ఎన్డీయే చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? | bjp leader laxman challenges to minister ktr | Sakshi
Sakshi News home page

ఎన్డీయే చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?

Jan 1 2016 4:46 AM | Updated on Aug 30 2019 8:24 PM

ఎన్డీయే చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? - Sakshi

ఎన్డీయే చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?

తెలంగాణ రాష్ట్రానికి ఎన్డీయే చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని మంత్రి కేటీఆర్‌కు బీజేపీ శాసనసభా పక్షం నేత కె.లక్ష్మణ్ సవాల్ విసిరారు.

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి ఎన్డీయే చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని మంత్రి కేటీఆర్‌కు బీజేపీ శాసనసభా పక్షం నేత కె.లక్ష్మణ్ సవాల్ విసిరారు. అసెంబ్లీ ఆవరణలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే ని యంతృత్వ ధోరణితో సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. కుట్రలు, కుతంత్రాలు, పార్టీ ఫిరాయింపులు, అణిచివేతలతోనే ఈ ఏడాది పాలన సాగిందన్నారు. కల్తీ కల్లు, కల్తీ నూనె, కల్తీ తినుంబండారాలతో సహా రైతుల ఆత్మహత్యలపై, అమరుల ప్రాణత్యాగాలపైనా కల్తీ లెక్కలే ప్రభుత్వం చెబుతోందన్నారు.

 

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికోసం కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయడం లేదని మంత్రి కేటీఆర్ మాట్లాడ టం పచ్చి అబద్ధమన్నారు. రోడ్లు, పరిశ్రమ లు, మౌళిక వసతులు, గృహనిర్మాణం, సంక్షేమపథకాలు అన్నింటిలోనూ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులతోనే చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులపై చర్చించడానికి ధైర్యం ఉంటే వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటుచేయాలన్నారు. దళితులకు మూడెకరాల భూమి, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి హామీలను అమలుచేయకుండా ఉత్తి మాటలతో, ఎన్నికల ప్రయోజనాలకోసమే పనిచేస్తున్నారన్నారు. హైదరాబాద్‌లోని ఎంఐఎం కార్యాలయంలో నిర్ణయాలు జరిగితే కేసీఆర్ అమలుచేస్తున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement