సాక్షి, హైదరాబాద్: పది గంటల కరెంట్ ఇస్తున్నట్లు కేటీఆర్ చూపిస్తే.. సబ్ స్టేషన్‌లోనే రాజీనామా చేస్తానని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్ విసిరారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సిద్ధిపేట, సిరిసిల్ల, గజ్వేల్, ఎక్కడి సబ్ స్టేషన్‌కైనా వెళ్దాం. ఇక్కడ లాక్ బుక్‌ల్లో 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు చూపిస్తే జీవితాంతం బీఆర్‌ఎస్‌కి సేవ చేస్తా’’ అని కోమటిరెడ్డి పేర్కొన్నారు.
24 గంటల కరెంట్ ఇస్తున్నారంటే కేసీఆర్, కేటీఆర్ ఫ్లైక్సీలకు పాలాభిషేకం చేస్తానన్న కోమటిరెడ్డి.. ఒక్కొక్క ఎమ్మెల్యే రూ.వెయ్యి కోట్లు తిన్నది అరగక ధర్నాలు చేస్తున్నారు. నా సవాల్‌కి ఎవరొస్తారో రండి.. కనీసం ఆరు గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నారో చూపించాలని ఆయన వ్యాఖ్యానించారు.
చదవండి: రేవంత్ ‘ఉచిత’ ఉపన్యాసం.. ఆత్మరక్షణలో కాంగ్రెస్.. చేజేతులా!
కాగా, కర్ణాటక ఎన్నికల్లో విజయం తర్వాత మంచి జోష్‌తో దూసుకెళుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీని.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఉచిత విద్యుత్‌కు సంబంధించి చేసిన వ్యాఖ్యలు ఆత్మరక్షణలో పడేశాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌కు లేనిపోని తలనొప్పి తెచ్చిపెట్టాయనే చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇక సొంత పార్టీలోనే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు రేవంత్ వ్యాఖ్యలను తప్పుపడుతుంటే, మరికొందరు మాత్రం..అధికార బీఆర్‌ఎస్ రేవంత్ వ్యాఖ్యలను వక్రీకరించే ప్రయత్నం చేస్తోందంటూ ఆయనకు మద్దతుగా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment