LIVE : Chandrababu Arrest, Remand, Cases, Scams And Ground updates
6:30PM, అక్టోబర్ 08 2023
రేపు చంద్రబాబు కేసులకు సంబంధించి అత్యంత కీలకం
5 కేసుల్లో తీర్పు, క్వాష్ పిటిషన్ పై సుప్రీంలో విచారణ
►1. బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు తీర్పు
►2. సీఐడీ కస్టడీ పిటిషన్-ఏసీబీ కోర్టు తీర్పు
►3. అంగళ్లు కేసులో బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు తీర్పు
►4.ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు తీర్పు
►5. ఫైబర్ నెట్ కేసులో బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు తీర్పు
►టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌కు నెల రోజులు - గత నెల 9న నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్
6:00PM, అక్టోబర్ 08 2023
అర్జంటుగా ఇండియా కూటమికి జై కొట్టేద్దామా?
► తెలుగుదేశం క్యాడర్ లో తీవ్ర అంతర్మథనం
► ఇటీవల వరుసగా జరుగుతున్న టిడిపి భేటీల్లో పార్టీ దుస్థితిపై చర్చ
► టిడిపి సీనియర్ నేత సమాచారం ప్రకారం కార్యకర్తల్లో సడలిన విశ్వాసం
► ఎన్నికలకు ఏడు నెలల ముందు ఇంత గందరగోళమా?
► ఒక్క అరెస్ట్‌కే పార్టీ అతలాకుతులం కావాల్సిన దుస్థితి ఎందుకొచ్చింది?
► జాతీయ స్థాయిలో రెండు కూటములు తెలుగుదేశం పార్టీని, లోకేష్ ను ఎందుకు దూరం పెడుతున్నాయి?
► నాడు మోదీని చంద్రబాబు ఎందుకు నానా మాటలు అనాలి? ఇప్పుడెందుకు లోకేష్ వెళ్లి కాళ్లు పట్టుకునేందుకు ప్రయత్నించాలి?
► ఇప్పటికిప్పుడు బహిరంగంగా ఇండియా కూటమికి జై కొడితే మార్పు ఉంటుందా?
► కనీసం కాంగ్రెస్ అధిష్టానంతోనయినా చంద్రబాబు అరెస్ట్ ఖండించేలా ప్రకటన చేయిద్దామా?
► మన బలహీనతను పవన్ కళ్యాణ్ ఎత్తిపొడుస్తున్నా... మనం మాత్రం జనసేనకు జై కొట్టాలా?
► తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉందని పవన్ కళ్యాణ్ బహిరంగసభలో ఎలా ప్రకటిస్తాడు?
► లోకేష్ జనంలో ఉండకుండా... ఢిల్లీకి ఎందుకు పరిమితం అవుతున్నట్టు?
5:42PM, అక్టోబర్ 08 2023
బాబు పై ఎన్ని కేసులు? ఎన్ని స్టేలు?
►దేశ రాజకీయాల్లో స్టేBNగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు
►1997లో రెడ్యానాయక్ మీ అక్రమాస్తులపై కేసు వేస్తే స్టే
►1998లో వైఎస్సార్ గారు హైకోర్టులో దావా వేస్తే స్టే
►1999లో షబ్బీర్ అలీ, 1999లో డీఎల్ రవీంద్రారెడ్డి వేసిన దావాల్లో స్టే.
►1999, 2000, 2001 వైఎస్సార్ గారు తిరిగి దావా వేస్తే స్టే.
►2003లో కృష్ణకుమార్ గౌడ్ కేసు వేస్తే స్టే
►2003లో కన్నా లక్ష్మీనారాయణ వేసిన కేసు ఏంటంటే పాపపు సొమ్ముతో చంద్రబాబు హెరిటేజ్ పెట్టాడని దావా వేస్తే స్టే
►2004లో కన్నా మళ్లీ కేసు వేస్తే స్టే.
►2004లో పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చంద్రబాబుపై రెండు కేసులు
►ఒకటి అక్రమాస్తులు, రెండు భూదోపిడీ.. దాంట్లోనూ స్టే
►2005లో బాబు అక్రమాస్తులపై లక్ష్మీపార్వతి హైకోర్టులో కేసు వేస్తే స్టే
►2005 శ్రీహరి, అశోక్ అనే ఏపీ పౌరులు కేసు వేస్తే స్టే
►2011లో బి.ఎల్లారెడ్డి అనే వ్యక్తి చంద్రబాబుపై కేసు వేస్తే స్టే
►విచారణలు జరగకుండా ఈ స్టేల బాగోతం ఎందుకు? : YSRCP
5:24PM, అక్టోబర్ 08 2023
యువగళం సంగతేంటీ? భువనేశ్వరీ బస్సు యాత్ర ఎటు పోయింది?
►చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ నేతల పడరాని పాట్లు
►చివరకు.. చంద్రబాబు భార్య భువనేశ్వరి బస్సు యాత్ర చేపడతారని ప్రకటన
►తనకు అంతగా రాజకీయాలు తెలియవని చెప్పినా భువనేశ్వరిని బలవంతంగా ఒప్పించిన సీనియర్లు
►ఈ నెల 5న కుప్పం నుంచి యాత్ర ప్రారంభిస్తారని ఎల్లో మీడియాలో కథనాలు
►మేలుకో తెలుగోడా అనే పేరు కూడా ఖరారు చేసినట్టు ప్రచారం
►ఢిల్లీ నుంచి లోకేష్ రాగానే మారిన సీను
►తాను ఢిల్లీలో ఉంటూ అమ్మ ప్రజల్లో తిరిగితే తన పరిస్థితి ఏంటని చినబాబు సీరియస్
►సుప్రీంకోర్టులో ఏదో ఒకటి తెలిసే వరకు ఆగాలని లోకేష్ సూచించినట్టు పార్టీలో ప్రచారం
►యువగళం ఇప్పుడు తిరిగి ప్రారంభించేకంటే.. ఇంకొన్నాళ్లు ఆగే ఉద్దేశ్యంలో లోకేష్
►ఎన్నికలకు ఎలాగూ ఆరు నెలలు ఉంది కదా ఇప్పుడే తొందరెందుకు అన్నట్టుగా టిడిపి తీరు
5:04PM, అక్టోబర్ 08 2023
కుటుంబ సభ్యులను కూడా నమ్మడం లేదా?
► జైల్లో చంద్రబాబుకు కుటుంబ సభ్యుల నుంచి కొత్త తలనొప్పి
► పార్టీ పగ్గాల విషయంలో ఎవరినీ నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి
► చంద్రబాబు అరెస్ట్ కాగానే పార్టీ సారథ్యం నేనంటూ ముందుకొచ్చిన బాలకృష్ణ
► టిడిపి కార్యాలయంలో మీటింగ్ లు పెట్టి మరీ నేనేనని ప్రకటించిన బాలకృష్ణ
► బాలకృష్ణను అత్యంత చాకచక్యంగా ఏపీ నుంచి తప్పించిన చంద్రబాబు
► తెలంగాణ ఎన్నికల వరకు ఏపీ వ్యవహారాలు పక్కనబెట్టి హైదరాబాద్ లోనే ఉండాలని బాలకృష్ణకు సూచన
► బావ మాట కాదనలేక హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్టు భవన్ కు పరిమితమైన బాలకృష్ణ
► తెలంగాణలో ఒక్క సీటులో కూడా తెలుగుదేశం కచ్చితంగా గెలుస్తుందని చెప్పలేని పరిస్థితి
► అయినా భీకర ప్రకటనలు చేస్తూ లేని గాంభీర్యం ప్రదర్శిస్తోన్న బాలకృష్ణ
► బావ చంద్రబాబు కొట్టిన దెబ్బను అర్థం చేసుకున్నా.. బయటకు చెప్పుకోలేని పరిస్థితిలో బాలకృష్ణ
4:40PM, అక్టోబర్ 08 2023
పత్తా లేని చంద్రబాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల’
► పక్కా ప్లాన్ తో పరారీలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాసరావు చౌదరీ
►ప్రస్తుతం ప్రణాళికా శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న పెండ్యాల శ్రీనివాసరావు చౌదరీ
►స్కిల్ కుంభకోణం కేసుతో పాటు ఐటీ నోటీసుల్లో పెండ్యాల శ్రీనివాసరావు పేరు
►విచారణ నిమిత్తం సీఐడీ గతంలో ఆయనకు నోటీసులు కూడా జారీ
►అయితే, ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా అమెరికాకు పారిపోయిన పెండ్యాల
►శుక్రవారంలోగా రాష్ట్రానికి తిరిగి రావాల్సిందిగా ఈమెయిల్ ద్వారా నోటీసు పంపిన ప్రభుత్వం
►చంద్రబాబు చేసిన అక్రమ దందాల లెక్కలన్నీ పెండ్యాల హ్యండిల్ చేసినట్టు ఆధారాలు
►ఇన్ కం టాక్స్ డిపార్ట్ మెంట్ కూడా నోటీసులు ఇచ్చింది పెండ్యాలకే
►పెండ్యాల దగ్గర స్వాధీనం చేసుకున్న ఆధారాలను బట్టి చంద్రబాబు సృష్టించిన బ్లాక్ మనీ రూ.2వేల కోట్లు
►లెక్కలు లేని రూ.2వేల కోట్లకు సంబంధించిన వివరాలివ్వాలని చంద్రబాబును అడిగిన ఐటీ
4:10PM, అక్టోబర్ 08 2023
రంగంలోకి బీజేపీలోని టీడీపీ లీడర్లు..
►జైలులో ఉన్న చంద్రబాబు కోసం రంగంలోకి బీజేపీలోని టీడీపీ లీడర్లు
►చంద్రబాబును రక్షించేందుకు ఏం చేయాలో సమాలోచనలు
►గత మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్లో తిరుగుతున్న సీఎం రమేష్, సుజనా చౌదరీ
►నడ్డాను ఎల్లో మీడియాకు తీసుకెళ్లేందుకు సర్వ శక్తులు ఒడ్డిన తెలుగు బీజేపీ నేతలు
►చంద్రబాబు విషయంలో జోక్యం చేసుకోవాలని నడ్డాకు ఎల్లో మీడియా విజ్ఞప్తులు
►చంద్రబాబు విషయంలో జోక్యం చేసుకుంటే.. తెలంగాణ ఎన్నికలకు సహకరిస్తామంటూ రాయబేరాలు
►చంద్రబాబుకు ప్రజల్లో సానుభూతి వచ్చేందుకు ప్రత్యేక ఇంటర్వ్యూలు
►అయినా పట్టించుకోకపోవడంతో ఎల్లో మీడియా సంపాదకీయాల్లో బీజేపీకి వ్యతిరేకంగా వార్తలు
►నేరుగా ప్రధాని మోదీ వ్యక్తిత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నాలు
3:30PM, అక్టోబర్ 08 2023
ఆశలన్నీ అక్టోబర్ 9 మీదే..
►అక్టోబర్ తొమ్మిదో తేదీపై టీడీపీ కోటీ ఆశలు
►సుప్రీంకోర్టులో కేసు నెగ్గేందుకు దారులపై సీనియర్ నేతలతో సమాలోచనలు
► సాంకేతిక కారణాలు తప్ప బలమైన గ్రౌండ్ చంద్రబాబుకు ఈ కేసులో లేవంటున్న లాయర్లు
► గవర్నర్ అనుమతి తీసుకోలేదని బలంగా వాదించాలని సూచన
► ఇప్పటికే గట్టి వాదనలతో CIDకి కేసులో ఎడ్జ్
► కేసు దర్యాప్తు సెక్షన్ 17A సవరణకు ముందే ప్రారంభమయిందని స్పష్టం చేసిన CID
2:31PM, అక్టోబర్ 08 2023
Justice delayed is justice denied ఎంత కరెక్టో
Justice hurried is justice buried కూడా అంతే కరెక్ట్ : YSRCP
►న్యాయం ఆలస్యం కాకూడదు
►అదే విధంగా వేగంగా న్యాయ నిర్ణయాలు తీసుకోకూడదు
► రూ. 100 కోట్ల లిక్కర్ కుంభకోణం లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఎనిమిది నెలలుగా జైల్లో ఉన్నాడు
► రూ. 371 కోట్ల స్కిల్ కుంభకోణం లో తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి 27 కోట్ల రూపాయల వచ్చాయి ,మిగిలిన సొమ్ము బాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్ చౌదరి ద్వారా బాబుకు ముట్టాయి.
►అమరావతి కాంట్రాక్టర్ల నుంచి రూ. 600 కోట్ల సచివాలయం బిల్డింగ్ లో 119 కోట్లు (20 శాతం ) ముడుపులు బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ చౌదరికి ఇచ్చానని షాపుర్జీ పల్లంజి ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ చెప్పాడు
►అవును నిజమే ఆ డబ్బు బాబుకు ఇచ్చాను అని అని బాబు పర్సనల్ సెక్రటరీ ఒప్పుకున్నాడు అని ఆగష్టు 4న కేంద్ర సంస్థ ఇన్‌కమ్‌ట్యాక్స్ బాబుకు నోటీస్ ఇచ్చింది.
►CID నోటీస్ అందుకోగానే వాళ్ళు ఇద్దరూ విదేశాలకు పారిపోయారు
2:30PM, అక్టోబర్ 08 2023
►17 A మీద ప్రశాంత్ భూషణ్ అనే సీనియర్ న్యాయవాది 2018 నవంబర్ 15న ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు
►ఆ తీర్పు ఈ ఏడాది నవంబర్ 20న విచారణకు వచ్చే అవకాశం ఉంది
►అప్పటి వరకు 17A మీద చంద్రబాబు వాదన మీద నిర్ణయం తీసుకోవద్దు అని కోరాలని సీబీసీఐడి లాయర్ల యోచన
12:52 PM, అక్టోబర్ 08 2023
టీడీపీ నేత బండారు వ్యాఖ్యల పై సుప్రీంకోర్టుకు వెళ్తా : మంత్రి రోజా
►న్యాయపరంగా పోరాడతా
►బండారు లాంటి చీడపురుగులను ఏరిపారేయాలి
►మహిళలను ఒకమాట అనాలంటే భయపడే పరిస్థితి రావాలి
►మహిళలను కించపరిస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారు
►చంద్రబాబు జైలుకెళ్లడంతో టీడీపీ నేతలకు పిచ్చెక్కింది
►చంద్రబాబు తప్పు చేయకుంటే ఎందుకు బయటకు రాలేకపోతున్నారు?
►టీడీపీ ఫెయిల్యూర్‌ను డైవర్ట్ చేయడానికే నన్ను టార్గెట్ చేశారు
►టీడీపీ, జనసేనకు దిగజారుడు రాజకీయాలే తెలుసు
12:21 PM, అక్టోబర్ 08 2023
చంద్రబాబు అక్రమంగా దోచుకున్న విషయం నిజం కాదా?: మంత్రి కాకాణి
►కోర్టులో చంద్రబాబు లాయర్లు భిన్న వాదనలు వినిపిస్తున్నారు.
►లైట్స్ ఆర్పేసి మేము దోచుకుంటాం అన్నట్లుగా టీడీపీ నేతలు కార్యక్రమాలు చేస్తున్నారు..
►చంద్రబాబు తప్పు చేయలేదని.. ప్రజల దృష్టిని మరల్చేందుకు ఎల్లో మీడియా కష్టపడుతోంది..
12:09 PM, అక్టోబర్ 08 2023
లోకేష్, భువనేశ్వరి లకు సూటి ప్రశ్న
►కొంచెం సావధానముగా సమాధానం చెప్పండి
Mam me nana garu edo chepparu okasari vinandi pic.twitter.com/X9QUNAXhnU
— Naveen Kumar (@NaveenKNi) October 2, 2023
11:08 AM, అక్టోబర్ 08 2023
భువనేశ్వరీ ప్రకటనపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలి: YSRCP
►ఎన్టీఆర్ కన్నీళ్లు కార్చితేనే స్పందించని భువనేశ్వరి ఇతర మహిళల కష్టాలకు స్పందిస్తుందా?
►హెరిటేజ్‌లో 2% అమ్మితే రూ.400 కోట్లు వస్తాయని భువనేశ్వరి అన్నారు
►అసలు Heritage విలువ ఎంత?
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తల్లి భువనేశ్వరిని కూడా ఇరికించిన నారా లోకేష్#LooterLokesh#CorruptBabuNaidu#SkilledCriminalCBNInJail #AmaravathiLandScam#TDPInsiderTrading#TDPScams#KhaidiNo7691 pic.twitter.com/EAnSfS9Fok
— YSR Congress Party (@YSRCParty) October 6, 2023
09:55 AM, అక్టోబర్ 08 2023
టీడీపీపై ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు
►మీరు చెప్పినట్టుగానే లైట్లు ఆపేసిన ఇళ్లు లెక్కవేస్తే 2019లో వచ్చిన ఆ 23 కూడా 2024లో రావటగా!
►రాష్ట్రాన్ని ఆర్పేసిన బాబు కోసం మేమెందుకు మా ఇళ్ళల్లో లైట్లను ఆపాలంటున్నారట తెలుగు తమ్ముళ్లు
►ఇవన్నీ ఒక ఎత్తైతే ఇంకొంతమంది నేతలు టపాసులు కాల్చారట
►వాళ్ళ ఆనందమే వేరులే
►మొత్తానికి టీడీపీ ఆరిపోయే దీపం అని మీరే సింబాలిక్ గా చెప్పడం ఎదైతో ఉందో...నభూతో నభవిష్యత్
మీరు చెప్పినట్టుగానే లైట్లు ఆపేసిన ఇళ్లు లెక్కవేస్తే 2019లో వచ్చిన ఆ 23 కూడా 2024లో రావటగా! రాష్ట్రాన్ని ఆర్పేసిన బాబు కోసం మేమెందుకు మా ఇళ్ళల్లో లైట్లను ఆపాలంటున్నారట తెలుగు తమ్ముళ్లు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇంకొంతమంది నేతలు టపాసులు కాల్చారట! వాళ్ళ ఆనందమే వేరులే! మొత్తానికి టీడీపీ…
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 8, 2023
09:30 AM, అక్టోబర్ 08 2023
చంద్రబాబు పిటిషన్ @ సుప్రీంకోర్టు
► సుప్రీంకోర్టులో 59వ నంబర్‌గా లిస్ట్ అయిన చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్
► అక్టోబర్ 9, 2023, సోమవారం రోజు సుప్రీం కోర్టులో లిస్ట్ అయిన చంద్రబాబు కేసు
08:15 AM, అక్టోబర్ 08 2023
రాజమండ్రి సెంట్రల్ జైల్లో 29వ రోజు రిమాండ్ ఖైదీగా చంద్రబాబు
►చంద్రబాబుకు యథావిధిగా కొనసాగుతున్న భద్రత
►రేపు సుప్రీంకోర్టు, హైకోర్టు, ఏసీబీ కోర్టులో విచారణకు రానున్న కీలక కేసులు
►సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న క్వాష్‌పై ఆశలు పెట్టుకున్న టీడీపీ నేతలు
►హడావుడిగా మరోసారి ఢిల్లీ వెళ్లిన లోకేష్
►చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ చేపట్టిన కొవ్వొత్తుల ప్రదర్శనకు ప్రజాస్పందన కరువు
►లోకేష్ క్యాంప్ ఆఫీస్ మినహా మిగిలిన చోట్ల పెద్దగా కనిపించని ఆందోళన కార్యక్రమం
Presenting India’s biggest and most notorious scamster Mr. Nara Chandra Babu Naidu @ncbn, who looted a whopping ₹6 Lakh Crores of Public Money!
— YSR Congress Party (@YSRCParty) October 5, 2023
Costarring his coterie of co-looters
Guru - Mr Ramoji Rao
Biological Son - Mr @NaraLokesh
Adopted Son - Mr @PawanKalyan
And… pic.twitter.com/tuQHUCEFPy
07:50 AM, అక్టోబర్ 08 2023
నా ఆస్తి లక్ష కోట్లు : చంద్రబాబు వీడియోను విడుదల చేసిన YSRCP
► తన ఆస్తి గురించి బహిరంగంగా ప్రసంగించిన చంద్రబాబు
► నా ఆస్తే లక్ష కోట్ల రుపాయలని ప్రకటించిన చంద్రబాబు
► ఎలక్షన్ అఫిడవిట్లో ఒక లెక్క, తెర వెనక మరో లెక్క
కేవలం 2 ఎకరాలతో మొదలైన నువ్వు, అన్ని లక్షల కోట్లు ఎలా సంపాదించావ్ చంద్రబాబూ? ఎంత మంది పేద ప్రజలను దోచుకుంటే అన్ని లక్షల కోట్లు సంపాదించావ్ @ncbn? #GajaDongaChandrababu#CorruptionKingCBN pic.twitter.com/v9Zqvi3Whs
— YSR Congress Party (@YSRCParty) October 5, 2023
07:46 AM, అక్టోబర్ 08 2023
దోచుకుంటే జైల్లో పెట్టరా?: మంత్రి దాడిశెట్టి రాజా
►అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ.370 కోట్లు చంద్రబాబు అప్పనంగా దోచేశారు
►బాబును జైల్లో పెట్టకుండా సన్మానాలు చేస్తారా..
►చంద్రబాబు వల్ల ఒకతరం యువత మొత్తం మోసపోయింది
07:30 AM, అక్టోబర్ 08 2023
స్కిల్ స్కాంలో ఈ సందేహాలను టీడీపీ తీరుస్తుందా? : YSRCP
► స్కిల్ కార్పోరేషన్ ఏర్పాటు జరిగింది అక్టోబరు, 2014లో
► నిధుల విడుదల జరిగింది డిసెంబరు, 2015లో
► నిధుల విడుదల తర్వాత సెంటర్లు ప్రారంభమైంది 19 నెలల తర్వాత
► నిధుల విడుదలకు అంత ఆత్రం చూపించిన వారు సెంటర్లు ఎందుకు ఆలస్యం చేశారు?
► సీమెన్స్ వాటా గురించి ఆగకుండా నిధులు విడుదల చేయమని ముఖ్యమంత్రి చెప్పిన విషయాన్ని నోట్‌ఫైల్‌లో చీఫ్ సెక్రటరీ రాసిందానిపై ఏమంటారు?
► కేంద్ర సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (SEBI) సెబి ద్వారా GST శాఖ (గూడ్స్ & సర్వీస్ టాక్స్)కు అలర్ట్ వచ్చిందానిపై ఏమంటారు?
► GST చంద్రబాబు ప్రభుత్వాన్ని అలర్ట్ చేయగానే బాధ్యులెవరో తేల్చండి అంటూ చర్య ఎందుకు తీసుకోలేదు?
► చంద్రబాబు హయాంలో ACB (అవినీతి నిరోధక శాఖ) విచారణ ప్రారంభించి, ఎందుకు వెంటనే ఆపేసింది ?
► ACB (అవినీతి నిరోధక శాఖ) శాఖ రిపోర్టు చేసేది ముఖ్యమంత్రికే. అంటే విచారణ ఆపేయడానికి కారణం ఎవరు?
► సీమెన్స్ 90% గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని ప్రకటించిన చంద్రబాబు
► కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇస్తుందని చెప్పుకొచ్చిన తెలుగుదేశం నేతలు
► అసలు మాకు సంబంధమే లేదని లిఖిత పూర్వకంగా ప్రకటించిన సీమెన్స్
► కాదు, కాదు సీమెన్స్ గ్రాంట్ ఇన్ కైండ్ ఇచ్చిందంటూ ప్రకటించిన సుమన్ బోస్
► అంటే కేవలం బ్రాండింగ్ కోసం సీమెన్స్‌ను కలుపుకున్నారా?
► మొత్తం డాక్యుమెంట్లలో ఎక్కడా డేట్, ప్లేస్‌తో పాటు అన్నీ ముఖ్యమైన వివరాల దగ్గర ఖాళీలెందుకు ఉంచారు?
► అసలు ఇంత ముఖ్యమైన ఒప్పందాన్ని చీకట్లో ఎందుకు చేసుకున్నారు?
07:10 AM, అక్టోబర్ 08 2023
చంద్రబాబుపై కనిపించని సానుభూతి
►కాంతితో క్రాంతి కార్యక్రమానికీ స్పందన కరువు
►బాబు అరెస్టుతో సానుభూతి పొందాలని టీడీపీ ప్రయత్నాలు
►పట్టించుకోని ప్రజలు, పార్టీ కార్యకర్తలు
►టీడీపీ ఎన్ని కార్యక్రమాలు చేసినా అన్నీ విఫలం
►బాబు అవినీతి చేశారని ప్రజలు నమ్ముతున్నారంటున్న విశ్లేషకులు
►అందుకే టీడీపీ పిలుపునకు స్పందించడంలేదని వెల్లడి
07:01 AM, అక్టోబర్ 08 2023
మళ్లీ ఢిల్లీ విమానం ఎక్కిన లోకేశ్
►టీడీపీ శ్రేణుల్లో అయోమయం
►సీఎం జగన్ ఢిల్లీ వెళ్లగానే రాజమండ్రికి వచ్చిన చినబాబు
►సీఎం తిరిగి రాగానే మళ్లీ ఢిల్లీకి వెళ్లిన వైనం
►ఇదంతా అరెస్టు భయం వల్లే అంటున్న ఆ పార్టీ నేతలు
►కీలక వేళ పార్టీని వదిలేస్తున్నారని క్యాడర్‌లో ఆందోళన
వీళ్లిద్దరు కలిసి రెండు పార్టీలను నడపటం 🤣#PackageStarPK #LooterLokesh pic.twitter.com/8gk2jVMiHb
— Sajjala Bhargava Reddy (@SajjalaBhargava) October 2, 2023
06:37 AM, అక్టోబర్ 08 2023
రాజమండ్రి జైల్లో చంద్రబాబు @29
►స్కిల్ స్కామ్ కేసులో 29వ రోజుకి చేరిన రిమాండ్
►రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీ నెంబర్ 7691గా బాబు
►మూడోసారి రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు
►తాజాగా.. అక్టోబర్ 19దాకా రిమాండ్ పొడిగింపు
చంద్రబాబు లాంటి దుర్మార్గుడు ఈ రాష్ట్రంలోనే ఎవరూ లేరు. అధికారంలో ఉన్నపుడు వందల మందిని అక్రమంగా అరెస్టు చేయించాడు. నేను కూడా ఆయన బాధితుడినే. @ncbn స్కామ్‌లు చేసి ఆధారాలతో సహా అడ్డంగా దొరికి జైలుకు వెళ్లాడు. తప్పు చేశాడు కాబట్టి శిక్ష అనుభవించక తప్పదు.
— YSR Congress Party (@YSRCParty) October 7, 2023
- APSFL ఛైర్మన్ గౌతం రెడ్డి… pic.twitter.com/6TkpdCZLud
Comments
Please login to add a commentAdd a comment