challenges
-
సవాళ్లలోనూ పీఎస్‌బీల బలమైన పనితీరు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్–సెప్టెంబర్) ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) బలమైన పనితీరు చూపించాయని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. పీఎస్‌బీల నికర లాభం 26 శాతం పెరగ్గా, వ్యాపారం 11 శాతం వృద్ధి చెందినట్టు తెలిపింది. ఎస్బీఐ, పీఎన్బీ, యూనియన్, కెనరా బ్యాంక్ సహా మొత్తం 12 ప్రభుత్వరంగ బ్యాంకుల గణాంకాలు ఇందులో ఉన్నాయి. ‘‘క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చిచూసినప్పుడు రుణాలు 12.9 శాతం వృద్ధితో రూ.102.29 లక్షల కోట్లు, డిపాజిట్లు 9.5 శాతం వృద్ధితో రూ.133.75 లక్షల కోట్లకు చేరాయి. ఈ కాలంలో నిర్వహణ లాభం 14.4 శాతం పెరిగి రూ.1,50,023 కోట్లుగా, నికర లాభం 25.6 శాతం పెరిగి రూ.85,520 కోట్లుగా ఉన్నాయి. స్థూల ఎన్పీఏలు 3.12 శాతం (1.08 శాతం తక్కువ), నికర ఎన్పీఏలు 0.63 శాతానికి (0.34 శాతం తగ్గుదల) తగ్గాయి’’అని ఆర్థిక శాఖ వెల్లడించింది. ఫలితమిస్తున్న చర్యలు.. ‘‘బ్యాంకింగ్‌లో చేపట్టిన సంస్కరణలు, నిరంతర పర్యవేక్షణ చాలా వరకు సవాళ్లను పరిష్కరించాయి. రుణాల విషయంలో మెరుగైన క్రమశిక్షణ అవసరమైన వ్యవస్థలు, విధానాలు ఏర్పడ్డాయి. నిరర్థక ఆస్తుల (ఎన్పీఏలు) గుర్తింపు, వాటికి పరిష్కారం, రుణాల మంజూరీలో బాధ్యాతాయుతంగా వ్యవహరించడం, టెక్నాలజీ అమలు తదితర చర్యలు ఫలించాయి. స్థిరమైన ఆర్థిక శ్రేయస్సుకు, బ్యాంకింగ్ రంగం పటిష్టానికి దోహపడ్డాయి.ఇదే పీఎస్‌బీల పనితీరులో ప్రతిఫలించింది’’ అని ఆర్థిక శాఖ వివరించింది. ఏఐ/క్లౌడ్/బ్లాక్‌చైన్ తదితర టెక్నాలజీల విషయంలో పీఎస్‌బీలు గణనీయమైన పురోగతి చూపించడంతోపాటు, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మెరుగుపరుచుకున్నట్టు వివరించింది. సైబర్ సెక్యూరిటీ రిస్‌్కలను తగ్గించేందుకు అవసరమైన వ్యవస్థలు/నియంత్రణలను అమల్లో పెట్టిన ట్టు తెలిపింది. అత్యుత్తమ కస్టమర్ అనుభూతికై చర్యలు తీసుకున్నట్టు పేర్కొంది. -
కొత్త ప్రభుత్వం ముందున్న సవాళ్లు
ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంక నూతన అధ్యక్షునిగా ఎన్నికైన అనుర కుమార దిస్సనాయకే ముందు అనేక సవాళ్లు, సమస్యలు ఉన్నాయి. కోవిడ్ అనంతర పరిణామాల వల్ల ఇప్పటికే మొత్తం జనాభాలో సుమారు 27 శాతం దారిద్య్ర రేఖకు దిగువకు జారిపోయారు. వ్యాపారస్తులకు, పెట్టుబడి దారులకు, ఉత్పత్తిదారులకు అధిక వడ్డీ రేట్ల మూలంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇందువల్ల ఉత్పత్తి తగ్గి, ఉద్యోగావకాశాలపై వ్యతిరేక ప్రభావం పడుతోంది. గత రెండేళ్లలో ద్రవ్యోల్బణం 60 శాతం నుండి ఆరు శాతానికి తగ్గించగలిగినప్పటికీ, సున్నితంగా ఉన్న శ్రీలంక ఆర్థిక పరిస్థితుల్లో ఈ 6 శాతం ద్రవ్యోల్బణం కూడా ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చడం, స్థిరీకరించడం, గాడినపెట్టడం లాంటి వ్యవహారాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది.ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న శ్రీలంకకు నూతన అధ్యక్షుడిగా ఎన్నికయిన అనుర కుమార దిస్సనాయకే ముందు అనేక సవాళ్లు, సమస్యలు ఉన్నాయి. మార్క్సిస్ట్–లెనినిస్ట్ భావజాలంతో నడిచే కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు గల జనతా విముక్తి పెరుమున పార్టీ నుండి ఎన్నికయిన అనుర పట్ల కొన్ని సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థను ఎలా గాడిలోపెడతారు, పొరు గున ఉన్న భారత్‌తో ఎలాంటి సంబంధాలు నెరుపుతారు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రపంచ బ్యాంకు వెలువరించిన కొన్ని అంచనాల ప్రకారం ఈ సంవత్సరంతో పాటు వచ్చే 2025 సంవత్సరంలో కూడా శ్రీలంక 2.4 శాతానికి కొంచెం అటు ఇటుగా వృద్ధి రేటు నమోదు చేయబోతోంది. గత కొన్ని సంవత్సరాల నుండి తిరోగమన స్థితిలో ఉన్న ఆర్థిక వ్యవస్థ తిరిగి వృద్ధి పథం అందుకోవడం కొంత సంతోషకరమైన విషయమే. అయినప్పటికీ పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఒకవైపు, ఉద్యోగ అవకాశాలు కల్పించడం మరోవైపు అనుర కుమారముందున్న ముఖ్యమైన సవాళ్లు. కోవిడ్ తదనంతర పరిణామాల వల్ల ఇప్పటికే మొత్తం జనాభాలో సుమారు 27 శాతం దారిద్య్ర రేఖకు దిగువకు జారిపోయారు. ఎక్కువగా మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించే సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలు మూతపడడం వల్ల మహిళల్లో నిరుద్యోగిత విపరీతంగా పెరిగిపోయింది. శ్రీలంక ఆర్థిక వ్యవస్థలో చిన్న, మధ్య తరహా సంస్థలు సుమారు 75 శాతం భాగం కలిగి ఉండడమే కాకుండా సుమారు 45 శాతం ఉద్యోగ అవకాశాలను కూడా కల్పిస్తున్నాయి. వీటిలో చాలావరకు ఎగుమతులు, దిగుమ తులపైన ఆధారపడిన సంస్థలు. అధిక ద్రవ్యోల్బణం, ఇంధన కొరత, సరఫరాల్లో అంతరాయాలు తదితర కారణాల వల్ల పెరిగిన నిర్వ హణ, ఉత్పత్తి ఖర్చుల వల్ల, వస్తువుల ధరలు పెరగడం వల్ల, తగ్గిన డిమాండ్ తదితర కారణాల వల్ల ఇవి మూతపడ్డాయి. గత రెండుసంవత్సరాల కాలంలో రణిల్ విక్రమసింఘే ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల నిరుద్యోగిత శాతం ఈ సంవత్సరం మొదటి త్రైమాసికం అంతానికి 4.5 శాతం వరకు తగ్గించగలిగినప్పటికీ పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా జీతాలు పెరగక ప్రజలు ఇబ్బందు లకు గురవుతున్నారు.2022 జూలైలో రాజపక్సే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విదేశీ మారకద్రవ్యం నిల్వలు అత్యంత కనిష్ఠ స్థాయిలో అంటే 1.8 బిలియన్ డాలర్లు ఉండి నిత్యావసర వస్తువుల దిగుమతులకు ఇబ్బందిగా మారిన పరిస్థితులు ధరల పెరుగుదలకు దారి తీశాయి. తత్ఫ లితంగా ప్రజల అసంతృప్తికి, తిరుగుబాటుకు కారణ మయ్యాయి. ఆ నిల్వలు తర్వాత ఏర్పడిన రణిల్ విక్రమసింఘే ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా జూలై 2024 నాటికి 5.58 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇదే కాలంలో విదేశీ అప్పులు కూడా శ్రీలంక ఆర్థిక మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం 34.8 బిలియన్ డాలర్ల నుండి 37.40 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అవి ప్రస్తుత ధరల ప్రకారం 2022 జూన్‌లో 51.2 బిలియన్ డాలర్లు ఉంటే... ఈ సంవత్సరం మొదటి త్రైమాసికం ముగిసేనాటికి 55.4 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. విక్రమసింఘే ప్రభుత్వం తన సన్నిహిత దేశాలయిన చైనా, భారత్, జపాన్‌లతో జరిపిన చర్చల ఫలితంగా... సుమారు 10 బిలియన్ డాలర్ల వరకు తిరిగి చెల్లించే కాలపరి«ధులు, వడ్డీ రేట్లు తగ్గించడంవంటి వెసులుబాట్లు లభించాయి. ఇందువల్ల ఐఎంఎఫ్ నుండి ఉద్దీపన ప్యాకేజీలు లభించడానికీ, అనేక మౌలిక వసతుల కల్పనకు ఖర్చు చేయడానికి వెసులుబాటు లభించినట్లయింది. ఈ చర్యలు 2023 డిసెంబర్ నాటికి సుమారు 237 మిలియన్ డాలర్ల మిగులు బడ్జెట్‌కు దారితీశాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడులు కూడా పెరిగి 2024 మార్చి నాటికి 96.3 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెరిగి 44.9 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇవన్నీ కూడా శ్రీలంక ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో పడింది అనడానికి సంకేతాలే.గత రెండు సంవత్సరాలలో ద్రవ్యోల్బణం 60 శాతం నుండి ఆరు శాతానికి తగ్గించగలిగినప్పటికీ, సున్నితంగా ఉన్న శ్రీలంక ఆర్థిక పరిస్థితుల్లో ఈ ఆరు శాతం ద్రవ్యోల్బణం కూడా ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చడం, స్థిరీకరించడం, గాడినపెట్టడం లాంటి వ్యవహారా లపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా, అప్పులు పెరిగిన నేపథ్యంలో, విదేశీ మారక ద్రవ్య నిల్వల కొరత ఉన్న సమయంలో ఈ ద్రవ్యోల్బణం ధరల పెరుగుదలకు దారితీస్తుంది. దానివల్లే ఇప్పటికి ఆహారవస్తువుల, పెట్రోల్, డీజిల్, మందుల ధరలు ఇంకా దిగి రాలేదు. వీటివల్ల సామాన్య ప్రజల జీవన వ్యయంపై ప్రభావం ఇంకా తీవ్రంగానే ఉంది. అనుర కుమార దిస్సనాయకే అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన మూడు రోజులకు అంటే 26 సెప్టెంబర్ నాడు జరిగిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక సమావేశంలో డిపాజిట్లపై, రుణాలపై వరుసగా ప్రస్తుతం ఉన్న 8.25, 9.25 శాతం వడ్డీ రేట్లను కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఈ వడ్డీ రేట్లు బ్యాంకుల్లో పొదుపుచేసే వారిని ప్రోత్సహించడానికీ, రుణాలు తీసుకోవాలనుకునే వారిని నిరుత్సాహపరచడానికీ, ద్రవ్యోల్బణం స్థిరీకరించడానికి ఉప యోగపడ్డాయి. అయితే అదే సమయంలో వ్యాపారస్తులకు, పెట్టు బడిదారులకు, ఉత్పత్తిదారులకు అధిక వడ్డీ రేట్ల మూలంగా ప్రతి కూల పరిస్థితులను కల్పించి, ఉత్పత్తి వ్యయాలు, ధరలు పెరిగేలా చేసి వినియోగదారులను దూరం చేస్తాయి. వీటి వల్ల ఉత్పత్తి తగ్గి, ఉద్యో గావకాశాలపై వ్యతిరేక ప్రభావం పడుతుంది. మరోవైపు బ్యాంకుల లాభాల్లో మార్జిన్ తక్కువగా ఉండడం వలన అవి ఇచ్చే రుణాలు తగ్గిపోతాయి. ఇన్ని ప్రతికూలతలు ఎదుర్కోవడం అనుర కుమార దిస్సనాయకే అయన ప్రభుత్వానికి పెద్ద సవాలు.అనుర దిస్సనాయకే పార్టీ గతంలో భారత్ పట్ల వ్యతిరేక భావనతో రగిలిపోయినప్పటికీ, కొత్త ప్రభుత్వం అదే ధోరణి ఇంకా కొనసాగించడం సాధ్యం కాకపోవచ్చు. భారత్ ఇప్పటికే శ్రీలంకను అనేక సందర్భాల్లో ఆదుకుంది. గత రెండు సంవత్సరాల్లో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో భారత్ 4 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం అందించింది. ఇది ఐఎంఎఫ్, చైనా అందించిన సహాయం కన్నా అధికం. వాణిజ్య సంబంధాలు పెంపొందించుకు నేందుకు రెండు దేశాలు ‘భారత – శ్రీలంక స్వేచ్ఛా వాణిజ్యఒప్పందం’ చేసుకొన్నాయి. గత రెండు సంవత్సరాల్లో రెండు దేశాల మధ్య 4 నుండి 6 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతున్నప్పటికీ ఇందులో అధిక భాగం భారత్ శ్రీలంకకు చేస్తున్న ఎగుమతులు ఎక్కువ. భారత్‌తో ఉన్న సన్నిహిత, నిర్మాణాత్మక సంబంధాల రీత్యా కొత్త ప్రభుత్వానికి భారత్‌తో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించడం అనివార్యమవుతుంది.అనుర దిస్సనాయకే నాయకత్వంలో శ్రీలంక కొత్త అధ్యాయం మొదలు పెట్టబోతున్న తరుణంలో, ఆర్థిక వ్యవస్థ దిద్దుబాటు చర్యలు కొనసాగించడం ఒకవైపు; విదేశాలతో మంచి సంబంధాలు కొన సాగించడం మరోవైపు అత్యంత అవసరం. ఎన్నికల సమయంలో ఐఎంఎఫ్‌తో 2.9 బిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజీ పైన చర్చలు తిరిగి ప్రారంభిస్తామని వాగ్దానం చేసినప్పటికీ, అది అంత సులభం కాదు. భారత్ ఆ దేశానికి ఇచ్చిన ఆర్థిక సహాయం, వాణిజ్య సంబంధాలు కొనసాగించడం ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. కొత్త ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలు, రాజకీయంగానే కాకుండా ఆర్థిక వ్యవస్థలు గాడినపెట్టడం పైన కూడా ప్రభావం చూపిస్తాయి.- వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్, దక్షిణాసియా వ్యవహారాల అధ్యయన కేంద్రం, జేఎన్‌యూ ‘ 79089 33741- డా‘‘ గద్దె ఓంప్రసాద్ -
తల్లిగా ఉండటమే గొప్ప- సుస్మితా సేన్
ఈ రోజుల్లో పిల్లల పెంపకం పెద్దలకు ఓ సమస్యగా ఉంటే తమ కెరియర్ను వృద్ధి చేసుకుంటూనే పిల్లలను పెంచడం ఒంటరి తల్లులకు అతిపెద్ద సవాల్‌తో కూడుకున్నదని దాదాపు 70 శాతం ఒంటరి తల్లిదండ్రులు తమ ఉద్యోగావకాశాలను వదులుకోవడానికి కారణం ఇదే అని స్పష్టం చేసింది న్యూయార్క్ కెరీర్ మైండ్స్ అధ్యయనం. గ్లోబల్వైజ్గా టెక్ కంపెనీలలో ఉద్యోగావకాశాలను కల్పించే ఈ సంస్థ తమ ఇంటర్వ్యూలలో పాల్గొనే సింగిల్ పేరెంట్స్ పిల్లల కోసం ఉద్యోగాలను వదులుకుంటున్నారనే విషయాన్ని స్పష్టం చేసింది. ఒంటరి తల్లిదండ్రులు తమ కెరియర్ను కాపాడుకుంటూనే పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిపుణులు సూచనలు ఇస్తున్నారు.ఒంటరిగా పిల్లలను పెంచడం చాలా కష్టమైన టాస్క్. ముఖ్యంగా ఒంటరి తల్లుల్లో భావోద్వేగ సమతుల్యత తప్పనిసరి. క్రమశిక్షణలో ఉంచాలా? లేక ప్రేమ, ఆప్యాయతలను చూపాలా.. అనే కన్ఫ్యూజన్లో ఉంటారు. ఒంటరి తల్లులు అప్పటికే జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని ఉంటారు కాబట్టి క్రమశిక్షణతో పెంచాలనుకుంటారు.కఠినమైన శిక్షణ కూడదునేను కరెక్ట్‌గా ఉంటేనే నా పిల్లలను బాగా పెంచగలను అనుకునే దోరణిలో పేరెంటింగ్ కూడా సవాల్‌గా తీసుకుంటున్నారు. అయితే, ఈ విధానం వల్ల తరచూ భయాందోళనకు లోనవుతుంటారు. ఫలితంగా ప్రతి చిన్న విషయంలోనూ ఉద్వేగానికి లోనవుతుంటారు. వీళ్లు తమని తాము ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో తెలుసుకోవాలి. ఎవరి సపోర్ట్ లేకుండా ‘సూపర్ ఉమన్’లాగా ఉండాలనుకోవడం అన్ని సందర్భాలలో కుదరదు. శారీరకంగానూ, మానసికపరమైన సమస్యలతోనూ ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అందుకని, తమ పెద్దవారి మద్దతు తీసుకోవడం అవసరం. కఠినమైన క్రమశిక్షణ వల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరిగే అవకాశం ఉంది.సమతుల్యత తప్పనిసరిఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్ వర్క్‌ని పిల్లల ముందుకు తీసుకురాకూడదు. సింగిల్‌గా ఉండటం వల్ల పెద్దలు ఫోన్లోనే ఎక్కువ సమయం గడుపుతుంటారు. దీనివల్ల పిల్లలు ‘తామేదో కోల్పోతున్నాం’ అనే భావనలో ఉంటారు. పిల్లలు పెద్దలను గమనిస్తుంటారు అని గుర్తుంచుకోవాలి. ‘అమ్మకు నాకన్నా ఫోన్ లేదా వర్క్ అంటేనే ఎక్కువ ఇష్టం’ అనే ఆలోచన పిల్లల్లో రానీయకూడదు.అభిప్రాయాలను తీసుకోవాలిపిల్లలు చిన్నవాళ్లు కదా అనుకోకుండా వాళ్ల అభిప్రాయాలు కూడా తీసుకోవాలి. ఇంటి నిర్ణయాల్లో వారిని పాలుపంచుకోనివ్వాలి. దీనివల్ల తమను నిర్లక్ష్యం చేయడం లేదు అనే ఆలోచన పిల్లల్లో కలుగుతుంది. ఇంట్లో ఏ మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నట్లు అనిపించినా బయట వెతుక్కుంటారు.తమ మాటే వినాలనుకోవద్దుఒంటరి తల్లుల పెంపకంలో పిల్లలు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసే అవకాశాలు ఎక్కువ. పిల్లలు నా మాట వినాలనే ఆలోచనతో పూర్తిగా పిల్లలు చెప్పినట్టు వినడం...లేదంటే తాము ఒక రూలర్‌గా ఉండాలను కుంటారు. టీనేజ్ దశలో ఈ గ్రాఫ్ విపరీతంగా పెరిగిపోతుంది. ఈ విధానం వల్ల పిల్లలను ఎలా హ్యాండిల్ చేయాలో పెద్దవాళ్లకు తెలియడం లేదు. కానీ, పెద్దలను ఎలా హ్యాండిల్ చేయాలో పిల్లలకు బాగా తెలుసు. పిల్లలు ఇద్దరుంటే వారిద్దరినీ సమానంగా చూడాలి. వీలున్నప్పుడల్లా వారిద్దరికీ టైమ్ కేటాయించి వారి ప్రతి అవసరాన్నీ తీర్చాలి. నమ్మకం ముఖ్యంపిల్లల అవసరాలు తెలుసుకొని సాధ్యమైనంతవరకు వాటిని పూర్తి చేయాలి. పిల్లల ఆలోచనా విధానాన్ని పంచుకునే విధానం ఇంట్లో ఉండాలి. స్నేహపూర్వకమైన వాతావరనంలో రోజులో కనీసం పది నిమిషాలైనా పిల్లల కోసం సమయం కేటాయించాలి. తమ పని గురించి చెబుతూనే పిల్లల విషయాలనూ పట్టించుకోవాలి. అప్పుడే ఏదో కోల్పోతున్నామనే భావన పిల్లల్లో కలగకుండా పెరుగుతారు. -ప్రొఫెసర్ జ్యోతిరాజ,సైకాలజిస్ట్, లైఫ్‌స్కిల్ ట్రెయినర్ తల్లిగా ఉండటమే గొప్పఇద్దరు అమ్మాయిలను ఒంటరితల్లిగా పిల్లలను పెంచుతూనే, తన కెరియర్‌నూ బిల్డ్ చేసుకుంటున్న బాలీవుడ్ నటి సుస్మితాసేన్ స్ఫూర్తిదాయకమైన విషయాలనూ సోషల్‌మీడియా ద్వారా తెలియజేసింది. ‘ప్రతిరోజూ ఒక తల్లిగా నన్ను నేను భుజం తట్టుకునే పని ఏం చే యాలనేది ముందే నిర్ణయించుకుని, అది పూర్తి చేస్తాను. నా పిల్లలకన్నా నాకు ఎక్కువ తెలుసు అనుకోను. వారి ద్వారా కూడా ప్రతిరోజూ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాను. ఇలా ఉండటం వల్ల నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేనొక కళాకారిణిగా కన్నా తల్లిగా ఉండటమే గొప్పగా భావిస్తాను. ఆ రోజంతా ఎన్ని పనులు చేసినా పిల్లల వద్దకు వస్తూనే అన్నీ దులిపేసుకొని వారి ముందు ప్రేమగా ఉంటాను.’– సుస్మితాసేన్ -
మినీ ఎకనామిక్ సర్వేలో పేర్కొన్న సవాళ్లు ఇవే..
Economic Survey 2024: భారత ఆర్థిక వ్యవస్థ ఇటీవలి సంవత్సరాలలో సంస్కరణల ద్వారా గణనీయమైన వృద్ధిని సాధించింది. అయితే ఇది అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. వీటిలో నాలుగింటిని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వి అనంత నాగేశ్వరన్, ఆయన బృందం మధ్యంతర బడ్జెట్‌కు ముందు గత జనవరిలో వారి “మినీ ఎకనామిక్ సర్వే”లో పేర్కొన్నారు.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు ప్రకటించనున్న 2024-25 పూర్తి బడ్జెట్‌తోపాటు నేడు పార్లమెంట్లో ప్రవేశపెడుతున్న ఆర్థిక సర్వే-2024లో వీటిని ప్రస్తావించవచ్చు. 'ది ఇండియన్ ఎకానమీ: ఎ రివ్యూ' అనే పత్రంలో పేర్కొన్న ఈ సవాళ్లను ఇప్పుడు తెలుకుందాం..ప్రపంచ ఆర్థిక ధోరణుల ప్రభావంభారతదేశ వృద్ధి, ఆర్థిక వ్యవస్థపై ప్రపంచ ఆర్థిక ధోరణులు, వాణిజ్య విధానాల ప్రభావం మొదటి సవాలు. దేశ వృద్ధి కేవలం అంతర్గత అంశాలపై మాత్రమే కాకుండా ప్రపంచ ఆర్థిక ఏకీకరణపై కూడా ఆధారపడి ఉందని పత్రం పేర్కొంది.బ్యాలెన్సింగ్ ఎనర్జీ సెక్యూరిటీఇక రెండవ సవాలు ఏమిటంటే, పునరుత్పాదక శక్తి వైపు ప్రపంచ మార్పుల మధ్య ఆర్థిక వృద్ధిని ఇంధన భద్రతతో సమతుల్యం చేయడం భౌగోళిక రాజకీయ, సాంకేతిక, ఆర్థిక రంగాలలో సంక్లిష్ట సవాళ్లను కలిగిస్తుంది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పెరుగుతున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను మూడో సవాలుగా మినీ సర్వే పేర్కొంది. ఏఐ టెక్నాలజీతో మానవ ఉద్యోగాలకు పెంచిన ముప్పు, ముఖ్యంగా సేవా రంగంలో దీని ప్రభావం గురించి ప్రపంచవ్యాప్త ఆందోళనలు నెలకొన్నాయి. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు ఉపాధిపై దాని ప్రభావాన్ని ఎలా ఎదుర్కొంటాయన్నది కీలకం.నైపుణ్యం, విద్య, వైద్యంస్థిరమైన ఆర్థిక వృద్ధి, ఉత్పాదకతకు నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి , మంచి నాణ్యమైన విద్య, ప్రజారోగ్యాన్ని నిర్ధారించడం చాలా ముఖ్యమైనదని పత్రం పేర్కొంది. -
సునీత, షర్మిలకు కొండా రాఘవరెడ్డి సవాల్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్ వివేకా హత్య కేసులో ఛార్జ్‌షీట్ తీసుకుని రండి.. బహిరంగ చర్చకు సిద్ధమా.. ఎక్కడికైనా వస్తానంటూ సునీత, షర్మిలకు వైఎస్సార్టీపీ మాజీ నేత కొండా రాఘవరెడ్డి సవాల్ విసిరారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ నెల 11 లోపు తన సవాల్‌పై స్పందించాలన్నారు.‘‘షర్మిల స్పష్టంగా తెలుసుకుని వాస్తవాలు మాట్లాడాలి. నాడు షర్మిలను పాదయాత్ర చేయమని ఎవరూ అడగలేదు. వైఎస్ సోదరి విమలమ్మ మీ వెంట ఎందుకు లేరు?. వైఎస్ సోదరులు సైతం మీకు మద్దతు ఇవ్వడం లేదు. వివేకా మృతి తర్వాత ఎన్నిసార్లు ఆయన సమాధి వద్దకు వెళ్లారు’ అంటూ కొండా రాఘవరెడ్డి ప్రశ్నించారు.‘‘షర్మిల దుర్మార్గపు పనులు చేస్తున్నారు కాబట్టే.. కుటుంబం నుంచి కూడా ఆమెకు మద్దతు లేదు. రూ.వెయ్యి కోట్ల పని చేయనందుకే షర్మిల వ్యతిరేకంగా మారింది. వైఎస్ పేరును చెడ్డగొట్టడానికి షర్మిల కుట్రలు చేస్తోంది. సీఎం జగన్, పొన్నవోలుపై షర్మిల వ్యాఖ్యలు సరికాదు. షర్మిల ప్రచారానికి స్పందన లేక ఫ్రస్ట్రేషన్‌కు గురవుతుంది. బాబు, పవన్ స్క్రిప్ట్ షర్మిల చదువుతుంది. వైఎస్ విజయమ్మ మాట పెడచెవిన పెట్టినప్పుడే షర్మిల అంశం ముగిసింది’’ అని కొండా రాఘవరెడ్డి పేర్కొన్నారు.‘‘షర్మిల మోసాలు, అక్రమాలు బయట పెట్టడానికి నేను ఒక్కడిని చాలు. తెలంగాణలో షర్మిల వందల కుటుంబాలను మోసం చేశారు. జగన్, షర్మిల పెళ్లికి చంద్రబాబును వైఎస్ పిలిచారన్నది అబద్ధం. బాబు ఆడుతున్న ఆటలో షర్మిల పాచిక అయింది. వైఎస్ జగన్‌కు అద్ధం చూపడం దుర్మార్గం. ఒకసారి ఇంటికి వెళ్లి ఆ అద్ధంలో మీ ముఖం చూసుకోండి. తెలంగాణలో ఏం మాట్లాడారు. ఏపీలో మాట్లాడారో ఒకసారి చూసుకోండి. షర్మిలకు పిచ్చి ముదిరి నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది’’ అని కొండా రాఘవరెడ్డి మండిపడ్డారు. -
తేల్చుకుందాం రా..!
సాక్షి, హైదరాబాద్: ‘‘వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దమ్ముంటే ఒక్క సీటు అయినా గెలిచి చూపించాలని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారు. అంత ఉబలాటం, దమ్ము, ధైర్యం, తెగువ ఉంటే.. పరపతి ఉన్న నాయకుడివే అయితే.. నువ్వు (రేవంత్) సిట్టింగ్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి లోక్‌సభ సీట్లోనే తేల్చుకుందాం. అది పోతే ఇది, ఇదిపోతే అది.. అన్నట్టు సేఫ్ గేమ్ ఆడకుండా.. నువ్వు సీఎం పదవికి, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యి. నేను సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. ఎంపీగా నీ పనితీరు, మున్సిపల్ మంత్రిగా నా పనితీరును ఆ ఒక్క సీటులోనే తేల్చుకుందాం. ఎవరు గెలుస్తారో చూద్దాం..’’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. గురువారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేశారు. రేవంత్ మాటలకు విశ్వసనీయత ఏది? గతంలో జీహెచ్ఎంసీలో, కొడంగల్‌లో ఓడితే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించిన రేవంత్‌రెడ్డి మాటలకు విశ్వసనీయతే లేదని కేటీఆర్ విమర్శించారు. ‘‘రాజకీయాల్లో గెలుపోటములు సహజం. గెలిస్తే మగాడు.. ఓడితే కాదంటావా? గతంలో కొడంగల్‌లో ఓడినపుడు నువ్వు కాదా..? ఇదేం లాజిక్? నువ్వు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరిలో ఎంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు గెలిచారో చెప్పలేరు. ఆత్మన్యూనత భావంతో బాధపడుతున్న రేవంత్ నేనే సీఎం, నేనే పీసీసీ అధ్యక్షుడు అని గొంతు చించుకుంటున్నారు. ఏం మీ మంత్రివర్గ సహచరులు మిమ్మల్ని గుర్తించడం లేదా? మగతనం గురించి మాట్లాడుతున్న రేవంత్.. ఎన్నికల కోడ్ వచ్చేలోగా రూ.2లక్షల రుణమాఫీ, మహాలక్ష్మి పథకంతో పాటు మిగతా 420 హామీలను నెరవేర్చాలి’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డిది పేమెంట్ కోటా.. రాజకీయాల్లో తనది మేనేజ్మెంట్ కోటా అంటున్న రేవంత్.. రాహుల్, ప్రియాంక గాంధీ ఏ కోటానో చెప్పాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘‘రేవంత్‌రెడ్డి పేమెంట్ కోటా కింద మాణిక్యం ఠాగూర్‌కు డబ్బులిచ్చి పీసీసీ అధ్యక్ష పదవిని, ఇతరులకు డబ్బులిచ్చి సీఎం పదవి కొనుక్కున్నారు. పేమెంట్ కోటా అభ్యర్థి రేవంత్.. తనను ప్రజలు ఎన్నుకున్నట్టు మాట్లాడితే ఎలా? పేమెంట్ కోటాలో తెచ్చుకున్న సీటు కోసం ఢిల్లీకి కప్పం కట్టాలి. పార్లమెంటు ఎన్నికల్లో ఢిల్లీని నడపాలంటే రేవంత్, డీకే శివకుమార్ రోజుకు 18 గంటలు కష్టపడాలి. బిల్డర్లు, కాంట్రాక్టర్లను పిలిచి బెదిరించి, వేధించి డబ్బుల వసూలు దందా చేస్తున్నారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలో బిల్డింగ్ అనుమతులను ఎవరిని బెదిరించడం కోసం నిలిపివేశారు. హైదరాబాద్ బిల్డర్లు త్వరలోనే రోడ్డెక్కే పరిస్ధితి ఉంది. కేంద్రంలోని బీజేపీకి రేవంత్ పరోక్షంగా సహకరిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆయన ఎటుపోతారో అందరూ చూస్తారు. హిమాచల్‌ప్రదేశ్‌లో ఏం జరుగుతుందో చూస్తున్నట్టే.. భవిష్యత్తులో తెలంగాణలో కూడా రాజకీయం రంజుగా ఉంటుందనేది వేచి చూడాల్సిందే. లంకె బిందెలు ఎక్కడున్నాయో మనకేం తెలుసు. తెలంగాణ తల్లి మీద ఆభరణాలు మాయం చేశాడు’’ అని కేటీఆర్ విమర్శించారు. టీఆర్ఎస్గా మార్పుపై నిర్ణయం తీసుకోలేదు.. రాజకీయ పారీ్టల్లో చేరికలను భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదని కేటీఆర్ పేర్కొన్నారు. పోరాటవాదులు పారీ్టతో ఉంటారని, అవకాశవాదులు వదిలివెళ్తారని వ్యాఖ్యానించారు. ఏ పార్టీ అయినా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తుందన్నారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన సునీత మహేందర్‌రెడ్డి (చేవెళ్ల), బొంతు రామ్మోహన్ (సికింద్రాబాద్), అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి (మల్కాజిగిరి), వెంకటేశ్ నేత (పెద్దపల్లి)లకు టికెట్లు ఇస్తారేమోనని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పేరును తిరిగి టీఆర్ఎస్గా మార్చడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. బీఆర్ఎస్గా ఉన్నా తమ ఫోకస్ ప్రస్తుతానికి తెలంగాణపైనే ఉందని చెప్పారు. తమ పాలనలో ఏవైనా తప్పులు జరిగి ఉంటే.. రాజకీయ వేధింపులకు దిగకుండా ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చన్నారు. ఎన్డీఎస్ఏ నివేదిక రాజకీయ ప్రేరేపితం సాగునీటి ప్రాజెక్టులు, బ్యారేజీలు, రిజర్వాయర్లలో లీకేజీలు, పగుళ్లు సహజమని కేటీఆర్ చెప్పారు. ప్రభుత్వం ఏ విచారణలు చేసినా సరే, ఇంజనీరింగ్ నిపుణులు దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సూచించారు. కానీ గత ప్రభుత్వంపై ఆరోపణలు, శ్వేతపత్రాలతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. గతంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఎలాంటి హైడ్రోలాజికల్ అధ్యయనాలు చేయకుండానే రాజకీయ ప్రేరేపితంతో ఆదరాబాదరాగా నివేదికను విడుదల చేసిందని విమర్శించారు. ఎప్పుడూ కేంద్ర సంస్థలు ఇచ్చే నివేదికలను తప్పుబట్టే కాంగ్రెస్, మంత్రి ఉత్తమ్ ఇప్పుడు ఎన్డీఎస్ఏ నివేదికను ప్రామాణికంగా తీసుకుని మాట్లాడుతున్నారేమని ప్రశ్నించారు. రైతులను ఆదుకునేందుకు తగిన పరిష్కారం చూపాలనే కామన్ సెన్స్ ఆయనకు లేదని వ్యాఖ్యానించారు. ‘‘మేం మేడిగడ్డకు వెళ్తుంటే.. కాంగ్రెస్ పాలమూరు ప్రాజెక్టు సందర్శన పేరిట చౌకబారు రాజకీయం చేస్తోంది. దిద్దుబాటు చర్యలు చేపట్టి నీరు ఇవ్వకపోవడం వికృత రాజకీయం, నేరపూరిత చర్య. పాలమూరు ప్రాజెక్టులో 80శాతం పనులు పూర్తిచేశాం. ఉత్తమ్ నీటిపారుదల శాఖ మంత్రిగా బ్యారేజీలు, రిజర్వాయర్లతోపాటు తన శాఖకు సంబంధించిన అంశాలపై అవగాహన పెంచుకోవాలి. కేసీఆర్ ప్రభుత్వాన్ని బదనాం చేసే పనులు మానుకుని మేడిగడ్డ వద్ద దిద్దుబాటు పనులు చేపట్టాలి..’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
చంద్రబాబుకు మంత్రి జోగి రమేష్ సవాల్
సాక్షి, కృష్ణా జిల్లా: పెనమలూరులో నాపై పోటీ చేసే దమ్ముందా? అంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు మంత్రి జోగి రమేష్. కంకిపాడులో పెనమలూరు నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు సర్వేలు కూడా చేయించుకున్నాడని, ఎవరు పోటీ చేసినా గెలిసేది తానేనన్నారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా జగన్‌ను ఎదుర్కోలేరు. ప్రతిపక్షాలను కృష్ణా నదిలో కలిపేస్తామన్నారు. ‘‘ప్రజల గుండెల్లో జగన్ నిలిచిపోయారు. ఢిల్లీలో కాంగ్రెస్ పీఠాన్ని వణికించిన ధీరుడు సీఎం జగన్. ఆయనపై సోనియా, రాహుల్ కుట్రలు పన్నారు. చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తాడు. కాంగ్రెస్ ముందుపోటు పొడుస్తుంది. వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాలు గెలుస్తాం. పెనమలూరు గడ్డ వైఎస్సార్సీపీ అడ్డా’’ అని మంత్రి పేర్కొన్నారు. ఇదీ చదవండి: షర్మిలకు ఏ అన్యాయం చేశామో.. ఆమె చెప్పాలి: సజ్జల -
దిగ్గజాలకు చిన్న సంస్థల సవాల్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ పరిశ్రమలో దిగ్గజ కంపెనీలకు చిన్న సంస్థలు సవాళ్లు విసురుతున్నాయి. ద్రవ్యోల్బణం తగ్గడంతో చిన్న బ్రాండ్లు మళ్లీ బలంగా పుంజుకుంటున్నాయి. పెద్ద సంస్థలకు బలమైన పోటీనిస్తున్నాయి. మార్కెట్లో వాటాను పెంచుకంటూ, పెద్ద సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గించక తప్పని పరిస్థితులను కలి్పస్తున్నాయి. సబ్బులు, టీ, డిటర్జెంట్, బిస్కట్ల విభాగంలో ఈ పరిస్థితి ఉంది. హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్), గోద్రేజ్ కన్జ్యూమర్, మారికో, బ్రిటానియా, టాటా కన్జ్యూమర్ సంస్థలు సెప్టెంబర్ త్రైమాసికం ఫలితాల విడుదల సందర్భంగా.. చిన్న సంస్థల నుంచి వస్తున్న పోటీ కారణంగా ఉత్పత్తుల ధరలను సవరించాల్చి వచి్చనట్టు పేర్కొనడం గమనార్హం. ‘‘ద్రవ్యోల్బణం గరిష్టాల్లో ఉన్నప్పుడు చిన్న సంస్థలకు ఉత్పత్తుల తయారీపై అధిక వ్యయం అవుతుంది. దీంతో అవి పెద్ద సంస్థలకు ధరల పరంగా గట్టి పోటీనిచ్చే పరిస్థితి ఉండదు. ద్రవ్యోల్బణం తక్కువగా ఉన్నప్పుడు మార్జిన్లు ఎక్కువగా ఉండడంతో అవి అధిక డిస్కౌంట్లు ఇవ్వగలవు’’అని బ్రిటానియా ఇండస్ట్రీస్ వైస్ చైర్మన్, ఎండీ వరుణ్ బెర్రీ ఇన్వెస్టర్ల కాల్లో పేర్కొన్నారు. ఒక్కసారి కమోడిటీల ధరలు తగ్గడం మొదలైతే, వాటి మార్జిన్లు పెరుగుతాయని, దీంతో అధిక డిస్కౌంట్లు ఇవ్వడం మొదలు పెడతాయన్నారు. కొన్ని విభాగాల్లో అధిక పోటీ ‘‘ఒకవైపు బలమైన బ్రాండ్లతో పెద్ద సంస్థలతో పోటీ పడాలి. ధరల యుద్ధంతో అవి మార్కెట్ వాటాను చిన్న సంస్థలకు కోల్పోవాల్సి వస్తోంది. మేము ఈ చట్రంలో ఇరుక్కోవాలని అనుకోవడం లేదు. రెండింటి మధ్య సమతుల్యం ఉందనుకున్న విభాగంలోనే ముందుకు వెళతాం’’అని టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ పేర్కొనడం గమనార్హం. టీ పొడి మార్కెట్లో ప్రాంతీయంగా చిన్న సంస్థల నుంచి పోటీ ఉన్నట్టు తెలిపింది. ఇతర విభాగాల మాదిరిగా కాకుండా, టీ మార్కెట్లో అన్ బ్రాండెడ్ కారణంగా చిన్న సంస్థలు ఎప్పుడూ ఉంటాయని పేర్కొంది. ముఖ్యంగా గ్రామీణ మార్కెట్లలో దీని కారణంగా కొంత వ్యాపారం కోల్పోవాల్సి వస్తుందంటూ.. తమ ప్రీమియం ఉత్పత్తుల వాటా పెరుగుతున్నందున ఇది తమపై ఏమంత ప్రభావం చూపబోదని వాటాదారులకు టాటా కన్జ్యూమర్ వివరించింది. ధరలు తగ్గింపు.. చిన్న సంస్థలు చాలా చురుగ్గా ఉన్నాయని, వాటి కారణంగా మార్కెట్లో విపరీతమైన పోటీ నెలకొన్నట్టు మారికో ఎండీ, సీఈవో సౌగత గుప్తా తెలిపారు. ప్రస్తుత పరిణామాల్లో కొన్ని విభాగాల చిన్న సంస్థల భాగస్వామ్యం ఎక్కువగా ఉంటోంది. దీంతో ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీలు ధరలు తగ్గించి, వినియోగదారులకు విలువను చేకూర్చే చర్యలు అమ్మకాల వృద్ధికి వచ్చే కొన్ని త్రైమాసికాల్లో దోహదపడతాయి’8అని సౌగత గుప్తా తెలిపారు. -
సీఎం కేసీఆర్‌కు రేవంత్ సవాల్
కొడంగల్: కొడంగల్‌కు ప్రత్యేక గుర్తింపు తన హయంలోనే వచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కేటీఆర్ దత్తత తీసుకొని ఈ ప్రాంతానికి చేసిందేమీలేదని ఆరోపించారు. గురునాథ్ రెడ్డి మద్దతుతో గెలిచిన ఎమ్మెల్యే కొడంగల్‌ను అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కొడంగల్‌కు సాగునీరు తేలేదు, కాలేజీలు రాలేదని దుయ్యబట్టారు. సిరిసిల్ల, సిద్దిపేటను అభివృద్ధి చేసినట్లుగా కొడంగల్ ను అభివృద్ధి చేయలేదని స్పష్టం చేశారు. కొడంగల్ లో నిజంగా అభివృద్ధి చేస్తే ముఖ్యమంత్రి తనపై పోటీ చేసి గెలవాలని రేవంత్ సవాల్ విసిరారు. ఈ ఎన్నికలు కొడంగల్ రూపురేఖలను మారుస్తాయని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు దేశ ముఖచిత్రంలో కొడంగల్ పేరు మారుమోగుతుందని అన్నారు. రాష్ట్రంలో యువత, నిరుద్యోగులు అల్లాడుతున్నారని తెలిపిన రేవంత్ రెడ్డి.. ప్రాణ సమానమైన కాంగ్రెస్ కార్యకర్తలతో నామినేషన్ వేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ శాఖకు తనను అధ్యక్షుడిగా సోనియమ్మ నియమించిందని పేర్కొన్నారు. కొడంగల్ ప్రజలంతా ఆలోచన చేయాలని సూచించారు. ఇదీ చదవండి: గెలిపిస్తేనే వస్తా.. లేదంటే రాను : కేటీఆర్ -
లోకేష్‌కు పేర్ని నాని సవాల్.. సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా?
సాక్షి, అమరావతి: చేసిన పాపాలకు చంద్రబాబు శిక్ష అనుభవించక తప్పదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ, కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసిన చంద్రబాబు.. ముద్రగడ పద్మనాభం నిరసనకు దిగితే ఆయన్ను వేధించారు. చంద్రబాబు జైలుకెళ్తే టీడీపీ నాయకులు ఎవరూ బాధపడటం లేదు. నిరసన కార్యక్రమాలను కేవలం రాజకీయ కార్యక్రమాలుగా మాత్రమే చేశారు. లంచాలు తిని కంచాలు మోగిస్తారా’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘చంద్రబాబు జనం సొమ్ము తిన్నారని ప్రజలు భావిస్తున్నారు. అందుకే నిరసన కార్యక్రమాల్లో ఎవరూ పాల్గొనడం లేదు. కోటిమంది కేడర్ ఉందని చెప్పుకునే టీడీపీకి మద్దతెక్కడుంది. అక్రమ కేసులయితే చంద్రబాబుకు ఎందుకు కోర్టులో అనుకూల తీర్పులు రావడం లేదు. అమరావతి స్కాం, ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో భారీగా వెనకేసుకున్నారు. చంద్రబాబు జైల్లో ఉంటే లోకేష్ ఢిల్లీ వెళ్లిపోయారు. టీడీపీ కార్యకర్తలు కేసులు పెట్టించుకోవాలని లోకేష్ పిలుపునిచ్చారు. చంద్రబాబుపై కేసులు ఉంటే లోకేష్ ఎందుకు లాయర్ల చుట్టూ తిరుగుతున్నారు’’ అని పేర్ని నాని ప్రశ్నించారు. ‘‘లోకేష్‌కు దమ్ముంటే చంద్రబాబు అక్రమాస్తుల మీద విచారణకు సిద్ధమవ్వాలి. చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి విచారణ చేద్దాం. సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా?. చంద్రబాబుపై ఉన్న కేసులన్నింటిపైనా ఎందుకు స్టే తెచ్చుకున్నారు. బాబు ఇంతకాలం స్టేలు తెచ్చుకుని బతికాడు. యావజ్జీవ ఖైదు తప్పదనే స్టేలు తెచ్చుకున్నారు. కోర్టుల్లో చంద్రబాబు నిజాయితీ నిరూపించుకోవాలి’’ అంటూ పేర్ని నాని హితవు పలికారు. హరీష్ వ్యాఖ్యలపై స్పందించిన పేర్ని నాని.. చంద్రబాబు అరెస్ట్‌పై హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన పేర్ని నాని.. ఎన్టీఆర్‌కు బాబు చేసిందే కేసీఆర్‌కు హరీష్ చేస్తాడు. ఈ అల్లుళ్ల గిల్లుడు సంగతి అందరికీ తెలిసిందే అంటూ వ్యాఖ్యానించారు. చదవండి: ఓటుకు కోట్లు కేసులో కదలిక.. 4న సుప్రీంకోర్టులో విచారణ -
నేడు ఇండియా కూటమి సమన్వయ కమిటీ భేటీ.. ప్రధాన సవాళ్లు ఇవే..
ఢిల్లీ: నేడు సాయంత్రం ఇండియా కూటమి సమన్వయ కమిటీ సమావేశం కానుంది. 14 మంది సభ్యుల సమన్వయ కమిటీ ఢిల్లీలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో భేటీ కానున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ షేరింగ్ , ఎన్నికల ప్రచారం తదితర అంశాలపై చర్చించనున్నారు. కూటమి ముందున్న ప్రధాన సవాళ్ళు ఇవే.. ప్రధానమంత్రి అభ్యర్థి.. కేంద్రంలో ఉన్న బీజేపీని ఎదుర్కొనడానికి దేశంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షాలు కలిసి కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. దాదాపు 28 పార్టీలు కూటమిలో ఉన్నాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి కూటమి తరపున ఒక ప్రధాన అభ్యర్థిని ప్రధాని మోదీకి అభిముఖంగా నిలబెట్టాల్సి ఉంటుంది. ఇందులో ఏ పార్టీకి ఇబ్బంది లేకుండా, అన్ని పార్టీల అంగీకరంతో ఓ అభ్యర్థిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇదే కూటమి ముందు ఉన్న ప్రధాన సవాళుగా పేర్కొనవచ్చు. టికెట్ల పంపిణీపై కుదరని ఏకాభిప్రాయం ఇండియా కూటమిలో కాంగ్రెస్, ఆప్ లాంటి జాతీయ పార్టీలతో పాటు అనేక చిన్ని పార్టీలు ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఆయా పార్టీలు ప్రాబల్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీలు పోటీ చేయకుండా ఆయా స్థానాల్లో ప్రాంతీయ పార్టీలకు సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించాలనే అంశంలో కూటమి పెద్దలు ఇప్పటికే తలమునకలయి ఉన్నాయి. ఈ అంశంలో సమన్వయ కమిటీ ఒక ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంటుంది. దీనిపై నేడు భేటీలో చర్చించనున్నారు. #WATCH | Mumbai, Maharashtra: Shiv Sena (UBT) leader Sanjay Raut says, "Today we will go to the meeting... The agenda decided in the Mumbai meeting will be discussed. Everybody is going to attend the meeting except TMC. TMC leader Abhishek Banerjee is a member of this committee,… pic.twitter.com/FglophdMXr — ANI (@ANI) September 13, 2023 టీఎంసీ Vs కాంగ్రెస్, లెఫ్ట్: అటు.. పశ్చిమ బెంగాల్లో లెఫ్ట్ , కాంగ్రెస్ కు సీట్లు కేటాయించేందుకు మమతా బెనర్జీ నిరాకరించారు. అధికారంలో ఉన్న టీఎంసీ బెంగాల్లో మెజారిటీ సీట్లను గెలుచుకోగలిగే సత్తా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్‌కు, లెఫ్ట్‌లకు సీట్లను కేటాయించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే అక్కడ జరిగిన స్థానిక పంచాయతీ ఎన్నికల్లో టీఎంసీ సత్తా చాటింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోనూ ప్రభంజనం సృష్టించగల విశ్వాసంతో ఉంది. లెఫ్ట్ Vs కాంగ్రెస్: కేరళలోనూ ఇదే తరహా వివాదం నెలకొంది. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మధ్య సీట్ల పంచాయతీ కొనసాగుతోంది. అధికారంలో ఉన్న పీనరయ్ విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్ పార్టీ నేతలు.. తాము సొంతంగా మెజారిటీ సీట్లను సాధించగలమని భావిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌కు సీట్ల పంపిణీపై నిరాసక్తతతో ఉన్నారు. ఆప్ Vs కాంగ్రెస్: ఢిల్లీ, పంజాబ్ , హర్యానాలో టిక్కెట్ల పంపిణీ పై ఆప్ - కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొన్ని రోజులుగా కొనసాగుతోంది. ఇటీవలే జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన ఆప్.. మరిన్ని రాష్ట్రాల్లో పోటీ చేయడానికి ఉత్సాహంతో ఉంది. ఇప్పటికే పంజాబ్‌లో అధికారాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో సీట్ల పంపిణీ కూటమి ముందు ప్రధాన సమస్యగా మారింది. ఈ అంశాలపై నేటి సమావేశంలో చర్చించనున్నారు. ఇదీ చదవండి: ఇండియా కూటమి సమన్వయ కమిటీ కీలక సమావేశం.. ఎజెండా ఏమిటంటే..? -
దుర్గమ్మపై ఆన.. లంచం తీసుకోలేదు
పాపన్నపేట (మెదక్): ఏడుపాయల వనదుర్గ ఆలయం గురువారం బీఆర్ఎస్ నాయకుల సవాళ్లు.. ప్రతి సవాళ్లు, ప్రమాణాలకు వేదికైంది. బీఆర్ ఎస్‌లోని రెండు వర్గాలు తడి బట్టలతో ఒకరు.. పసుపు బట్టలతో మరొకరు అమ్మవారి ఎదుట ప్రమాణాలు చేశారు. ‘నా రాజకీయ జీవితంలో ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోలేదని వన దుర్గమ్మ మాత ఎదుట ప్రమాణం చేస్తున్నా. తప్పు చేసినట్లు నిరూపిస్తే మెదక్ రాందాస్ చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తా’ అంటూ ఇఫ్కో డైరెక్టర్, మెదక్ ఎమ్మెల్యే పద్మ భర్త దేవేందర్‌రెడ్డి ఏడు పాయల వనదుర్గ అమ్మవారి ఎదుట గురువారం ప్రమాణం చేశారు. తాను ప్రకటించినట్లుగా 150 మంది కార్యకర్తలతో ఆలయానికి చేరుకున్నారు. మంజీరా నదిలో స్నానం చేసి రాజగోపురంలోని దుర్గమ్మ ఉత్సవ విగ్రహం వద్ద పూజలు చేసి ప్రమా ణం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడు తూ కోనాపూర్ సొసైటీలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, భూకబ్జాలు, ఇసుక దందాలు, భూపంచాయితీలు, సెటిల్మెంట్లు చేయలేదన్నారు. సామాజికసేవ కోసం కాంట్రాక్టర్లు, అధికారుల సహాయం తీసుకున్నానే తప్ప ఎవరినీ బెదిరించలేదన్నారు. ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని చెప్పారు. వందల ఎకరాల భూములు కొన్నారు... దైవ సన్నిధిలో చేసిన అసత్య ప్రమాణాలతో దేవేందర్‌రెడ్డి పతనం ప్రారంభమైందని బీఆర్ఎస్ అసమ్మతి నేతలు అన్నారు. దేవేందర్‌రెడ్డి సవాల్‌ను స్వీకరించిన అసమ్మతి నాయకులు మడూర్ ఏఎంసీ మాజీ చైర్మన్ గంగా నరేందర్, చిన్నశంకరంపేట మాజీ ఎంపీపీ అరుణ, సర్పంచ్ రాజారెడ్డి, అడ్వొ కేట్ జీవన్‌రావు తదితరులు 100 మందితో కలిసి గురువారం ఏడుపాయలకు చేరుకున్నారు. పసుపు బట్టలతో ఆలయంలోకి వచ్చి పూజలు చేసి అమ్మ వారి సన్నిధిలో ప్రమాణం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దేవేందర్‌రెడ్డి తన భూదందాలు, ఇసుక మాఫియా, లంచాలు, కోనాపూర్ సొసైటీ వ్యవహారం, అక్రమ సంపాదనపై జవాబు చెప్పకుండా అమ్మవారి ఎదుట అసత్య ప్రమాణం చేశారని ఆరోపించారు. దీనికి సంబంధించిన అఫిడవిట్‌తో తాము వచ్చామని పేర్కొన్నారు. రూ.కోట్ల అవినీతిపై కాకుండా కేవలం ఏడుపాయల విషయంపై స్పందించడాన్ని ప్రజలు గమనించాలన్నారు. శంకరంపేట, నర్సాపూర్, మెదక్‌తో పాటు కామారెడ్డి జిల్లాల్లో వందల ఎకరాల భూములు కొన్నారని ఆరోపించారు. ఏ హోదాలో కలెక్టర్ పక్కన కూర్చొని సమావేశాల్లో సమీక్షలు చేస్తున్నారని ప్రశ్నించారు. మెదక్ డెయిరీ పేరిట కార్యకర్తల నుంచి రూ. లక్ష చొప్పున వసూలు చేసిన రూ. కోటి సొమ్మును ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. మెదక్ నుంచి పద్మాదేవేందర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని మార్చకపోతే రెబల్ అభ్యర్థిని పోటీకి దింపక తప్పదని హెచ్చరించారు. -
Fodder Scam Case: దాణా స్కాంలో లాలూకు షాక్
పాట్నా: ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌కు దానా కుంభకోణం కేసులో ఎదురుదెబ్బ తగిలింది. లాలూకు జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సవాలు చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు సీబీఐ దాఖలు చేసిన పిటీషన్‌ను సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వలోని ధర్మాసనం ఆగష్టు 25న విచారణ చేపట్టనుంది. లాలూ ప్రసాద్ యాదవ్ విభజన చెందని బిహార్‌కు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ట్రెజరీ నుంచి దాదాపు 950 కోట్ల రూపాయలను అక్రమంగా బయటకు తీశారని సీబీఐ అభియోగాలు మోపింది. ఈ వ్యవహారంలో మొత్తం ఐదు కేసులు ఉండగా.. దుమ్కా, చైబాసా, డోరాండా, డియోగర్ ట్రెజరీలకు సంబంధించిన కేసుల్లో రాంచీలోని సీబీఐ కోర్టు దోషిగా తేల్చి మొత్తం 14 ఏళ్ల జైలు శిక్షను విధించింది. ఐదో కేసులో ఐదేళ్ల శిక్షను ఖరారు చేసి, రూ.60 లక్షల జరిమానా కూడా విధించింది. తాజాగా ఆయన ఆరోగ్యం బాగులేని కారణంగా జార్ఖండ్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు సింగపూర్‌లో చికిత్స పూర్తయింది. తన కూతురు ఓ కిడ్నీని దానం చేయగా.. లాలూ విజయవంతంగా అనారోగ్యం నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం ఇండియా కూటమి తరపున కూడ సమావేశాల్లో పాల్గొన్నారు. తాజా పరిణామంతో మరోసారి ఆయన కోర్టు మెట్లెక్కనున్న పరిస్థితి ఎదురైంది. ఇదీ చదవండి: అఫీషియల్ ప్రకటన: పరాభవం పాలైన చోటు నుంచే రాహుల్ గాంధీ పోటీ -
బాలినేని సవాల్.. నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా..
సాక్షి, ప్రకాశం జిల్లా: జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. ఇళ్ల పట్టాలలో స్కాం చేసినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు. ‘‘నిస్వార్దంగా పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నాం. బురద చల్లడానికి ప్రయత్నం చేస్తే పేదలు క్షమించరు. స్కామ్‌లు నిరూపించలేకపోతే మీరు రాజకీయ సన్యాసం చేస్తారా?. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి తీరతా’’ అని బాలినేని స్పష్టం చేశారు. చదవండి: దళిత గళం గొంతు నొక్కి! -
నారా లోకేష్‌కు ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి సవాల్
సాక్షి, పల్నాడు జిల్లా: వైఎస్సార్సీపీ పాలనలో అభివృద్ధిపై మంగళగిరి టీడీపీ ఆఫీసులో చర్చ పెట్టినా తాను చర్చకు సిద్ధమని నారా లోకేష్‌కు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి సవాల్ విసిరారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నేను అబద్ధాలు చెప్పినట్లు రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా. గురజాల నియోజకవర్గంలో టీడీపీ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. ‘‘రూ.83 కోట్లతో నిర్మించిన సీసీరోడ్లు, అంగన్వాడీలు, కమ్యూనిటీ హాళ్లని రూ.2020 కోట్లతో నిర్మించానని లోకేష్ అబద్ధాలు చెప్పాడు. సారా డబ్బులతో హైదరాబాద్‌లో చంద్రబాబుకు రూ.300 కోట్ల భవనం. ప్రజల్ని లూటీ చేసి చంద్రబాబు, లోకేష్ సంపాదించారు. టీడీపీ హయాంలో లిప్ట్ ఇరిగేషన్ నుంచి సర్వే అయినా చేయించారా?’’ అంటూ మహేష్‌రెడ్డి ప్రశ్నించారు. చదవండి: అన్నమయ్య జిల్లా: చంద్రబాబుపై కేసు నమోదు -
మంత్రి కేటీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్
సాక్షి, హైదరాబాద్: పది గంటల కరెంట్ ఇస్తున్నట్లు కేటీఆర్ చూపిస్తే.. సబ్ స్టేషన్లోనే రాజీనామా చేస్తానని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్ విసిరారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సిద్ధిపేట, సిరిసిల్ల, గజ్వేల్, ఎక్కడి సబ్ స్టేషన్‌కైనా వెళ్దాం. ఇక్కడ లాక్ బుక్‌ల్లో 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు చూపిస్తే జీవితాంతం బీఆర్ఎస్కి సేవ చేస్తా’’ అని కోమటిరెడ్డి పేర్కొన్నారు. 24 గంటల కరెంట్ ఇస్తున్నారంటే కేసీఆర్, కేటీఆర్ ఫ్లైక్సీలకు పాలాభిషేకం చేస్తానన్న కోమటిరెడ్డి.. ఒక్కొక్క ఎమ్మెల్యే రూ.వెయ్యి కోట్లు తిన్నది అరగక ధర్నాలు చేస్తున్నారు. నా సవాల్‌కి ఎవరొస్తారో రండి.. కనీసం ఆరు గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నారో చూపించాలని ఆయన వ్యాఖ్యానించారు. చదవండి: రేవంత్ ‘ఉచిత’ ఉపన్యాసం.. ఆత్మరక్షణలో కాంగ్రెస్.. చేజేతులా! కాగా, కర్ణాటక ఎన్నికల్లో విజయం తర్వాత మంచి జోష్‌తో దూసుకెళుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీని.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఉచిత విద్యుత్‌కు సంబంధించి చేసిన వ్యాఖ్యలు ఆత్మరక్షణలో పడేశాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌కు లేనిపోని తలనొప్పి తెచ్చిపెట్టాయనే చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇక సొంత పార్టీలోనే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు రేవంత్ వ్యాఖ్యలను తప్పుపడుతుంటే, మరికొందరు మాత్రం..అధికార బీఆర్ఎస్ రేవంత్ వ్యాఖ్యలను వక్రీకరించే ప్రయత్నం చేస్తోందంటూ ఆయనకు మద్దతుగా నిలిచారు. -
నారా లోకేష్‌కి మాజీ మంత్రి అనిల్‌కుమార్ సవాల్
సాక్షి, నెల్లూరు జిల్లా: ‘‘రాజకీయాల్లోకి రాక ముందు తన తండ్రి ఇచ్చిన ఆస్తి కన్నా ఒక్క రూపాయి ఎక్కువ ఉందని నిరూపించే దమ్ము లోకేష్‌కు ఉందా?. దమ్ముంటే నా ఛాలెంజ్‌ను స్వీకరించు.. నెల్లూరు సిటీలో నాపై పోటీ చెయ్.. నేను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’’ అంటూ మాజీమంత్రి అనిల్‌కుమార్ సవాల్ విసిరారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తనపై చేసిన ఆరోపణలపై తిరుమల కొండపై ప్రమాణానికి సిద్ధమన్నారు. ‘‘సభలో స్టేజిపై నుంచి నిన్న చర్చకు పిలవడం కాదు.. ఇప్పుడు రా చర్చకు.. మధ్యాహ్నం 2 గంటల వరకు టైం ఇస్తా.. చెప్పిన అరగంటలో నేను వస్తా. చర్చలకు సింగిల్‌గా వస్తా.. యుద్ధానికి రమ్మంటే వస్తా.. కావాలంటే నువ్వు వేల మందితో వచ్చినా ఒకే’’ అంటూ అనిల్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పిన అజీజ్‌ను ఎందుకు పక్కన పెట్టారన్న అనిల్.. బెట్టింగ్ కేసులు ఉన్న వాళ్లందరూ లోకేష్ పక్కనే ఉన్నారంటూ మండిపడ్డారు. చదవండి: మార్గదర్శిపై సీఐడీ విచారణకు రామోజీరావు, శైలజా కిరణ్ గైర్హాజరు -
హిమాలయ సాహసం
-
గుట్టలు గుట్టలుగా శవాలు.. ఎక్కడా ఖాళీ లేదు
ఒడిశా: గోరుచుట్టు మీద రోకలిపోటులా రైలు ప్రమాదం నుంచి తేరుకునేలోపే ఒడిశా ప్రభుత్వానికి మరో సమస్య వచ్చి పడింది. ప్రమాదంలో మృతి చెందినవారి మృతదేహాలను సంరక్షించడంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కుంటోంది ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం. మృతదేహాలను సంరక్షించడానికి తగిన సదుపాయాలు లేక ఇప్పటికే 187 మృతదేహాలను జిల్లా కేంద్రమైన బాలాసోర్ నుండి భువనేశ్వర్ కు తరలించారు. అక్కడ కూడా అదే సమస్య తలెత్తడంతో ప్రయివేటు ఆసుపత్రులను ఆశ్రయించింది. శవాల నుండి దుర్వాసన... ఒడిశా రైలు ప్రమాదం మొత్తం దేశాన్నే కుదిపేసింది. చాలా తక్కువ వ్యవధిలో కోరమండల్ ఎక్స్ ప్రెస్, బెంగుళూరు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ప్రమాదానికి గురికావడంతో మృతుల సంఖ్య పెరుగుతూ పోయింది. దీంతో చనిపోయినవారిని వారి బంధువులు గుర్తించే వరకు మృతదేహాలను సంరక్షించడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. ఇప్పటికే సంఘటన జరిగి రెండు రోజులు కావడంతోపాటు విపరీతంగా ఉన్న ఎండలకు శవాలు పాడైపోకుండా చూడటం శవాగార నిర్వాహకులకు కష్టసాధ్యంగా మారింది. భువనేశ్వర్ కు మృతదేహాలు తరలింపు... బాలాసోర్ శవాగారంలో తగినంత చోటు లేకపోవడంతో 187 మృతదేహాలను బాలాసోర్ నుండి భువనేశ్వర్ తరలించారు. భువనేశ్వర్‌లో కూడా శవాలను ఉంచడానికి తగినంత చోటు లేకపోవడంతో 110 మృతదేహాలను మాత్రమే అక్కడి ఎయిమ్స్ హాస్పిటల్లో ఉంచి మిగిలిన వాటిని క్యాపిటల్ హాస్పిటల్, అమ్రి హాస్పిటల్, సమ్ హాస్పిటల్, మరికొన్ని ప్రయివేటు హాస్పిటల్స్ కు తరలించారు. భువనేశ్వర్ ఎయిమ్స్ లో కూడా అక్కడ 40 మృతదేహాలు ఉంచే సౌకర్యం మాత్రమే ఉంది. మిగతావాటి నిర్వహణ వారికి కష్టంగానే ఉందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. ఇది కూడా చదవండి: ఒడిశా రైలు ప్రమాద బాధితులకు అండగా సోను సూద్ -
నారా లోకేష్‌కు ఎంపీ మిథున్‌రెడ్డి సవాల్
సాక్షి, తిరుపతి: చంద్రగిరి మండలం తొండవాడలో వైఎస్సార్సీపీ ఆత్మీయ సభ శుక్రవారం నిర్వహించారు. ఎంపీలు మిథున్‌రెడ్డి, రెడప్ప, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ, చిత్తూరు జిల్లా అభివృద్ధిపై నారా లోకేష్‌తో చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరారు. ‘‘దమ్ముంటే ఈ నెల 12న చర్చకు రావాలి. చిత్తూరు జిల్లా డీఎన్ఏ నీలో ఉంటే జిల్లాలో ఏదో ఒక చోట పోటీ చేయాలన్నారు. ‘‘విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి ఆపేస్తాం అంటూ లోకేష్ మాట్లాడుతున్నారు. ప్రజలు కష్టాలు తెలుసుకుని సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. విశాఖ సమ్మిట్‌లో లక్షలు కోట్లు పెట్టుబడులు వచ్చాయి. ఈ నాలుగేళ్లలో చంద్రగిరి ఎంత అభివృద్ధి జరిగిందో మీకు తెలుసు. కరోనా సమయంలో చెవిరెడ్డి అన్న మీ ఇంటి గడప గడపకు వచ్చి అండగా నిలిచారు’’ అని మిథున్‌రెడ్డి అన్నారు. ‘‘2014లో డ్వాక్రా, రైతు రుణాలు మాఫీ చేస్తామని టీడీపీ మోసం చేసింది. మోసపూరిత వాగ్ధానాలతో మళ్లీ టీడీపీ నేతలు వస్తున్నారు. వారి మాటలు నమ్మొద్దు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తి చెవిరెడ్డి... గత ప్రభుత్వం హయాంలో ఆయనపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు. పేదలకు సంక్షేమ పథకాలు ఇస్తుంటే టీడీపీ నేతలు ఏడుస్తున్నారు. మహిళల అభివృద్ధికి, చదువుకు, పేదల ఆరోగ్యం కోసం ఖర్చు చేస్తుంటే ఎందుకు వద్దంటున్నారు’’ అంటూ ఎంపీ మిథున్‌రెడ్డి దుయ్యబట్టారు. చదవండి: సీబీఐ కట్టుకథలు అల్లుతోంది: ఎంపీ అవినాష్‌రెడ్డి -
ఇది కేవలం ట్రైలరే.. అసలు సినిమా ముందుంది: కేటీఆర్
సాక్షి, సిరిసిల్ల: మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాలో మంగళవారం పర్యటించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం తంగళ్లపల్లి మండల పరిషత్ నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం సెస్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రైతు కృతజ్ఞత సభలో మాట్లాడారు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. 8 ఏళ్లలో కేంద్రానికి రూ.3 లక్షల 68 వేల కోట్లు ఇచ్చామని, తిరిగి తెలంగాణకు ఇచ్చింది రూ.లక్షా 68 వేల కోట్లు మాత్రమేనని కేటీఆర్ అన్నారు. మిగతా 2 లక్షల కోట్లు ఏమైపోయాయని ప్రశ్నించారు. లెక్కలు తప్పని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. సెస్‌లో గెలవని వాళ్లు, రాష్ట్రంలో గెలుస్తారా? అంటూ బీజేపీ నాయకులపై మంత్రి విమర్శలు గుప్పించారు. సెస్ ఎన్నికల్లో మీరు చూసింది ట్రైలర్ మాత్రమేనన్నారు. అసలు సినిమా త్వరలో చూపిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. చదవండి: పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు -
మంత్రి పదవి వదులుకుంటా.. కిషన్‌రెడ్డికి కేటీఆర్ సవాల్
సాక్షి, హైదరాబాద్: కేందమంత్రి కిషన్‌రెడ్డికి మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో బీఆర్ఎస్ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ‘‘కేంద్రానికి రాష్ట్రం కట్టింది రూ.3.68 లక్షల కోట్లు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది రూ.1.68 లక్షల కోట్లు. ఎవరి సొమ్ముతో ఎవరు కులుకుతున్నారో బీజేపీ చెప్పాలి’’ అని కేటీఆర్ నిలదీశారు. ‘నేను చెప్పింది తప్పు అయితే మంత్రి పదవిని వదులుకుంటా.. బీజేపీ చెప్పేవి తప్పు అయితే ప్రజలకు సమాధానం చెప్పాలి. ఉద్యమ సమయంలోనూ కిషన్‌రెడ్డి రాజీనామా చేయలేదు. బీజేపీ చేసిన ఒక్క మంచి పనైనా చెప్పాలి. మతం పేరుతో రాజకీయాలు చేసే వారిని ప్రజలు నమ్మొద్దు’’ అని మంత్రి కేటీఆర్ అన్నారు. చదవండి: తెలంగాణ రాష్ట్రం నుంచి మరో కేంద్రమంత్రి? -
Population Growth: సవాళ్ళు... సదవకాశాలు
ప్రతి అవకాశాన్నీ సంక్షోభంగా మార్చుకోవడం పలువురు చేసే తప్పు. అందరూ సంక్షోభం అనుకొనేదాన్ని కూడా సదవకాశంగా మార్చుకోవడమే తెలివైన పని. ఈ నవంబర్ 15న పుట్టిన శిశువుల్లో ఒకరితో పుడమిపై జనాభా 800 కోట్లకు చేరిందన్న ఐక్యరాజ్య సమితి (ఐరాస) అంచనాను ఆ దృష్టితో చూస్తే కర్తవ్యం బోధపడుతుంది. ఇవాళ ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశాలుగా మొదట చైనా, తర్వాత భారత్ నిలిచినా, వచ్చే ఏడాదిలో మనం చైనాను అధిగమిస్తామట. ఈ మైలు రాయి సవాళ్ళు విసురుతూనే, అవకాశాలూ అందిస్తోంది. ఎందుకంటే, జనాభా పెరుగుదలైనా, తగ్గుదలైనా పూర్తి మంచీ కాదు, చెడూ కాదు. ఆ జనాభాను ఎలా వినియోగిస్తున్నామన్నదే ముఖ్యం. సవాళ్ళను అధిగమించే జనసామర్థ్యమే సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనను నిర్ణయిస్తుంది. చారిత్రకంగా చూస్తే – మానవ జాతి ఆవిర్భావం మొదలు క్రీ.శ. 1800వ సంవత్సరం నాటికి కానీ జనాభా వంద కోట్లకు చేరలేదు. కానీ, ఆ తర్వాత కేవలం రెండొందల పైచిలుకు ఏళ్ళలో మన సంఖ్యలో మరో 700 కోట్లు చేరాయన్నమాట. మెరుగైన ఆరోగ్యసంరక్షణ, ఒకప్పటితో పోలిస్తే తగ్గిన ప్రపంచ దారిద్య్రం, మాతా శిశు ఆరోగ్యంలో వచ్చిన మెరుగుదల, ఆయుఃప్రమాణం పెరగడం ఇలాంటివి అనేకం దీనికి కారణం. తాజా 800 కోట్ల మార్కును ‘‘మానవాళి సాధించిన విజయాలకు ఇది మైలురాయి’’ అని ఐరాస జనాభా నిధి (యూఎన్ఎఫ్పీఏ) అన్నది అందుకే. వర్తమాన ధోరణులే గనక కొనసాగితే, 2080ల నాటికి జనాభా 1040 కోట్ల గరిష్ఠానికి చేరుతుందనీ, దాదాపు 1050 కోట్ల దగ్గర ప్రపంచ జనాభా స్థిరపడవచ్చనీ అంచనా. వర్ధమాన దేశాల్లో అధిక భాగం జనాభా నియంత్రణపై దృష్టి పెట్టినా, గత ఆరు దశాబ్దాల్లో ప్రపంచ జనాభా రెట్టింపైన మాట నిజమే. అలాగని ఈ లెక్కల్నే చూసి, సంపూర్ణ చిత్రాన్ని విస్మరిస్తే కష్టం. ప్రపంచ జనాభా 2011లో 700 కోట్లుండేది. ఆ పైన పట్టుమని పన్నెండేళ్ళకే మరో వంద కోట్లు పెరిగి, ఇప్పుడు 800 కోట్లయింది.అయితే, ఈ సంఖ్య 900 కోట్లవడానికి కాస్తంత ఎక్కువ సమయమే పట్టనుంది. మరో పధ్నాలుగున్నర ఏళ్ళకు, అంటే 2037 నాటికి గానీ అక్కడకు చేరుకోమని అంచనా. అంటే, జనాభా రేటు పెరుగుతున్న మాట నిజమే కానీ, ఆ పెరుగుదల వేగం తగ్గుతోందన్న మాట. 1950తో పోలిస్తే ఇప్పుడు జనాభా పెరుగుదల చాలా నిదానించి, 2020లో 1 శాతం కన్నా తక్కువకు పడిపోయిందని ఐరాస జనాభా నివేదికే వెల్లడించింది. ఒక్కమాటలో... నిదానంగానైనా జనాభా తగ్గుదల మార్గంలోనే పయనిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్న సంతాన సాఫల్య రేటూ దీనికి నిదర్శనం. దాని ప్రభావం స్పష్టంగా తెలియడానికి కొంతకాలం పట్టవచ్చు. వెరసి వయసు పెరిగిన జనాభా ఎక్కువవడం ఈ శతాబ్దిలో ప్రధాన ధోరణి కానుంది. వచ్చే 2023లో ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా అవతరించనున్న భారత్ ముంగిట సువర్ణావకాశం ఉంది. చైనా (38.4 ఏళ్ళు), జపాన్ (48.6) దేశాల్లోని సగటు వయస్కుల కన్నా చాలా తక్కువగా భారతీయుల సగటు వయసు 28.7 ఏళ్ళే కానుంది. చివరకు ప్రపంచ జనాభా సగటు వయసు 30.3 ఏళ్ళ కన్నా మన దేశంలోనే పిన్న వయస్కులుంటారు. అలాగే, మన జనాభాలో 27 శాతానికి పైగా 15 నుంచి 29 ఏళ్ళ వయసువాళ్ళయితే, 25.3 కోట్ల మంది 10–19 ఏళ్ళ మధ్యవయస్కులు. వచ్చే 2030 వరకు ప్రపంచంలోనే పిన్న వయస్కులున్న దేశం మనదే కావడం కలిసొచ్చే అంశం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. జనాభాను సమస్యగా భావించి ఆందోళన చెందే కన్నా ఆయుధంగా అనుకోవాలి. ఉత్పాదకత పెంచే శ్రామికశక్తిగా మలుచుకుంటే మంచి ఫలితాలుంటాయి. గతంలో చైనా చేసినది అదే! ప్రస్తుతం చైనా జనాభాలో పెద్ద వయస్కుల సంఖ్య పెరుగుతోంది. పడిపోతున్న జననాల రేటు వల్ల జనాభా తగ్గుతోంది. అంటే, ఇప్పటిదాకా ఆ దేశ ఆర్థిక పురోగతికి ప్రధాన కారణమైన శ్రామిక శక్తి ఇక ఏ మేరకు అందుబాటులో ఉంటుందనేది ప్రశ్నార్థకం. ఒక బిడ్డే ఉండాలంటూ అనేక దశాబ్దాలు కఠిన విధానం అనుసరించిన చైనా గత ఏడాది నుంచి ముగ్గురు పిల్లలకు అనుమతిం చింది. మరింతమందిని కంటే ప్రోత్సాహకాలిస్తామనీ ప్రకటించే పరిస్థితికి వచ్చింది. ఈ నేపథ్యంలో మన 141 కోట్ల పైచిలుకు జనాభాను సానుకూలతగా మలుచుకోవాలి. అయితే, భారత్‌లో పట్టణ జనాభా అంతకంతకూ అధికమవుతున్నందున సవాళ్ళూ ఎక్కువే. పట్టణ ప్రజావసరాలు తీర్చా లంటే రాగల 15 ఏళ్ళలో భారత్ కనీసం 84 వేల కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టాలని ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక. అంటే సగటున ఏటా 5500 కోట్ల డాలర్లు. అందుకు సిద్ధం కావాలి. పట్టణాల్లో అలా వసతుల కల్పన నాణ్యమైన జీవనంతో పాటు ఉత్పాదక శక్తి పెంపునకూ దోహదం చేస్తుంది. అయితే, జనాభాతో పాటు ధనిక, పేద తేడాలు పెరుగుతాయి. ఉద్రిక్తతలు హెచ్చే ముప్పుంది. ప్రపంచ ఆదాయంలో అయిదోవంతు కేవలం అగ్రశ్రేణి ఒక శాతం జనాభా గుప్పిట్లో ఉండడం పెను ప్రమాదఘంటిక. అత్యంత ధనిక దేశాల ప్రజలు, అతి నిరుపేద దేశాల వారి కన్నా 30 ఏళ్ళు ఎక్కువ జీవిస్తారట. పెరిగిన జనాభా కన్నా ఈ వ్యత్యాసాల పెరుగుదలే దుర్భరం. పెరిగిన జనసంఖ్య కోస మంటూ ప్రకృతి వనరుల విధ్వంసం ప్రపంచ సమస్య. అడవుల నరికివేత, భూగర్భ జలాల దుర్విని యోగం, చేజేతులా కాలుష్యాలు, వాతావరణ మార్పుపై అశ్రద్ధ లాంటివి అరికట్టాలి. 800 కోట్ల మంది కలసి బతుకుతూ, ఈ పుడమిని రాబోయే తరాలకూ నివాసయోగ్యంగా ఉంచడం కీలకం. -
అంతర్జాతీయ సవాళ్లతో భారత్‌కు భయం అక్కర్లేదు
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెరుగుతున్న సవాళ్లు, అధిక ద్రవ్యోల్బణం, కఠిన ద్రవ్య పరిస్థితుల వంటి అంశాలు భారతదేశ ఆర్థిక పునరుద్ధరణకు విఘాతం కలిగించకపోవచ్చని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ ఒక నివేదికలో పేర్కొంది. దేశ రేటింగ్ విషయంలో ‘స్టేబుల్ అవుట్‌లుక్’ను కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో 8.7 శాతం ఎకానమీ పురోగమిస్తే, 2022–23లో ఇది 7.6 శాతంగా ఉంటుందని అంచనావేసింది. రానున్న 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 6.3 శాతంగా ఉంటుందని విశ్లేషించింది. భారత్‌కు మూడీస్ ప్రస్తుతం దిగువస్థాయి ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ రేటింగ్ ‘బీఏఏ3’ హోదాను ఇస్తోంది. దేశంలో పెట్టుబడులకు సంబంధించి ‘చెత్త’ రేటింగ్కన్నా ఇది ఒక మెట్టు ఎక్కువ. గత ఏడాది అక్టోబర్‌లో రేటింగ్ అవుట్‌లుక్‌ను ‘నెగటివ్’ నుంచి ‘స్టేబుల్’క మార్చింది. తాజాగా మూడీస్ విడుదల చేసిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► భారతదేశం క్రెడిట్ ప్రొఫైల్... పలు స్థాయిల్లో పటిష్టతలను ప్రతిబింబిస్తోంది. పెద్ద, వైవిధ్యభరిత, వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ, అధిక వృద్ధి సామర్థ్యం, అంతర్జాతీయ సవాళ్లను తట్టుకోగలిగిన పరిస్థితులు, ప్రభుత్వ రుణానికి స్థిర మైన దేశీయ ఫైనాన్సింగ్ బేస్ వంటి కీలక అంశాలను ఇక్కడ ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ► రష్యా–ఉక్రెయిన్ సైనిక ఘర్షణలుసహా అంతర్జాతీయంగా ఎకానమీకి ఎదురవుతున్న సవాళ్లు– ప్రస్తుత, రానున్న ఆర్థిక సంవత్సరాల్లో భారత్ రికవరీకి (కోవిడ్–19 సవాళ్ల నుంచి) విఘాతం కలిగించే అవకాశం లేదని భావిస్తున్నాం. ► ఎకానమీ, ఫైనాన్షియల్ వ్యవస్థల గురించి ప్రస్తుతం కొన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ, అవి తగ్గుముఖం పడతాయని భావిస్తున్నాం. ఈ కారణంగానే ఎకానమీకి ‘స్టేబుల్ అవుట్‌లుక్’ను కొనసాగిస్తున్నాం. ► అధిక క్యాపిటల్ (మూలధన ) నిల్వలు, లిక్విడిటీ (ద్రవ్యలభ్యత), బ్యాంకింగ్, నాన్–బ్యాంకింగ్ ఆర్థిక సంస్థల (ఎన్బీఎఫ్సీ) పటిష్టత వంటి విభాగాలకు సంబంధించి సవాళ్లు ఉన్నా... ఆ సమస్యలు ఎకానమీకి కలిగించే నష్టాలు అతి స్వల్పం. ఆయా అంశాలు మహమ్మారి నుండి ఎకానమీ రికవరీని సులభతరం చేస్తున్నాయి. ► ద్రవ్యలోటు తక్షణ సమస్య ఉన్నప్పటికీ, రానున్న సంవత్సరాలోఈ సవాళ్లు తగ్గుతాయని విశ్వసిస్తున్నాం. దీర్ఘకాలంలో సావరిన్ క్రెడిట్ ప్రొఫైల్ క్షీణించకుండా ఆయా అంశాలు ఎకానమీకి దోహదపడతాయని భావిస్తున్నాం. రేటింగ్ పెంపుదలే కాదు, తగ్గింపు అవకాశాలూ ఉన్నాయి... భారత్ ఆర్థిక, ఫైనాన్షియల్ రంగాల్లో సంస్కరణల అమలు పటిష్టంగా జరిగాలి. ఇది ప్రైవేట్ రంగ పెట్టుబడులలో గణనీయమైన, స్థిరమైన పురోగతికి దారితీయాలి. తద్వారా భారతదేశ ఆర్థిక వృద్ధి సామర్థ్యం అంచనాలకు మించి పెరిగాలి. అలాగే ద్రవ్యపరమైన చర్యలు ప్రభుత్వ రుణ భారాలను తగ్గించాలి. రుణ చెల్లింపుల సామర్థ్యం మెరుగుదల క్రెడిట్ ప్రొఫైల్‌కు మద్దతు నివ్వాలి. ఈ పరిస్థితుల్లోనే సావరిన్ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేసే అవకాశం ఉంది. ఇక బలహీన ఆర్థిక పరిస్థితులు తలెత్తినా లేక ఫైనాన్షియల్ రంగంలో ఇబ్బందులు తీవ్రమయినా రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేయడం జరుగుతుంది. మేము అంచనావేసినదానికన్నా తక్కువ వృద్ధి రేటు నమోదయితే, అది ప్రభుత్వ రుణ భారాలను పెంచుతుంది. ఆ పరిస్థితి దేశ సార్వభౌమ ద్రవ్య పటిష్టతను మరింత దిగజార్చే వీలుంది. ఆయా అంశాలు నెగటివ్ రేటింగ్ చర్యకూ దారితీయవచ్చు. – మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ -
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సవాల్
సాక్షి, చిత్తూరు: ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ తనపై తప్పడు వార్తలు రాయించారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విజయవాడలో తనకు మద్యం షాప్‌ల బినామీలు ఉన్నట్లు ఆరోపణలను ఆయన ఖండించారు. రాధాకృష్ణకు దమ్ముంటే తన బినామీలు ఎవరో బయటపెట్టాలని నారాయణస్వామి సవాల్ విసిరారు. చదవండి: ఆ విషయంలో టీడీపీ ఎందుకు మౌనం దాల్చింది? ‘‘రాధాకృష్ణ నీచపు బుద్ధి మానుకోవాలి. ఆంధ్రజ్యోతిలో వచ్చిన తప్పుడు కథనంపై పరువునష్టం దావా వేస్తా. ఈ-వేలం ద్వారా బార్లకు లైసెన్స్‌లు పొందుతున్నారు. నిబంధనలు ప్రకారం వేలం జరుగుతుంటే రాధాకృష్ణ ఓర్వలేకపోతున్నారు. ఆంధ్రజ్యోతి నిజమని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ నారాయణస్వామి విసిరారు.