
సాక్షి, విశాఖపట్టణం : విశాఖపట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం శనివారం ప్రారంభమైంది. కార్యాలయ ప్రారంభోత్సవానికి పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి, పార్టీ నేతలు బొత్సా సత్యనారాయణ, గుడివాడ అమర్‌నాథ్ రెడ్డి, ఎమ్మెల్యే మాణిక్యాల నాయుడు, వైఎస్‌ఆర్‌సీపీ ఎన్నారై కోర్ టీం మెంబర్, నాటా సభ్యుడు డా. పాల త్రివిక్రమ భానోజీ రెడ్డి హాజరయ్యారు.
వచ్చే ఏడాది ఎన్నికల్లో పాల్గొనేందుకు పార్టీ శ్రేణులు ఉత్సాహంతో ఉన్నాయని నాయకులు చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖపట్టణానికి రైల్వేజోన్‌ను తేవడంలో అధికార టీడీపీ విఫలమైందని అన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నారని భానోజీ రెడ్డి అన్నారు. పార్టీ కార్యాలయ ప్రారంభానికి రావడం ఆనందంగా ఉన్నట్లు చెప్పారు.
వైఎస్‌ఆర్ సీపీ అనకాపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ను నాటా వేడుకలకు ఆహ్వానించినట్లు తెలిపారు. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జులై 6 నుంచి 8 వరకూ నాటా ఉత్సవాలు జరగనున్నాయి.






Comments
Please login to add a commentAdd a comment