కొడంగల్: కొడంగల్‌కు ప్రత్యేక గుర్తింపు తన హయంలోనే వచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కేటీఆర్ దత్తత తీసుకొని ఈ ప్రాంతానికి చేసిందేమీలేదని ఆరోపించారు. గురునాథ్ రెడ్డి మద్దతుతో గెలిచిన ఎమ్మెల్యే కొడంగల్‌ను అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కొడంగల్‌కు సాగునీరు తేలేదు, కాలేజీలు రాలేదని దుయ్యబట్టారు. సిరిసిల్ల, సిద్దిపేటను అభివృద్ధి చేసినట్లుగా కొడంగల్ ను అభివృద్ధి చేయలేదని స్పష్టం చేశారు.
కొడంగల్ లో నిజంగా అభివృద్ధి చేస్తే ముఖ్యమంత్రి తనపై పోటీ చేసి గెలవాలని రేవంత్ సవాల్ విసిరారు. ఈ ఎన్నికలు కొడంగల్ రూపురేఖలను మారుస్తాయని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు దేశ ముఖచిత్రంలో కొడంగల్ పేరు మారుమోగుతుందని అన్నారు.
రాష్ట్రంలో యువత, నిరుద్యోగులు అల్లాడుతున్నారని తెలిపిన రేవంత్ రెడ్డి.. ప్రాణ సమానమైన కాంగ్రెస్ కార్యకర్తలతో నామినేషన్ వేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ శాఖకు తనను అధ్యక్షుడిగా సోనియమ్మ నియమించిందని పేర్కొన్నారు. కొడంగల్ ప్రజలంతా ఆలోచన చేయాలని సూచించారు.
ఇదీ చదవండి: గెలిపిస్తేనే వస్తా.. లేదంటే రాను : కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment