
ఎమ్మెల్యే వెలగపూడికి వంశీకృష్ణ సవాల్
విశాఖపట్టణం: విశాఖ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై తూర్పు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ వంశీకృష్ణ శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
విశాఖలో గురువారం ఆయన మాట్లాడుతూ...'కాపు నాయకుడు వంగవీటి మోహనరంగా హత్యకేసులో వెలగపూడి మూడో ముద్దాయివి కాదా అని ప్రశ్నించారు. వెలగపూడి నీకు దమ్ముంటే రాజీనామా చేయి, మనమిద్దరం పోటీ చేద్దాం. నేను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా, నీవు ఓడిపోతే ఏం చేస్తావన్నారు. విశాఖను మరో విజయవాడగా చేస్తున్నారన్నారు. మద్యం, బెల్టు షాపులతో ప్రజల రక్తాన్ని పీల్చేస్తున్నారని' అన్నారు.