ఈ రోజుల్లో.. శుభకార్యాల్లో కనిపించే అక్షింతలన్నీ జూమ్, వాట్సాప్‌లోనే ప్రత్యక్షమవుతున్నాయి. మేసేజ్‌ల రూపంలో నిజంగా వేయకపోయినా.. వేసినట్లు టెక్నాలజీనీ ఉపయోగిస్తున్నారు. ఇదేవిధంగా ఓ తోడిపెళ్లికూతురు కూడా టెక్నాలజీని ఉపయోగించింది. ప్రత్యక్షంగా పెళ్లికి వెళ్లక పోయినా, తను నిర్వర్తించాల్సిన బాధ్యతలన్నింటినీ పాటించి, వారిని ఆశీర్వదించింది. ఇందుకోసం వేరే వ్యక్తిని కూడా పంపలేదు. తానే స్వయంగా పూర్తి చేసింది. ( చదవండి: అదొక అందమైన తోట.. ముచ్చటపడి ఏది ముట్టుకున్నా ప్రాణాలకు ముప్పే.. )
అది కూడా పెళ్లి ముహుర్తానికి, పెళ్లి మండపంలోనే. అదెలా? అని ఆశ్చర్యపోతున్నారా! వర్చువల్ టెక్నాలజీనీ ఉపయోగించి, పెళ్లితెరపై ప్రత్యక్షమైంది. ఎలాగనుకుంటున్నారా? హోలోగ్రామ్ రూపంలో.. సింపుల్‌గా చెప్పాలంటే రియల్ టైమ్ వర్చువల్ గ్రాఫిక్స్.
జరిగింది ఏంటంటే..
మనం ఎక్కడ ఉన్నా మన ప్రతిరూపాన్ని కావాలనుకున్న చోట ప్రత్యక్షం చేసే టెక్నాలజీ ఈ హోలోగ్రామ్. రజనీకాంత్ రోబో సినిమా చూసి ఉంటే, వెంటనే అర్థమవుతుంది. సినిమాలో ఫ్రొఫెసర్ బోరాను వశీకరణ్ తన లాబ్‌లోకి అనుమతించడు. దీంతో బోరా తన వర్చువల్ బాడీని చిట్టీ ముందు ప్రత్యక్షం చేసి, మాట్లాడతాడు. సేమ్ ఇలాగే.. కరోనా ఆంక్షల కారణంగా లండన్‌కు చెందిన బీమ్ కెనడాలో జరిగే తన స్నేహితురాలి అంటారియా పెళ్లికి వెళ్లలేకపోయింది. తనను నమ్మి తోడిపెళ్లికూతురు బాధ్యతలు అప్పగించిన స్నేహితురాలిని బాధ పెట్టడం ఇష్టం లేక, హోలోగ్రామ్ ద్వారా పెళ్లిలో ప్రత్యక్షమైంది.
అంతేకాదు, ఒక తోడిపెళ్లికూతురుగా వరుడికి వధువు గురించి చెప్పాల్సిన విషయాలను అందంగా వివరిస్తూ, ఆశ్చర్యపరచింది. తర్వాత అందరితో పాటు డ్రింక్ తాగుతూ, కాసేపు డాన్స్ చేసింది. ఇక చివరగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి అంతర్ధానమైంది. ఇదంతా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. కుంటిసాకులు చెప్పి, తప్పించుకునే ఫ్రెండ్స్ ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి ఫ్రెండ్ దొరకడం నిజంగా పెళ్లికూతురి ఆదృష్టం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
చదవండి: పదేళ్లుగా ఉదయాన్నే లేవడం, ఊరంతా బలాదూర్ తిరగడం.. ఈ కుక్క ప్రత్యేకత
Comments
Please login to add a commentAdd a comment