Economic Survey 2024: భారత ఆర్థిక వ్యవస్థ ఇటీవలి సంవత్సరాలలో సంస్కరణల ద్వారా గణనీయమైన వృద్ధిని సాధించింది. అయితే ఇది అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. వీటిలో నాలుగింటిని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వి అనంత నాగేశ్వరన్, ఆయన బృందం మధ్యంతర బడ్జెట్‌కు ముందు గత జనవరిలో వారి “మినీ ఎకనామిక్ సర్వే”లో పేర్కొన్నారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు ప్రకటించనున్న 2024-25 పూర్తి బడ్జెట్‌తోపాటు నేడు పార్లమెంట్‌లో ప్రవేశపెడుతున్న ఆర్థిక సర్వే-2024లో వీటిని ప్రస్తావించవచ్చు. 'ది ఇండియన్ ఎకానమీ: ఎ రివ్యూ' అనే పత్రంలో పేర్కొన్న ఈ సవాళ్లను ఇప్పుడు తెలుకుందాం..
ప్రపంచ ఆర్థిక ధోరణుల ప్రభావం
భారతదేశ వృద్ధి, ఆర్థిక వ్యవస్థపై ప్రపంచ ఆర్థిక ధోరణులు, వాణిజ్య విధానాల ప్రభావం మొదటి సవాలు. దేశ వృద్ధి కేవలం అంతర్గత అంశాలపై మాత్రమే కాకుండా ప్రపంచ ఆర్థిక ఏకీకరణపై కూడా ఆధారపడి ఉందని పత్రం పేర్కొంది.
బ్యాలెన్సింగ్ ఎనర్జీ సెక్యూరిటీ
ఇక రెండవ సవాలు ఏమిటంటే, పునరుత్పాదక శక్తి వైపు ప్రపంచ మార్పుల మధ్య ఆర్థిక వృద్ధిని ఇంధన భద్రతతో సమతుల్యం చేయడం భౌగోళిక రాజకీయ, సాంకేతిక, ఆర్థిక రంగాలలో సంక్లిష్ట సవాళ్లను కలిగిస్తుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
పెరుగుతున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను మూడో సవాలుగా మినీ సర్వే పేర్కొంది. ఏఐ టెక్నాలజీతో మానవ ఉద్యోగాలకు పెంచిన ముప్పు, ముఖ్యంగా సేవా రంగంలో దీని ప్రభావం గురించి ప్రపంచవ్యాప్త ఆందోళనలు నెలకొన్నాయి. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు ఉపాధిపై దాని ప్రభావాన్ని ఎలా ఎదుర్కొంటాయన్నది కీలకం.
నైపుణ్యం, విద్య, వైద్యం
స్థిరమైన ఆర్థిక వృద్ధి, ఉత్పాదకతకు నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి , మంచి నాణ్యమైన విద్య, ప్రజారోగ్యాన్ని నిర్ధారించడం చాలా ముఖ్యమైనదని పత్రం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment