Oct 7th 2023 : చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌ | Chandrababu Arrest Remand Scams Oct 07 Updates | Sakshi
Sakshi News home page

Oct 7th 2023 : చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

Published Sat, Oct 7 2023 6:59 AM | Last Updated on Sun, Oct 8 2023 5:55 PM

Chandrababu Arrest Remand Scams Oct 07 Updates - Sakshi

LIVE : Chandrababu Arrest, Remand, Cases, Scams And Ground updates  

08:00PM, అక్టోబర్‌ 07 2023

టీడీపీ నేత బండారుపై సినీనటి రమ్యకృష్ణ ఆగ్రహం
►మహిళపై ఇంత నీచంగా మాట్లాడతారా?
►బండారు సత్యనారాయణని క్షమించకూడదు
►బండారు అసభ్యంగా దూషించడం దారుణం
►మన దేశంలో మాత్రమే భారత మాతాకి జై అని గర్వంగా చెప్తాం
►మనదేశం ప్రపంచంలోనే  ఐదవ అత్యుత్తమ ఆర్థిక దేశంగా అవతరిస్తోంది. 
►అలాంటి దేశంలో ఓ మహిళ మంత్రిని ఇంత దారుణంగా మాట్లాడతారా?,  
►కులాలు, మతాలు, ప్రాంతాలు, జెండర్‌తో సంబంధం లేకుండా బండారు సత్యనారాయణ వ్యాఖ్యలు ఖండించాలి.
►నేను ఓ మహిళ గా, నటిగా , స్నేహితురాలిగా మంత్రి రోజాకి అండగా ఉంటా

07:38PM, అక్టోబర్‌ 07 2023

►టిడిపి ఇచ్చిన  కాంతితో క్రాంతి కార్యక్రమం పట్టించుకోని ప్రజలు
►ఇళ్లలో లైట్లు ఆర్పి క్యాండిల్స్‌ వెలిగించాలని టీడీపీ పిలుపు
►యథావిధిగా వ్యాపారాలు చేసుకున్న ప్రజలు

5:10 PM, అక్టోబర్‌ 07 2023
స్కిల్‌ స్కాంలో ఈ సందేహాలను టిడిపి తీరుస్తుందా? : YSRCP
► స్కిల్‌ కార్పోరేషన్ ఏర్పాటు జరిగింది అక్టోబరు, 2014లో
► నిధుల విడుదల జరిగింది డిసెంబరు, 2015లో
► నిధుల విడుదల తర్వాత సెంటర్లు ప్రారంభమైంది  19 నెలల తర్వాత
నిధుల విడుదలకు అంత ఆత్రం చూపించిన వారు సెంటర్లు ఎందుకు ఆలస్యం చేశారు?
సీమెన్స్ వాటా గురించి ఆగకుండా నిధులు విడుదల చేయమని ముఖ్యమంత్రి చెప్పిన విషయాన్ని నోట్‌ఫైల్‌లో చీఫ్ సెక్రటరీ రాసిందానిపై ఏమంటారు?
కేంద్ర సంస్థ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్చేంజ్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా (SEBI) సెబి ద్వారా GST శాఖ (గూడ్స్‌ & సర్వీస్‌ టాక్స్‌)కు అలర్ట్‌ వచ్చిందానిపై ఏమంటారు?
GST చంద్రబాబు ప్రభుత్వాన్ని అలర్ట్ చేయగానే బాధ్యులెవరో తేల్చండి అంటూ చర్య ఎందుకు తీసుకోలేదు?
► చంద్రబాబు హయాంలో ACB (అవినీతి నిరోధక శాఖ) విచారణ ప్రారంభించి, ఎందుకు వెంటనే ఆపేసింది ?
► ACB (అవినీతి నిరోధక శాఖ) శాఖ రిపోర్టు చేసేది ముఖ్యమంత్రికే. అంటే విచారణ ఆపేయడానికి కారణం ఎవరు?
► సీమెన్స్ 90% గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని ప్రకటించిన చంద్రబాబు
► కార్పోరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కింద ఇస్తుందని చెప్పుకొచ్చిన తెలుగుదేశం నేతలు
► అసలు మాకు సంబంధమే లేదని లిఖిత పూర్వకంగా ప్రకటించిన సీమెన్స్‌
► కాదు, కాదు సీమెన్స్‌ గ్రాంట్ ఇన్ కైండ్ ఇచ్చిందంటూ ప్రకటించిన సుమన్‌ బోస్‌
అంటే కేవలం బ్రాండింగ్‌ కోసం సీమెన్స్‌ను కలుపుకున్నారా?
మొత్తం డాక్యుమెంట్లలో ఎక్కడా డేట్‌, ప్లేస్‌తో పాటు అన్నీ ముఖ్యమైన వివరాల దగ్గర ఖాళీలెందుకు ఉంచారు?
అసలు ఇంత ముఖ్యమైన ఒప్పందాన్ని చీకట్లో ఎందుకు చేసుకున్నారు?

3:10 PM, అక్టోబర్‌ 07 2023
మాజీ మంత్రి బండారు పై ఎంపీ నవనీత్ కౌర్ ఆగ్రహం
► బండారు నీకు అసలు సిగ్గు లేదా?
► మంత్రి రోజా పై ఇంత దిగజారి మాట్లాడతావా?
► మీ ఇంట్లో భార్య, చెల్లి, కూతురు లేరా..?
► ఆంధ్రా, తెలంగాణ లో మహిళలను చాలా గౌరవిస్తారు
► ఈ బండారు ఆంధ్ర, తెలంగాణ మహిళల గౌరవాన్ని తగ్గించేలా మాట్లాడాడు
► మంత్రి రోజా కు మేం అండగా ఉంటాం
► నేనే కాదు యావత్ మహిళలంతా రోజా కు అండగా ఉంటారు
► మంత్రి రోజా సినీ పరిశ్రమలో చాలా కాలం హీరోయిన్‌గా ఉన్నారు
► పెద్ద పెద్ద హీరోల తో పనిచేసిన ఆమెని ఇలా కించపరుస్తారా..?
► ఈ రాజకీయ నాయకుడు మహిళల కోసం ఇంతలా దిగజారి మాట్లాడరు.!
► బండారు నీకు రాజకీయలు ముఖ్యమా..?
► లేక ఆంధ్ర, తెలంగాణ మహిళల గౌరవం ముఖ్యమా..?
► బండారుకి ఇప్పటికైనా సిగ్గురావాలి
► నేను ఎంపీగా, నటిగా, మహిళగా రోజా కి అండగా ఉంటా : ఎంపీ నవనీత్ కౌర్

3:10 PM, అక్టోబర్‌ 07 2023
మళ్లీ ఢిల్లీకి లోకేష్‌
► మధ్యాహ్నం రాజమండ్రి నుంచి ఢిల్లీకి లోకేష్
► రెండ్రోజుల పాటు ఢిల్లీలోనే మకాం
► పదో తారీఖున నేరుగా విజయవాడలోని CID ఎదుట విచారణకు లోకేష్‌
► ఎలాగైనా బీజేపీ అగ్రనేతలను కలవాలని తీవ్రంగా ప్రయత్నాలు
► నిన్ననే బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో ఎల్లోమీడియా అధినేతల భేటీ
► చంద్రబాబు, లోకేష్‌ గురించి నడ్డాకు వివరించినట్టు సమాచారం
► నడ్డా సహకారం తీసుకుని అపాయింట్‌మెంట్లు తీసుకోవాలని లోకేష్‌ యత్నాలు

3:00 PM, అక్టోబర్‌ 07 2023
ములాఖత్‌లో లోకేష్‌కు చంద్రబాబు ఏం చెప్పారు?
► రాజమండ్రి జైల్లో శుక్రవారం 45 నిమిషాలపాటు చంద్రబాబుతో లోకేష్‌ భేటీ
పలు అంశాలపై లోకేష్‌తో సుదీర్ఘంగా చర్చించినట్టు వెల్లడించిన ఎల్లో మీడియా
► CID విచారణకు అక్టోబర్‌ 12వరకు సమయం ఉంది కాబట్టి ఢిల్లీలో ఉండడమే బెటర్‌ అని లోకేష్‌కు సూచించినట్టు సమాచారం
► ఢిల్లీలో తన వెంట ఎంపీ/లాయర్‌ కనకమేడలను ఉంచుకోవాలని లోకేష్‌కు సూచన
► తన కేసుకు సంబంధించి ఏమేం చేయాలో లోకేష్‌కు సవివరంగా సూచించినట్టు సమాచారం
► క్వాష్‌ కొట్టేయకపోతే ఏం చేయాలి? బెయిల్ విషయంలో ఎలా ముందుకెళ్లాలి..?
► జాతీయ స్థాయిలో మనకు అనుకూలంగా ఎవరెవరు ఉన్నారు?
► రెంటికి చెడ్డ రేవడి అయినట్టుగా మన పరిస్థితి ఎందుకుంది?
► ఇంకా ఏమేం చేయాలి..? ఎవరెవరితో మాట్లాడాలి..?
► మూడు కేసుల్లో ఏదో ఒక దాంట్లో అరెస్ట్‌ పరిస్థితి వస్తే లోకేష్‌ ఏం చేయాలి?
► సాంకేతికంగా తమకు అనుకూలంగా ఉన్న అంశాలేంటీ అన్నదానిపై చర్చించినట్టు సమాచారం

2:40 PM, అక్టోబర్‌ 07 2023
చంద్రబాబు స్కాం బయటపెట్టింది కేంద్ర దర్యాప్తు సంస్థలే : మంత్రి ధర్మాన
► శ్రీకాకుళం : చంద్రబాబు కేసులు కేంద్ర సంస్థలే దర్యాప్తు చేస్తున్నాయి : మంత్రి ధర్మాన ప్రసాదరావు
► ఇద్దరు వ్యక్తులకు డబ్బులు వెళ్లాయని దర్యాప్తులో తేలింది
► ఒకరు చంద్రబాబు పీఏ, మరొకరు లోకేష్ పీఏ
► మాజీ సీఎం అంటూ వదిలేయమంటే ఎలా ?
► తప్పు చేయలేదని వాదించే చంద్రబాబు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి

2:07 PM, అక్టోబర్‌ 07 2023
రింగ్ రోడ్డు లేదు.. బొంగు రోడ్ లేదు.. : అచ్చెన్న
►కోర్టు విచారణపై అచ్చెన్న అడ్డగోలు వ్యాఖ్యలు
►స్కిల్ కేసులో ఎలాంటి ఆధారాల్లేవని నెల రోజుల తర్వాత AAG చావు కబురు చల్లగా చెబుతున్నారు
►ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డులో అవినీతి అంటూ కేసులు పెడుతున్నారు
►రింగ్ రోడ్డు లేదు.. బొంగు రోడ్ లేదు..
►ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ కోసం లోకేష్ కోర్టుకెళ్లాడు
►అచ్చెన్నకు YSRCP ఒకే ఒక ప్రశ్న
►తప్పు చేయలేదని ఘీంకరించే మీరు... కోర్టు ముందుకెళ్లి అరెస్ట్‌ చేసిన విధానం మాత్రం తప్పని ఎందుకు వాదిస్తున్నారు?

12:47 PM, అక్టోబర్‌ 07 2023
చంద్రబాబు ఎన్నో దీపాల్ని ఆర్పేశారు: అంబటి
►పవన్ కళ్యాణ్, లోకేష్, బాలకృష్ణ పొలిటికల్ బఫూన్స్ 
►అవనిగడ్డలోనేమో ఎన్డీయే నుండి బయటకు వచ్చానని పవన్ అన్నారు
►మొన్నటి మీటింగ్ లో ఎన్డీయే లోనే ఉన్నానన్నారు
►చంద్రబాబు అవినీతి పై ఇంటింటికీ ప్రచారం చేస్తామని లోకేష్ అంటున్నారు
►వారంతా పొలిటికల్ బఫూన్స్ 
►పవన్ సభలు పొత్తుల ప్రకటనకు ముందు ఎలా జరిగాయి?
►ఇప్పుడు ఎలా జరుగుతున్నాయో చూస్తే అర్థం అవుతుంది
►ప్రజలు పవన్, చంద్రబాబు పొత్తులను అంగీకరించటం లేదు
►ఆ రెండు ఓట్లు కలిసేలా లేవు
►2014-19  మధ్యలో చంద్రబాబు చేసిన స్కాంలపై విచారణ జరుగుతోంది
►ఇందులో పవన్ పాత్ర కూడా కచ్చితంగా ఉందని మా అనుమానం
►అవినీతితో అరెస్టు ఐన వ్యక్తికి మద్దతు ఇవ్వటం వెనుక కారణం.. లంచాల్లో వాటా అందటం వలనే!
►కోట్ల రూపాయలు తీసుకుని వాదించే లాయర్లను చంద్రబాబు పెట్టుకున్నారు
►ఐనాసరే ఆధారాలు పక్కాగా ఉన్నందునే కోర్టు చంద్రబాబుకు రిమాండ్ వేశారు 
►రామోజీరావు మార్గదర్శిలో, రాధాకృష్ణ ఖాతాలో కూడా అవినీతి సొమ్ము పడే ఉంటుంది
►ఎన్నో దీపాలను ఆర్పేసిన అవినీతిపరుడు చంద్రబాబు
►చంద్రబాబు అరెస్ట్‌ నిరసనగా.. ఇళ్లలో లైట్లు ఆర్పేయటం ఏంటి?
►పవన్ చెత్తశుద్దితో చంద్రబాబుకు మద్దతు ఇస్తున్నారు
►టీడీపీ బలహీన పడిందని పవన్ స్పష్టంగా చెప్పారు 
►పవన్ ఎన్డీయేతో ఉన్నప్పుడు చంద్రబాబుకు ఎలా సపోర్ట్ చేస్తారు?
►ఎన్డీయే నుండి బయటకు రాకుండా ప్రకటించిన ఈ పొత్తు అక్రమం, అనైతికం 

12:05 PM, అక్టోబర్‌ 07 2023
సింహగిరిపై టీడీపీ నేతల ఓవర్ యాక్షన్
►సింహచలం వెళ్లిన  బండారు సత్యమూర్తితో సహా టీడీపీ నేతలు
►రాజకీయ విమర్శలకు అనుమతి లేదన్న పోలీసులు 
►పోలీసులతో వాగ్వాదానికి దిగిన పీలా సోదరులు, టీడీపీ నేతలు
►అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తామని పోలీసులకు బెదిరింపులు
 

11:35AM, అక్టోబర్‌ 07 2023
పవన్‌ కళ్యాణ్‌ కచ్చితంగా ప్యాకేజీ కళ్యాణే : ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి
► పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సంచలన ఆరోపణలు
► పవన్ కళ్యాణ్ బిజెపిని కాదని బయటకు రమ్మనండి
► పవన్ ప్యాకేజీ సొమ్ములు ఏ రూట్ ద్వారా విదేశాలకు వెళ్ళాయో బయటకు రావడం ఖాయం
► నాకు తెలిసి రూ.1400 కోట్ల ప్యాకేజీ సొమ్ములు హవాలా ద్వారా దేశం దాటింది
► అది దుబాయ్ కి వెళ్ళాయా? లేక రష్యాకు వెళ్ళాయా, సింహపూర్ కు వెళ్ళాయా తేలాలి
► పవన్ కు దమ్ముంటే నా మీద గ్లాస్ గుర్తును పోటీకి పెట్టాలి
► లోకేష్‌, వ్యవస్ధలను మేనేజ్ చేసేది మీ నాన్న చంద్రబాబే
► చీకట్లో చిదంబరంను కలిసింది.. కాళ్ళు పట్టుకున్నది కూడా చంద్రబాబే
► ఓటుకు కోట్లు ఇచ్చి అడ్డంగా దొరికిపోయింది చంద్రబాబే
► వాట్‌ ఐయామ్‌ సేయింగ్‌, మనవాళ్లు బ్రీఫ్‌డ్‌ మీ అన్నది చంద్రబాబే
► తెలంగాణలో కేసులు రాగానే కరకట్టకు పారిపోయింది చంద్రబాబే
► ఇన్ని తప్పులు, ఇన్ని అక్రమాలు చేసి ఇప్పుడు ఎదురుప్రశ్నిస్తున్నారా?

11:30AM, అక్టోబర్‌ 07 2023
TDP నేతల సిగ్గుమాలిన వ్యాఖ్యలపై సినీ రంగం సీరియస్‌
► మంత్రి RK రోజాపై బండారు దిగజారి వ్యాఖ్యలు చేశారు : సీనియర్‌ సినీ నటి రాధిక
► బండారు ఒక మహిళ పట్ల అలా మాట్లాడడానికి సిగ్గుండాలి
► మీకు అటెన్షన్ రావడం కోసం ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేస్తారా?
► మీరు బయటికి వెళ్లినపుడు మీ ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలుసా?

11:10AM, అక్టోబర్‌ 07 2023
బాబు చేసింది అవినీతి.. ఉద్యమం కాదు : సజ్జల
► చంద్రబాబు అరెస్ట్‌పై టిడిపి చేస్తోన్న నిరసనలపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందన
► చంద్రబాబు విప్లవ కారుడో.. లేక ఉద్యమమో చేసి జైలుకు వెళ్లినట్లు టిడిపి హడావుడి చేస్తోంది
► చంద్రబాబు అవినీతికి స్పష్టమైన ఆధారాలున్నాయి
► తప్పు చేయకపోతే చంద్రబాబు అవినీతి పై మేం అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి
► చంద్రబాబు స్కిల్ స్కామ్ కు సంబంధించి 13 చోట్ల సంతకాలు పెట్టిన విషయం వాస్తవమా..కాదా
► స్కాం అంశం పక్కదోవ పట్టించడానికే ఎలక్ర్టోరల్ బాండ్స్ అంశం తెచ్చారు
► కోర్టుల్లో అన్ని విషయాలు తేలతాయి

11:00AM, అక్టోబర్‌ 07 2023
లోకేష్‌ వ్యాఖ్యలపై జైలు అధికారుల సీరియస్‌
► చంద్రబాబు అరెస్ట్‌పై సానుభూతి కోసం లోకేష్‌ తాపత్రయం
► జైల్లో భద్రత లేదంటూ లోకేష్‌ కొత్త రాగం
► జైల్లో నక్సలైట్‌లు, సంఘ విద్రోహ శక్తులు ఉన్నారన్న లోకేష్‌
► వారి నుంచి చంద్రబాబుకు ముప్పు పొంచి ఉందన్న లోకేష్‌
► జైలు అధికారులకు ఓ లేఖ వచ్చిందంటూ నిన్న ప్రెస్‌ మీట్‌లో వ్యాఖ్యలు
► లోకేష్‌ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన జైలు అధికారులు
► లేని కారణాలను చూపుతూ జైలును రాజకీయం చేయడంపై ఆగ్రహం
► రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద మరింత భద్రత పెంపు
► ముందు వేడినీళ్లన్నారు, తర్వాత దోమలన్నారు, ఇప్పుడు మావోయిస్టులంటున్నారు.!
► రాజకీయం కోసం జైలు మీద నిందలెందుకు?
► చంద్రబాబు జైల్లో నిశ్చింతగా ఉన్నారు, ఎలాంటి ముప్పు లేదన్న అధికారులు

10:54AM, అక్టోబర్‌ 07 2023
శాంతి ర్యాలీ పేరిట అశాంతికి కుట్ర.?
► చంద్రబాబు అరెస్ట్‌పై శాంతి ర్యాలీకి తెలుగుదేశం వ్యూహం
► శాంతి ర్యాలీ పేరిట భారీగా ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని ప్లాన్‌
► అంగళ్లు తరహాలో మరోసారి అల్లర్లకు అవకాశం
► అంగళ్లు ఘటనలో చూపు కోల్పోయిన కానిస్టేబుల్‌, 27 మందికి తీవ్ర గాయాలు
► శాంతి భద్రతల నేపథ్యంలో టీడీపీ, జనసేన, సీపీఐ నేతలకు పోలీసుల నోటీసులు
► టీడీపీ శాంతి ర్యాలీకి అనుమతి లేదని తెలిపిన పోలీసులు
► పోలీసులు అడ్డుకున్నా ర్యాలీ నిర్వహిస్తామంటున్న ఆనందబాబు

08:54AM, అక్టోబర్‌ 07 2023
మళ్లీ ఢిల్లీ బాట పట్టిన లోకేష్‌
►మళ్లీ ఢిల్లీకి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌
►గన్నవరం నుంచి ఢిల్లీ వెళ్లనున్న టీడీపీ యువనేత
►ములాఖత్‌ అయిన మరుసటి రోజే ఢిల్లీకి 
►సుప్రీంకోర్టులో సోమవారం చంద్రబాబు పిటిషన్‌పై వాదనలు
►చంద్రబాబు కేసు వ్యవహారం నేపథ్యంలో మరోసారి ఢిల్లీకి లోకేష్
►న్యాయ నిపుణులతో చర్చించేందుకు వెళ్తున్నట్లు ప్రచారం
►సోమవారం విజయవాడ ఏసీబీ కోర్టులో కూడా బాబు పిటిషన్‌పై విచారణ
►చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తుందని టీడీపీ ఆశాభావం

07:58AM, అక్టోబర్‌ 07 2023
రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా చంద్రబాబు
►పటిష్టమైన భద్రత ఏర్పాట్లతో పాటు వైద్య సదుపాయాలు కూడా
►ములాఖత్‌లో నిన్న చంద్రబాబును కలిసిన కుటుంబ సభ్యులు
►జైల్లో ఆరోగ్యంగానే ఉన్న చంద్రబాబు
►చంద్రబాబు అరెస్టుపై ప్రజల దృష్టి కోసం టీడీపీ వరుస కార్యక్రమాలు
►ఇవాళ లైట్లు ఆర్పేసి కొవ్వొత్తులు వెలిగించే కార్యక్రమానికి పిలుపు

07:58AM, అక్టోబర్‌ 07 2023
బాబు భద్రతపై లోకేష్‌ అతి
►చంద్రబాబు భద్రతపై నారా లోకేష్‌ సంచలన వ్యాఖ్యలు
►జైలుపై దాడి చేస్తారని బెదిరిస్తున్నారంటూ.. మీడియా ముందుకు
►జైల్లో నక్సల్స్‌, గంజాయి అమ్మేవాళ్లు ఖైదీలంటూ వ్యాఖ్య 
►ఢిల్లీకి వెళ్లే ముందు కూడా లోకేష్‌ ఇలాంటి వాదన
►అప్పుడు దోమలతో చంపించేందుకు కుట్రంటూ ఆరోపించి నవ్వులపాలు
►చంద్రబాబు భద్రతపై ఎప్పటికప్పుడు స్పష్టత ఇస్తూ వస్తున్న జైలు అధికారులు
► అయిన అతి చేస్తున్న లోకేష్‌ బాబు

07:30AM, అక్టోబర్‌ 07 2023
చంద్రబాబు అండ్‌ కో పిటిషన్ల పర్వం
►వేర్వేరు కోర్టుల్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు మరికొందరి పిటిషన్లు
►అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానంలో .. బెయిల్‌ కోరుతూ పిటిషన్‌ 
► ఏసీబీ కోర్టులో ముగిసిన విచారణ, తీర్పు రిజర్వ్‌
► సోమవారం తీర్పు వెలువరించనున్న ఏసీబీ జడ్జి
► స్కిల్‌ కేసులో ఏపీ సీఐడీ వేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని సుప్రీంలో పిటిషన్‌
►సోమవారం(9వ తేదీన) సుప్రీంలో విచారణకు రానున్న పిటిషన్‌
►గత వాదనల్లో ముగ్గురు లాయర్లు బాబు తరపున వాదనలు.. ఇంకెంత మంది అని బెంచ్‌ అసహనం
► విచారణ దశలోనే ఉంది కదా.. ఎందుకంత ఆందోళన అని బాబు లాయర్లకు ప్రశ్న
► బాబు జైల్లో ఉన్నారని.. అత్యవసరంగా విచారించాలన్న బాబు లాయర్లు
►కుదరదని చెప్పి.. విచారణ వాయిదా వేసిన ధర్మాసనం
►ఏపీ హైకోర్టు: ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు స్కాం కేసులో ఏ1గా చంద్రబాబు 
► బెయిల్‌ కోసం పిటిషన్‌.. కొనసాగుతున్న విచారణ
► ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులోనే..  అక్టోబర్‌ 12న CID ముందు హాజరు కానున్న లోకేష్‌
► ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో.. ఏ2 నారాయణ పిటిషన్లపైనా ఏపీ హైకోర్టు విచారణ
►ఫైబర్‌ నెట్‌ స్కామ్‌లోనూ ఏపీ హైకోర్టు బాబు అండ్‌ కో పిటిషన్లు  

07:08AM, అక్టోబర్‌ 07 2023
నిరాశ, నిస్పృహల్లో టీడీపీ 
►స్కిల్‌ స్కామ్‌లో పక్కా ఆధారాలతో దొరికిన చంద్రబాబు
► బయటకు వస్తారో? రారో.. అని టీడీపీ శ్రేణుల్లో ఆందోళన
►ఏసీబీ కోర్టులో మూడు రోజులపాటు బెయిల్‌ పిటిషన్‌పై సుదీర్ఘంగా వాదనలు
►సోమవారానికి తీర్పు వాయిదా వేసిన జడ్జి
►సీఎం హోదాలో స్కిల్డ్‌గా స్కామ్‌కు పాల్పడిన వైనాన్ని తన వాదనల్లో వినిపించిన ఏఏజీ పొన్నవోలు
►కీలక డాక్యుమెంట్లు సైతం సమర్పణ
►చంద్రబాబు ఆర్థిక లావాదేవీలను సైతం విచారించాలన్న ఏఏజీ
►కనీసం మూడు రోజుల సీఐడీ కస్టడీకి ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి 

06:52AM, అక్టోబర్‌ 07 2023
రాజమండ్రి జైల్లో చంద్రబాబు @28
►స్కిల్‌ స్కామ్‌ కేసులో 28వ రోజుకి చేరిన రిమాండ్‌
►రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఖైదీ నెంబర్‌ 7691గా బాబు
►మూడోసారి రిమాండ్‌ పొడిగించిన ఏసీబీ కోర్టు
►తాజాగా.. అక్టోబర్‌ 19దాకా రిమాండ్‌ పొడిగింపు

ఇంతకీ.. ఎవరి జట్టు పవనా?:YSRCP
►ఓవైపు టీడీపీతో జనసేత పొత్తు అంటావు.
►ఇంకోవైపు ఎన్డీయే నుంచి జనసేన ఇంకా బయటకు రాలేదు.. బీజేపీ కలిసి వస్తుందంటావ్‌.
►టీడీపీతో సమన్వయ కమిటీ అంటావు.. బీజేపీతో కూడా సమన్వయ కమిటీ వేశానంటావు.
►ఇంతకీ నువ్వు ఎవరితో ఉన్నట్టు?
►పూటకో మాట చెబుతూ..  జనసేన కార్యకర్తల్ని కూడా అయోమయానికి గురిచేస్తున్నావ్‌?
►అసలు వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్ళాలనే విషయంపై కనీసం నీకైనా స్పష్టత ఉందా?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement