నేను కొడితే మాములుగా ఉండదు : కేసీఆర్‌ | KCR Comments On Telangana Politics And Congress Party Ruling, More Details Inside | Sakshi
Sakshi News home page

KCR: నేను కొడితే మాములుగా ఉండదు

Jan 31 2025 3:05 PM | Updated on Jan 31 2025 7:40 PM

Kcr Comments On Telangana Politics

సాక్షి,హైదరాబాద్‌ : సుదీర్ఘ కాలం తర్వాత మాజీ సీఎం కేసీఆర్‌ ( kcr) మౌనం వీడారు. ‘నేను కొడితే మాములుగా ఉండదు’ అంటూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ (congress party) పాలనపై నిప్పులు చెరిగారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో జహీరాబాద్ బీఆర్ఎస్ (brs) కార్యకర్తలతో కేసీఆర్‌ సమావేశం అయ్యారు. కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఈ నెల 27న జహీరాబాద్ నుంచి పాదయాత్రగా ఇవాళ ఎర్రవల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో కేసీఆర్‌ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.  

ఇన్ని రోజులుగా నేను మౌనంగా ఉన్నా.. గంభీరంగా చూస్తున్నా. నేను కొడితే మామూలుగా ఉండదు. తెలంగాణ శక్తి ఏందో కాంగ్రెస్‌ వాళ్లకు చూపించి మెడలు వంచుతా. కాంగ్రెస్‌ ఏడాది పాలనలో తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరు. కాంగ్రెస్‌ వాళ్లు దొరికితే ప్రజలు కొట్టేలా ఉన్నారు. తులం బంగారానికి ఆశపడి కాంగ్రెస్‌కు ఓటేశారు. 

👉చదవండి : కేసీఆర్‌కు సీఎం రేవంత్‌ సవాల్‌

నిన్న కాంగ్రెస్‌ వాళ్లు ఓటింగ్‌ పెడితే మనకే ఎక్కువ ఓటింగ్‌ వచ్చింది. నేను చెప్పినా వినలేదు. అత్యాసకు పోయి కాంగ్రెస్‌కు ఓటేశారు. మన విజయం తెలంగాణ విజయం కావాలి. భూముల ధరలు అమాంతం పడిపోయాయి. ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కండి. ఫిబ్రవరి నెలాఖరును భారీ బహిరంగ సభ పెడుతున్నాం. మీరందరూ తప్పకుండా రావాలి. ఓట్ల కోట్ల కోసం కాంగ్రెస్‌ ముస్లింలను వాడుకుంటుంది. సంగమేశ్వ, బసవేశ్వర టెండర్లను ఎందుకు పిలవలేదు. కాంగ్రెస్‌పై అంతటా అసంతృప్తే. అన్ని వర్గాలను కాంగ్రెస్‌ ముంచేసింది. పాలన వైఫల్యాలను ఎత్తి చూపితే కేసులు పెడుతున్నారు.

తెలంగాణ శక్తి ఏంటో కాంగ్రెస్ వాళ్లకు చూపిస్తా: కేసీఆర్

రైతుబంధుకి రాంరాం, దళితబంధుకు జైభీం చెబుతారని ఆనాడే చెప్పా. అన్నీ మబ్బులు తొలగి పోయి అన్నీ బయటకు వస్తున్నాయి. మంచేదో చెడేదో ప్రజలకు తెలుస్తోంది. 

తులం బంగారానికి ఆశపడి కాంగ్రెస్‌కు ఓటేశారు. రాబోయే రోజుల్లో విజయం మనదే. మనం విజయం తెలంగాణ విజయం కావాలి. కైలాసం ఆడితే పాము మింగినట్లుగా ఉంది పరిస్థితి. మాట్లాడితే ఫామ్‌ హౌస్‌.. ఫామ్‌ హౌస్‌ అని బద్నం చేస్తున్నారు. ఫామ్‌ హౌస్‌లో పంటలే ఉంటాయి కదా’ అని వ్యాఖ్యానించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement