
సాక్షి,హైదరాబాద్: ‘ఆయన కొడితే బలంగా కొడతా అంటున్నారు. బలంగా కొట్టుడు కాదు. సరిగ్గా నిలబడమనండి’’ అంటూ మాజీ సీఎం కేసీఆర్ (kcr) వ్యాఖ్యలకు సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) కౌంటర్ ఇచ్చారు. ఫామ్ హౌస్ (Farm House)లో కూర్చొని మాటలు చెప్పుడు కాదు. అసెంబ్లీకి రావాలంటూ సవాల్ విసిరారు. 150 ఏళ్లు పూర్తి చేసుకున్న రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద ప్రభుత్వ ఉన్నత పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..
‘‘కేసీఆర్ కోసం ఎవరు ఎదురు చూడడం లేదు. జహంగీర్ పీర్‌కి రూ.100 కోట్లు, రాజరాజేశ్వరస్వామికి రూ.100 కోట్లు ఇస్తామని మోసం చేశారు. పాలమూరును ఎండబెట్టిన ఘనలు మీరు. ఆయన కొడితే బలంగా కొడతా అంటున్నారు. బలంగా కొట్టుడు కాదు. సరిగ్గా నిలబడు. 14 నెలల ఫామ్ హౌస్‌లో పడుకుని గంభీరంగా చూస్తున్నాం అని అంటున్నావ్. ఏం చేస్తున్నావ్.
..హరీష్‌ను, కేటీఆర్‌ను ఊరిమీదకు వదిలావ్. నీను మీలాగా మాటలు చెప్పి ఎగ్గొట్టను. అబద్ధాలు చెప్పడం వల్లే ఓడిపోయారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్‌కు గాడిగుడ్డు చేతికి ఇచ్చారు. అసెంబ్లీకి వస్తే ఏ ఊరికి ఎంత రుణ మాఫీ చేశామో చెబుతాం. నాకు, కేసీఆర్‌కు పోలింగ్ పెడితే కేసీఆర్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయంటా. సల్మాన్‌ఖాన్‌కు.. రాఖీ సావంత్‌కు ఓటింగ్ పెడితే .. రాఖీ సావంత్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. అంత మాత్రానా సల్మాన్ ఖాన్ హీరో కాకుండా పోరుగా. ప్రజలు తిరస్కరించినా బుద్ధిరాలేదు’ అని రేవంత్ వ్యాఖ్యానించారు.
👉చదవండి : నేను కొడితే మామూలుగా ఉండదు
Comments
Please login to add a commentAdd a comment