సాక్షి, నెల్లూరు జిల్లా: చంద్రబాబు ఆధ్వర్యంలోనే స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం జరిగిందని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బాబును సమర్థిస్తున్న సోమిరెడ్డికి సిగ్గులేదని దుయ్యబట్టారు. ఇన్వాయిస్ లేకుండా నగదును కంపెనీలకు ట్రాన్స్‌ఫర్ చేశారు. బాబు చేసిన అవినీతి వెలుగులోకి వచ్చింది గోరంతే. అవినీతికి పాల్పడటంలో చంద్రబాబు దిట్ట. వ్యవస్థలను మేనేజ్ చేసేందుకే లోకేష్ ఢిల్లీకి వెళ్లారు’’ అంటూ మంత్రి మండిపడ్డారు.
‘‘స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో అవినీతి జరిగింది అనే విషయం అందరికీ తెలిసిందే. అక్రమాలు జరగలేదని ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ నేతలు హడావిడి చేస్తూన్నారు. టీడీపీ నేతలు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయానికి వెళ్లి అభాసు పాలయ్యారు. విశ్వవిద్యాలయానికి, ఈ పథకానికి సంబంధం లేదని చెప్పడంతో ఆదిశంకరా కళాశాలకు వెళ్లారు. అక్కడ పది కోట్లు పెట్టామని చెప్పారు. పది కోట్లు పెట్టినట్లు రుజువు చేస్తే ఏమి చేసేందుకైనా సిద్ధం. వాస్తవంగా రూ.80 కోట్లు ఇవ్వాలి. ఇందులో రూ.70 కోట్లు తినేశారు. కళాశాల యజమాన్యాన్ని అడిగితే వీటి విలువ రెండు కోట్లు కూడా కావని స్పష్టం చేశారు. పరికరాలకు సంబంధించి ఇన్వాయిస్ ఉండాలి అందులో ధర కూడా పొందుపరచాలి. రూ.10 కోట్లు కూడా ఇచ్చినట్లు రుజువు చేస్తే నేను రాజకీయాల నుంచి వైదొలుగుతా’’ అంటూ మంత్రి సవాల్ విసిరారు.
‘‘నిన్న కంచాలు.. గరిటలు మోగించి హడావిడి చేశారు. నిరుద్యోగుల కంచాల్లో పెట్టాల్సిన అన్నన్ని టీడీపీ నేతలు తినేశారు. అక్రమంగా అవినీతి చేశారు.. అందుకే సక్రమంగా చంద్రబాబును అరెస్టు చేశారు. ఇక్కడ ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన లోకేష్ ఢిల్లీకి వెళ్లి కూర్చున్నాడు. అక్కడ లోకేష్‌కు ఏమి చేయాలో అర్థం కావడం లేదు’’ అంటూ మంత్రి కాకాణి ఎద్దేవా చేశారు.
చదవండి: ఓటుకు కోట్లు కేసులో కదలిక.. 4న సుప్రీంకోర్టులో విచారణ
Comments
Please login to add a commentAdd a comment