సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్‌పై పొలిటికల్ ఫైట్ నెలకొంది. బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. తాజాగా ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ జరపాలని తెలిపారు. ఎవరెవరు తప్పులు చేశారో బయటపెట్టాలని అన్నారు. తప్పు చేసిన వాళ్లపై చర్చలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇక్కడ భయపడేవాళ్లు ఎవరూ లేరని.. రేవంత్ రెడ్డి తననేం చేయలేడని అన్నారు.
సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకోవద్దని.. ఆధారాలు ఉంటే బయటపెట్టాలని హెచ్చరించారు. ‘లిక్కర్ స్కాంలో ఏం ఉందో అదంతా బయటపెడుతా అని కిషన్ రెడ్డి అంటున్నాడు. ఆ కేసు కోర్టులోనే ఉంది. నిజంగా తప్పు జరిగితే కోర్టులో పెట్టు.. కోర్టులో జడ్జి శిక్ష వేస్తారు. ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకునుడు కాదు.. సికింద్రాబాద్‌కు ఏం చేశావో చెప్పి ఓట్లు అడుగు’ అని కేటీఆర్ సూచించారు.
చదవండి: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ సీరియస్
Comments
Please login to add a commentAdd a comment