేసుకుంటుందట. ఈ షాకింగ్ ఘటన స్పెయిన్‌లో చోటు చేసుకుంది. ప్రపంచంలోనే తొలిసారిగా స్పెయిన్‌కి చెందిన పెర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ అలీసియా ఫ్రామిస్ అనే మహిళ కృత్రిమ మేధతో రూపొందించిన హోలోగ్రామ్‌ని పెళ్లి చేసుకోనుంది. డిజిటల్ సంస్థ మెషిన్ లెర్నింగ్ అండ్ హోలోగ్రామ్ సాంకేతికతో కూడిన మనిషిని రూపొదించినట్లు తెలిపింది. అంతేగాదు తమ వివాహం కోసం పెళ్లిమండపాన్ని కూడా బుక్ చేసుకుందట. ఈ ఏడాది రోటర్‌డామ్‌లోని మ్యూజియంలో ఆమె వివాహం జరగనుంది. ఇక ఆమె పెళ్లి చేసుకోనున్న ఏఐ హోలోగ్రామ్ పేరు అలెక్స్. తన భావోద్యేగాలన్నింటిని పంచుకునేలా ఈ హోలోగ్రామ్‌ని రూపొందించినట్లు తెలిపింది. తన వర్చువల్ భాగస్వామి మద్య వయస్కుడైన వ్యక్తిగా ఉన్నాడని చెబుతోంది. 'హైబ్రిడ్ కపుల్' అనే కొత్ర ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ హోలోగ్రామ్‌ని డిజైన్ చేసినట్లు అలీసియా పేర్కొంది. ఇప్పుడూ ఏఐ సాంకేతికతను ప్రేమ, సాన్నిహిత్యం, వంటి సరిహద్దులను అందుకునేలా ప్రయోగాలు చేస్తున్నట్లు తెలిపింది.. ఇంతవరకు ఐఏ సాంకేతికతను కవిత్వం కళల దిశగా ప్రయోగాలు చేయలేదని పేర్కొంది. తన భాగస్వామితో కొనసాగనున్న కొత్త జీవితం గురించి ఓ డాక్యుమెంటరీని కూడా రూపొందించనుందని అలీసియా తెలిపింది. అలాగే తన వర్చువల్ భాగస్వామిని జీవితంలోకి ఎలా ఆహ్వానించాలి, అతనితో మసులకోవాలో అనే వాటి గురించి కలలు కంటున్నట్లు వెల్లడించింది. అంతేగాదు తమ వివాహ దుస్తులను కూడా డిజైన్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు అలీయాసీ తన ఇన్‌స్టాగ్రాంలో తన భాగస్వామి అలెక్సీతో కలిసి దిగిన వీడియోలను కూడా షేర్ చేసింది. ఆ పోస్ట్‌లో రోబోలు, హోలోగ్రామ్లోతో ప్రేమ, శృంగార జీవిత అనివార్యం అనేది గొప్ప వాస్తవం. అయితే వారు గొప్ప సహచరులుగా సానుభూతిని వ్యక్తపర్చగలరని రాసుకొచ్చింది. ఫోన్లు ఒంటరితనం నుంచి రక్షించి జీవితంలోని శూన్యాన్ని దూరం చేశాయి. అలాగే ఈ హోలోగ్రామ్‌లు మన ఇళ్లల్లో ఉంటూ మనతో ఇంటరాక్టివ్ అవుతూ ఉనికిని చాటుకుంటాయని అంటోంది అలీసియా. అందుకోసం తన స్నేహితురాలి జీవితాన్ని ఉదాహరిస్తూ..తన స్నేహితురాలు భర్త చనిపోవడం వితంతువుగా మిగిలిపోయిందని, ఇప్పుడు ఆమెకు భర్త లేని లోటుని భర్తీ చేయడం కష్టం అని చెప్పుకొచ్చింది. అలాంటప్పుడూ ఈ ఏఐ మానవ సహచరులు మనకు బెస్ట్ ఆప్షన్ అవ్వొచ్చు అని ధీమాగా చెబుతోంది. మనం ఇష్టపడ్డ ఇష్టపకపోయినా కొత్త తరం ప్రేమ పుట్టుకొస్తుంది. హోలోగ్రామ్‌లు, రోబోలను పెళ్లి చేసుకునే రోజులు వస్తాయి అని చెబుతోంది అలీసియా. ఇక భాగస్వామ్య సహచర్యం కూడా ఏఐ మాయతోనేనా..!. (చదవండి: నెల రోజులు పాలు, పెరుగు మానేస్తే ఏమవుతుందో తెలుసా?) -
నేతాజీకి జాతి ఘన నివాళి
న్యూఢిల్లీ: ఆజాద్ హిందు ఫౌజ్ దళపతి, స్వాతంత్య్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకొని జాతి యావత్తూ ఆయనకి ఘనంగా నివాళులర్పించింది. స్వతంత్ర భారతావని సాధన దిశగా వేసిన సాహసోపేత అడుగులు, బోస్‌ను ‘జాతికి స్ఫూర్తి ప్రదాత’గా నిలిపాయని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కొనియాడారు. గొప్ప జాతీయవాది, దూరదృష్టి కలిగిన నాయకుడు నేతాజీ అని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశవాసులకు పరాక్రమ్ దివస్ (నేతాజీ జన్మదినోత్సవం) శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి నేతాజీ అందించిన సేవలకు ప్రతి భారతీయుడు గర్విస్తాడని ప్రధాని ట్వీట్ చేశారు. అనంతరం ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఆవిష్కరించారు. 28 అడుగుల పొడవు, ఆరు అడుగుల వెడల్పుతో ఉన్న ఈ విగ్రహాన్ని 4కే సామర్థ్యం ఉన్న ప్రొజక్టర్ ద్వారా ప్రదర్శిస్తున్నారు. గ్రానైట్‌తో రూపొందిస్తున్న నేతాజీ విగ్రహ నిర్మాణం పూర్తయ్యాక దీని స్థానంలో ఆ విగ్రహాన్ని స్థాపిస్తారు. కెన్ డూ.. విల్ డూ.. విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ప్రజలందరూ నేతాజీ నుంచి కెన్ డూ (చేయగలము) విల్ డూ (చేస్తాము) అన్న స్ఫూర్తిని పొంది ముందడుగు వెయ్యాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ఎందరో త్యాగధనులు, గొప్ప నాయకులు దేశానికి చేసిన సేవల్ని చరిత్ర పుటల నుంచి తొలగించే ప్రయత్నాలు జరిగాయని పరోక్షంగా కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. గతంలో జరిగిన తప్పుల్ని సవరించుకుంటున్నామని, వారు దేశానికి సేవల్ని స్మరించుకుంటున్నామని చెప్పారు. దేశానికి స్వాంతంత్య్రం వచ్చిన వందేళ్లలోగా, అంటే 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశంగా ఎదగాలన్న లక్ష్యాన్ని ప్రపంచంలో ఏ శక్తి అడ్డుకోలేదని అన్నారు. ఈ సందర్భంగా 2019 నుంచి 2022 సంవత్సరం వరకు సుభాష్ చంద్రబోస్ ఆప్డా ప్రబంధన్ పురస్కార్‌లు ప్రదానం చేశారు. విపత్తు నిర్వహణలో అద్భతమైన ప్రతిభ చూపించిన సంస్థలకి, వ్యక్తులకి ఈ అవార్డులను ఇస్తున్నారు. జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబెకు నేతాజీ రీసెర్చ్ బ్యూరో నేతాజీ అవార్డుని బహుకరించింది. అబె తరఫున కోల్‌కతాలోని జపాన్‌కు చెందిన కౌన్సెల్ జనరల్ ఈ అవార్డుని స్వీకరించారు. నేతాజీ అవార్డు తనకి ఇవ్వడం గర్వకారణమని షింజో అబె తన సందేశాన్ని పంపించారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాల కోసం తాను ప్రయత్నిస్తానని చెప్పారు. ఆ భాగాల్ని అనువదించలేదు నేతాజీ సుభాష్ చంద్రబోస్దిగా అనుమానించిన చితాభస్మానికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించడానికి జపాన్‌లోని రెంకోజీ ఆలయం అనుమతి ఇచ్చినట్టుగా తాజాగా వెలుగు చూసిన లేఖలో వెల్లడైంది. అప్పట్లో నేతాజీ అనుమానాస్పద మృతిపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఎంకె ముఖర్జీ కమిషన్‌కు చితాభస్మం డీఎన్ఏ పరీక్షలకు అనుమతినిచ్చినట్టుగా టోక్యోలోని రెంకోజీ ఆలయం ప్రధాన పూజారి 2005లో భారత ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే జపాన్ భాషలో ఉన్న లేఖలో ఆ భాగాన్ని అనువదించలేదని సుభాష్ చంద్రబోస్ సోదరుడు శరత్ బోస్ మనవరాలు మాధురి బోస్ ఆదివారం ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. రెంకోజీ ఆలయం చితాభస్మంపై పరీక్షలకు అనుమతించలేదని ఆ కమిషన్ పేర్కొందని గుర్తు చేశారు. దేశ, విదేశాల్లో.. బోస్ జయంతిని సింగపూర్‌లో ఘనంగా జరిపారు. సింగపూర్ స్వాతంత్య్ర సాధనలో బోస్ పాత్రను దేశవాసులు స్మరించుకున్నారు. బోస్ జన్మదినోత్సవాన్ని జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని బెంగాల్ సీఎం మమత డిమాండ్ చేశారు. ఆయన జ్ఞాపకార్థం జైహింద్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. నేతాజీ జన్మోత్సవ వేడుకలను తమిళనాడులో గవర్నర్, సీఎం ఘనంగా నిర్వహించారు. బెంగళూరులోని బోస్ విగ్రహాన్ని విధాన సభ ముందు ప్రతిష్టిస్తామని కర్ణాటక సీఎం ప్రకటించారు. ఒడిశాలో బోస్ జన్మస్థల మ్యూజియంలో పలు కార్యక్రమాలు జరిపారు. చండీగఢ్‌లో నేతాజీ నూతన విగ్రహాన్ని సీఎం ఖట్టర్ ఆవిష్కరించారు. At the programme to mark the unveiling of the hologram statue of Netaji Bose. https://t.co/OxRPKqf1Q7 — Narendra Modi (@narendramodi) January 23, 2022 -
కరోనా ఆంక్షలు.. బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి.. అప్పుడొచ్చింది ఓ మైండ్ బ్లోయింగ్ ఐడియా!
ఈ రోజుల్లో.. శుభకార్యాల్లో కనిపించే అక్షింతలన్నీ జూమ్, వాట్సాప్‌లోనే ప్రత్యక్షమవుతున్నాయి. మేసేజ్‌ల రూపంలో నిజంగా వేయకపోయినా.. వేసినట్లు టెక్నాలజీనీ ఉపయోగిస్తున్నారు. ఇదేవిధంగా ఓ తోడిపెళ్లికూతురు కూడా టెక్నాలజీని ఉపయోగించింది. ప్రత్యక్షంగా పెళ్లికి వెళ్లక పోయినా, తను నిర్వర్తించాల్సిన బాధ్యతలన్నింటినీ పాటించి, వారిని ఆశీర్వదించింది. ఇందుకోసం వేరే వ్యక్తిని కూడా పంపలేదు. తానే స్వయంగా పూర్తి చేసింది. ( చదవండి: అదొక అందమైన తోట.. ముచ్చటపడి ఏది ముట్టుకున్నా ప్రాణాలకు ముప్పే.. ) అది కూడా పెళ్లి ముహుర్తానికి, పెళ్లి మండపంలోనే. అదెలా? అని ఆశ్చర్యపోతున్నారా! వర్చువల్ టెక్నాలజీనీ ఉపయోగించి, పెళ్లితెరపై ప్రత్యక్షమైంది. ఎలాగనుకుంటున్నారా? హోలోగ్రామ్ రూపంలో.. సింపుల్‌గా చెప్పాలంటే రియల్ టైమ్ వర్చువల్ గ్రాఫిక్స్. జరిగింది ఏంటంటే.. మనం ఎక్కడ ఉన్నా మన ప్రతిరూపాన్ని కావాలనుకున్న చోట ప్రత్యక్షం చేసే టెక్నాలజీ ఈ హోలోగ్రామ్. రజనీకాంత్ రోబో సినిమా చూసి ఉంటే, వెంటనే అర్థమవుతుంది. సినిమాలో ఫ్రొఫెసర్ బోరాను వశీకరణ్ తన లాబ్‌లోకి అనుమతించడు. దీంతో బోరా తన వర్చువల్ బాడీని చిట్టీ ముందు ప్రత్యక్షం చేసి, మాట్లాడతాడు. సేమ్ ఇలాగే.. కరోనా ఆంక్షల కారణంగా లండన్‌కు చెందిన బీమ్ కెనడాలో జరిగే తన స్నేహితురాలి అంటారియా పెళ్లికి వెళ్లలేకపోయింది. తనను నమ్మి తోడిపెళ్లికూతురు బాధ్యతలు అప్పగించిన స్నేహితురాలిని బాధ పెట్టడం ఇష్టం లేక, హోలోగ్రామ్ ద్వారా పెళ్లిలో ప్రత్యక్షమైంది. అంతేకాదు, ఒక తోడిపెళ్లికూతురుగా వరుడికి వధువు గురించి చెప్పాల్సిన విషయాలను అందంగా వివరిస్తూ, ఆశ్చర్యపరచింది. తర్వాత అందరితో పాటు డ్రింక్ తాగుతూ, కాసేపు డాన్స్ చేసింది. ఇక చివరగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి అంతర్ధానమైంది. ఇదంతా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. కుంటిసాకులు చెప్పి, తప్పించుకునే ఫ్రెండ్స్ ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి ఫ్రెండ్ దొరకడం నిజంగా పెళ్లికూతురి ఆదృష్టం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చదవండి: పదేళ్లుగా ఉదయాన్నే లేవడం, ఊరంతా బలాదూర్ తిరగడం.. ఈ కుక్క ప్రత్యేకత -
ఏపీలో చీప్ లిక్కర్ కొరత
నాటుసారా, కల్తీ మద్యం, లూజు విక్రయాలను నియంత్రించేందుకు చవక ధరలకు (చీప్ లిక్కర్) మద్యాన్ని టెట్రా ప్యాక్‌ల్లో అందిస్తామని ప్రభుత్వం చేసిన విధాన ప్రకటన అమలుకు నోచుకోవడం లేదు. అల్పాదాయ వర్గాలు ఎక్కువగా తాగే చీప్ లిక్కర్‌ను అందుబాటులో ఉంచాల్సిన ప్రభుత్వం అది చేయకపోవడంతో నాటుసారా, కల్తీ కల్లు, గుడుంబా లాంటివి తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కల్తీ మద్యం సేవించి కృష్ణా జిల్లాలో సోమవారం ఏడుగుగురు మృతి చెందగా, మరో 35 మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు అనేకం జరిగినా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో చీప్ లిక్కర్‌కు గేట్లు బార్లా తెరిచినా డిస్టిలరీలు మాత్రం ఉత్పత్తికి ముందుకు రాలేదు. చౌక మద్యంపై ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ తగ్గించినా తయారీకి ఉత్పత్తి కంపెనీలు ససేమిరా అంటున్నాయి. దీంతో రాష్ట్రంలో చీప్ లిక్కర్ కొరత ఏర్పడింది. మార్కెట్లో చౌకమద్యం దొరక్క నాటుసారా, కల్తీ కల్లు విక్రయాలు బాగా పెరిగాయి. గతంలో అన్ని జిల్లాల్లో కలుపుకొని రోజుకు 30 వేల లీటర్ల నాటుసారా అమ్ముడయ్యేది. ఇప్పుడు ఏపీలో సారా విక్రయాలు రోజుకు 50 వేల లీటర్ల వరకు జరుగుతున్నట్లు అంచనా. 20 శాతం చీప్ లిక్కర్ తయారు చేయాల్సిందే.. ఏపీలో మొత్తం 14 లైసెన్స్డ్ డిస్టిలరీలున్నాయి. వీటి ఉత్పాదక సామర్ధ్యం 1,221.58 లక్షల ప్రూఫ్ లీటర్లు. ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు తమ డిస్టిలరీల్లో 20 శాతం చీప్ లిక్కర్ బ్రాండ్లను ఉత్పత్తి చేస్తామని కంపెనీల నిర్వాహకులు అంగీకార పత్రం ఇస్తారు. అయితే డిస్టిలరీలు కేవలం ప్రముఖ బ్రాండ్లను తయారు చేస్తూ చౌక మద్యాన్ని తయారు చేయకపోవడం వల్ల కొరత ఏర్పడింది. హాలోగ్రామ్ అసలు సమస్యా... లూజు విక్రయాలను నిరోధించేందుకు 60 మిల్లీ లీటర్ల చీప్ లిక్కర్ బాటిల్స్ అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావించింది. 60 మిల్లీ లీటర్ల బాటిల్ రూ.20కే అందించాలని నిర్ణయించింది. అయితే నిబ్ బాటిళ్ల తయారీకి హాలోగ్రామ్‌తో కూడిన లేబుల్ వేసేందుకు అదనంగా ఖర్చు కావడంతో వీటిని తయారు చేయలేమని, లీటరు బాటిల్ తయారు చేస్తామని తెగేసి చెబుతున్నాయి. డిస్టిలరీ కంపెనీలపై ఒత్తిడి తీసుకువచ్చి చీప్ లిక్కర్‌ను ఉత్పత్తి చేయించడంలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. టెట్రా ప్యాక్‌లో చీప్ లిక్కర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించినా టెట్రా ప్యాక్ తయారీకి చైనా నుంచి మిషన్లు కొనుగోలు చేయాల్సి ఉన్నందున ఉత్పత్తి కంపెనీలు వాటి జోలికెళ్లడం లేదు. రాష్ట్రంలో ప్రస్తుతం రెండు డిస్టిలరీ కంపెనీలు మాత్రమే చౌకమద్యం ఉత్పత్తి చేయడం గమనార్హం.