
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఉత్పన్నమవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి భారత్, ఇండోనేషియా మధ్య సన్నిహిత సహకారం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఈ సంక్షోభ సమయంలో ఇరుదేశాల మధ్య ఔషధ ఉత్పత్తుల సరఫరాకు అంతరాయం కలగకుండా భారత్ తనవంతు కృషి చేస్తుందని ఇండోనేషియా అధ్యక్షుడు జోకోవికి హామీ ఇచ్చారు. కరోనా ఉత్పాతంపై జొకోవితో చర్చించినట్టు నరేంద్రమోదీ మంగళవారం ట్వీట్ చేశారు. ఇరుదేశాల మధ్య ఉన్న బలమైన ద్వైపాక్షిక సంబంధాలు కరోనా మహమ్మారిపై పోరాడేందుకు ఉపయోగపడతాయని ప్రధాని వ్యాఖ్యానించారు.