
ఓ మహిళ తల్లి అయ్యాక ఆ మాతృమూర్తి ఎదుర్కొనే సమస్యలు ఎన్నెన్నో. ఓ తల్లి ఎదుర్కొనే సాధారణ సమస్యలూ, వాటికి సమాధానాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ... ఇవి ఆ తల్లులకు ఉపయోగపడతాయని ఆశిస్తూ... ఓ తల్లి అమ్మగా మారాక బిడ్డ పాలు తాగకపోయినా లేదా పాలు తాగాక ఆ చిన్నారికి విరేచనాలవుతున్నా, బిడ్డకు కడుపునొప్పి వచ్చినా... ఇలా ఏం జరిగినా తల్లికి ఆందోళనే. తల్లులు ఎదుర్కొనే కొన్ని సాధారణ సమస్యలనూ, సమాధానాల్నీ చూద్దాం.
పాలు సరిగా పడుతున్నామా అనే సందేహమా?
కొత్తగా తల్లిగా మారిన మహిళల్లో చాలామందికి తాము సరిగానే ΄ాలుపడుతున్నామా లేదా అనే సందేహం వస్తుంటుంది. ఒక రొమ్ము ఫీడ్ చేస్తున్నప్పుడు దానిలో ΄ాలు అయిపోయేవరకు బిడ్డ తాగుతున్నాడా అని డౌటొస్తుంటుంది. రొమ్ము మార్చడమెప్పుడో తెలియక కంగారొస్తుంటుంది. ఇలాంటి సందేహాలకు కొన్ని సూచనలివి... సాధారణంగా పిల్లలు పాలు తాగే ప్రక్రియ 10–15 నిమిషాల్లో పూర్తి అవుతుంది.
అప్పుడే పుట్టిన పిల్లలు పాలుతాగడానికి అలవాటు పడటానికి కాస్త టైమ్ పట్టవచ్చు. చాలామంది పిల్లలు ఒక పక్క పాలు తాగి సంతృప్తిపడతారు. కానీ కొందరు ఒక పక్క తాగి మళ్లీ మరో పక్క కూడా తాగుతారు. పాలు పట్టేటప్పుడు చివరలో వచ్చేవాటిని హైండ్ మిల్క్ అంటారు. ఈ పాలలో ఎక్కువ క్యాలరీస్ ఉండి, బిడ్డ బరువును పెంచడానికి ఎక్కువగా సహాయపడతాయి. బిడ్డ మామూలుగా రోజుకు ఐదారుసార్లు మూత్ర విసర్జన చేస్తూ, బరువు పెరుగుతుంటే ఆ బిడ్డకు తల్లిపాలు సరిపోతున్నాయని అర్థం.
తల్లిలో బిడ్డకు సరిపోయినన్ని పాలు పడాలంటే...
బిడ్డకు తగినన్ని పాలు పడాలంటే తల్లులు అన్ని రకాల పోషకాలతో కూడిన సమతులాహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. పాలిచ్చే తల్లుల ఆహారంలో ఆకుకూరలు తప్పనిసరిగా ఉండాలి. రోజూ తాము తీసుకునే ఆహారంలో ఆకుకూరల్ని మార్చుతుండటం వల్ల పాల ఫ్లేవర్ మారుతూ బిడ్డ పాలు తాగడానికి ఉత్సాహం చూపుతుంది.
తల్లులకు ఉండకూడనిది మానసిక ఆందోళన. బిడ్డకు పాలు సరిపోతాయా లేదా అని ఆందోళన చెందకుండా, మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా ఉండంటం వల్ల పాలు ఉత్పత్తి అయ్యే హార్మోన్లు కూడా బాగాస్రవించి పాలు పెరగడానికి అవకాశమెక్కువ.
బిడ్డలకు వచ్చే కడుపునొప్పి...
కొందరు చిన్నారి బిడ్డలు ఎప్పుడూ ఏడుస్తుంటారు. కారణం చెప్పడానికి నెలల చిన్నారికి మాటలురావు. బిడ్డ అలా ఏడుస్తుంటే తల్లికి ఏమీ పాలుపోదు. నెలల పిల్లలు అలా ఏడుస్తున్నారంటే కారణం వాళ్ల తొలి సమస్య కడుపునొప్పి.
వైద్యపరిభాషలో దాన్ని ‘ఇన్‌ఫ్యాంటైల్ కోలిక్’ అంటారు. అందుకే ఈ కంప్లెయింట్‌తో వెళ్లిన పిల్లలకు కడుపునొప్పి తగ్గే మందు ఇస్తుంటారు చిన్న పిల్లల వైద్యులు. పిల్లలు ఏడుస్తున్నప్పడు ఆందోళన పడకుండా డాక్టర్ దగ్గరకు వెళ్లి ఇన్‌ఫ్యాంటైల్ కోలిక్‌కు మందు తీసుకోవడం తల్లి చేయాల్సిన మొదటి పని.
నెలల బిడ్డకు విరేచనాలవుతుంటే...
కొన్నిసార్లు పాలు తాగగానే నెలల పిల్లలకు విరేచనాలు అవుతుంటాయి. తల్లికి పెద్ద సందేహం... తన పాలు సరిపడక పోవడం వల్లనే అలా జరుగుతుందేమోనని. నెలల వయసప్పుడు ఆలు తాగగానే విరేచనాలు కావడం పిల్లల్లో చాలా మామూలుగా జరిగేదే. పాలు సరిపడకసెవడం అన్నది చాలా తక్కువమంది పిల్లల్లోనే జరుగుతుంది. విరేచనాలు అవుతున్నప్పటికీ పిల్లలకు తల్లిపాలు పట్టిస్తూ ఉండాలి. కాకపోతే గమనించాల్సిందేమిటంటే... బిడ్డ బరువు ఏమైనా తగ్గుతుందేమో చూడాలి.
బరువు తగ్గనంతవరకు బిడ్డకు ఎలాంటి సమస్యా ఉండదు. విరేచనాలు అవుతున్నాయనే కారణంతో తల్లి΄ాలు ఇవ్వడాన్ని ఆపడం ఎంతమాత్రమూ మంచిది కాదు. అలా ఆపితే వాళ్లు మరింత డీ–హైడ్రేషన్‌కు లోనవుతారు. అది చిన్నారులకు మరింత ముప్పు తెచ్చిపెట్టవచ్చు. బిడ్డ తాలూకు ప్రతి అవయవం ఎదుగులకు, చిన్నారి వికాసానికి (మైల్‌స్టోన్స్‌కు) తల్లిపాలకు మించిన ఆహారం లేదు.
దానికి మించిన ప్రత్యామ్నాయమూ లేదు. అందుకే బిడ్డకు తల్లిపాలు పట్టడమే చాలా ఉత్తమం. ఒకవేళ ఇలా ΄ాలుపడుతునప్పటికీ బరువు పెరగడం లేదని గమనిస్తే అప్పుడు వెంటనే పిల్లల వైద్యుని సంప్రదించాలి. అప్పుడు వాళ్లు విరేచనాలకు వేరే కారణాలైమైనా ఉన్నాయా అని చూసి, దానికి తగిన చికిత్స అందిస్తారు.
బాబు / పాప సరిగా అన్నం తినడం లేదా?
చిన్నారి పుట్టాక వాళ్లకు ఘనాహారం అలవాటు చేశాక... వాళ్లు పెరిగి పెద్దయ్యే వరకూ దాదాపుగా ప్రతి తల్లీ చేసే ఫిర్యాదు ఇదే. అన్నం పెడితే బిడ్డ సరిగా తినడం లేదంటూ ప్రతి తల్లీ తమ డాక్టర్‌ను ఏదో ఒక సందర్భంలో అడిగి తీరుతుంది. బిడ్డకు అన్ని పోషకాలూ అందేలా ఆరోగ్యకరమైన ఆహారం పెడుతున్నప్పుడు వాళ్లు తిన్నంత తినిపించాలి. వాళ్లు వద్దన్న తర్వాత ఒకటి రెండుసార్లు తినిపించాక ఇక తినమంటూ మారాం చేస్తే ఆపేయాలి.
అంతేతప్ప వాళ్లను బతిమాలి, బెదిరించి, బలవంతంగా తినిపించకూడదు. ఇలాంటి పిల్లల్లో చూడాల్సిందేమిటంటే వాళ్లేమైనా చురుగ్గా ఉండటంలేదా, బరువు తగ్గుతున్నారా అని గమనించాలి. ఇక వాళ్లు చురుగ్గా ఆడుకుంటూ, తమ వికాసానికి తగిన తెలివితేటలను చూపుతూ, మునపటి కంటే బరువు తగ్గకుండా క్రమంగా పెరుగుతుంటే ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు.
ఒకవేళ వారు బరువు పెరగకపోయినా లేదా తగ్గుతున్నా వాళ్లకు లోపల ఏదైనా సమస్య ఉండవచ్చు. ముఖ్యంగా కిడ్నీలు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం... ఈ నాలుగు ప్రధాన అవయవాలకు సంబంధించిన కారణాలు ఏవైనా అయి ఉండవచ్చు.
కొన్నిసార్లు జన్యుపరమైన అంశాల వల్ల లేదా వంశ పారంపర్యంగా తల్లిదండ్రుల ఎత్తు/ఆకృతిని బట్టి కూడా బరువు పెరగకపోవచ్చు. లేదా తినిపిస్తున్నప్పటికీ పౌష్టికాహార లోపం వల్ల కూడా బరువు పెరగకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో మాత్రం తప్పనిసరిగా డాక్టర్‌కు చూపించి, తగిన చికిత్స అందించాలి.
(చదవండి: