పాట్నా: ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌కు దానా కుంభకోణం కేసులో ఎదురుదెబ్బ తగిలింది. లాలూకు జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సవాలు చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు సీబీఐ దాఖలు చేసిన పిటీషన్‌ను సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వలోని ధర్మాసనం ఆగష్టు 25న విచారణ చేపట్టనుంది.
లాలూ ప్రసాద్ యాదవ్ విభజన చెందని బిహార్‌కు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ట్రెజరీ నుంచి దాదాపు 950 కోట్ల రూపాయలను అక్రమంగా బయటకు తీశారని సీబీఐ అభియోగాలు మోపింది. ఈ వ్యవహారంలో మొత్తం ఐదు కేసులు ఉండగా.. దుమ్కా, చైబాసా, డోరాండా, డియోగర్ ట్రెజరీలకు సంబంధించిన కేసుల్లో రాంచీలోని సీబీఐ కోర్టు దోషిగా తేల్చి మొత్తం 14 ఏళ్ల జైలు శిక్షను విధించింది. ఐదో కేసులో ఐదేళ్ల శిక్షను ఖరారు చేసి, రూ.60 లక్షల జరిమానా కూడా విధించింది.
తాజాగా ఆయన ఆరోగ్యం బాగులేని కారణంగా జార్ఖండ్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు సింగపూర్‌లో చికిత్స పూర్తయింది. తన కూతురు ఓ కిడ్నీని దానం చేయగా.. లాలూ విజయవంతంగా అనారోగ్యం నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం ఇండియా కూటమి తరపున కూడ సమావేశాల్లో పాల్గొన్నారు. తాజా పరిణామంతో మరోసారి ఆయన కోర్టు మెట్లెక్కనున్న పరిస్థితి ఎదురైంది.
ఇదీ చదవండి: అఫీషియల్ ప్రకటన: పరాభవం పాలైన చోటు నుంచే రాహుల్ గాంధీ పోటీ
Comments
Please login to add a commentAdd a comment