సాక్షి, అమరావతి: చేసిన పాపాలకు చంద్రబాబు శిక్ష అనుభవించక తప్పదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ, కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసిన చంద్రబాబు.. ముద్రగడ పద్మనాభం నిరసనకు దిగితే ఆయన్ను వేధించారు. చంద్రబాబు జైలుకెళ్తే టీడీపీ నాయకులు ఎవరూ బాధపడటం లేదు. నిరసన కార్యక్రమాలను కేవలం రాజకీయ కార్యక్రమాలుగా మాత్రమే చేశారు. లంచాలు తిని కంచాలు మోగిస్తారా’’ అంటూ దుయ్యబట్టారు.
‘‘చంద్రబాబు జనం సొమ్ము తిన్నారని ప్రజలు భావిస్తున్నారు. అందుకే నిరసన కార్యక్రమాల్లో ఎవరూ పాల్గొనడం లేదు. కోటిమంది కేడర్ ఉందని చెప్పుకునే టీడీపీకి మద్దతెక్కడుంది. అక్రమ కేసులయితే చంద్రబాబుకు ఎందుకు కోర్టులో అనుకూల తీర్పులు రావడం లేదు. అమరావతి స్కాం, ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో భారీగా వెనకేసుకున్నారు. చంద్రబాబు జైల్లో ఉంటే లోకేష్ ఢిల్లీ వెళ్లిపోయారు. టీడీపీ కార్యకర్తలు కేసులు పెట్టించుకోవాలని లోకేష్ పిలుపునిచ్చారు. చంద్రబాబుపై కేసులు ఉంటే లోకేష్ ఎందుకు లాయర్ల చుట్టూ తిరుగుతున్నారు’’ అని పేర్ని నాని ప్రశ్నించారు.
‘‘లోకేష్‌కు దమ్ముంటే చంద్రబాబు అక్రమాస్తుల మీద విచారణకు సిద్ధమవ్వాలి. చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి విచారణ చేద్దాం. సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా?. చంద్రబాబుపై ఉన్న కేసులన్నింటిపైనా ఎందుకు స్టే తెచ్చుకున్నారు. బాబు ఇంతకాలం స్టేలు తెచ్చుకుని బతికాడు. యావజ్జీవ ఖైదు తప్పదనే స్టేలు తెచ్చుకున్నారు. కోర్టుల్లో చంద్రబాబు నిజాయితీ నిరూపించుకోవాలి’’ అంటూ పేర్ని నాని హితవు పలికారు.
హరీష్ వ్యాఖ్యలపై స్పందించిన పేర్ని నాని..
చంద్రబాబు అరెస్ట్‌పై హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన పేర్ని నాని.. ఎన్టీఆర్‌కు బాబు చేసిందే కేసీఆర్‌కు హరీష్ చేస్తాడు. ఈ అల్లుళ్ల గిల్లుడు సంగతి అందరికీ తెలిసిందే అంటూ వ్యాఖ్యానించారు.
చదవండి: ఓటుకు కోట్లు కేసులో కదలిక.. 4న సుప్రీంకోర్టులో విచారణ
Comments
Please login to add a commentAdd a comment