![Minister KTR Challenges Union Minister Kishan Reddy - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/6/ktr-kishan-reddy.jpg.webp?itok=joB8UOus)
సాక్షి, హైదరాబాద్: కేందమంత్రి కిషన్‌రెడ్డికి మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో బీఆర్ఎస్ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ‘‘కేంద్రానికి రాష్ట్రం కట్టింది రూ.3.68 లక్షల కోట్లు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది రూ.1.68 లక్షల కోట్లు. ఎవరి సొమ్ముతో ఎవరు కులుకుతున్నారో బీజేపీ చెప్పాలి’’ అని కేటీఆర్ నిలదీశారు.
‘నేను చెప్పింది తప్పు అయితే మంత్రి పదవిని వదులుకుంటా.. బీజేపీ చెప్పేవి తప్పు అయితే ప్రజలకు సమాధానం చెప్పాలి. ఉద్యమ సమయంలోనూ కిషన్‌రెడ్డి రాజీనామా చేయలేదు. బీజేపీ చేసిన ఒక్క మంచి పనైనా చెప్పాలి. మతం పేరుతో రాజకీయాలు చేసే వారిని ప్రజలు నమ్మొద్దు’’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.
చదవండి: తెలంగాణ రాష్ట్రం నుంచి మరో కేంద్రమంత్రి?
Comments
Please login to add a commentAdd a comment