
సాక్షి, నెల్లూరు జిల్లా: ‘‘రాజకీయాల్లోకి రాక ముందు తన తండ్రి ఇచ్చిన ఆస్తి కన్నా ఒక్క రూపాయి ఎక్కువ ఉందని నిరూపించే దమ్ము లోకేష్‌కు ఉందా?. దమ్ముంటే నా ఛాలెంజ్‌ను స్వీకరించు.. నెల్లూరు సిటీలో నాపై పోటీ చెయ్.. నేను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’’ అంటూ మాజీమంత్రి అనిల్‌కుమార్ సవాల్ విసిరారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తనపై చేసిన ఆరోపణలపై తిరుమల కొండపై ప్రమాణానికి సిద్ధమన్నారు.
‘‘సభలో స్టేజిపై నుంచి నిన్న చర్చకు పిలవడం కాదు.. ఇప్పుడు రా చర్చకు.. మధ్యాహ్నం 2 గంటల వరకు టైం ఇస్తా.. చెప్పిన అరగంటలో నేను వస్తా. చర్చలకు సింగిల్‌గా వస్తా.. యుద్ధానికి రమ్మంటే వస్తా.. కావాలంటే నువ్వు వేల మందితో వచ్చినా ఒకే’’ అంటూ అనిల్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పిన అజీజ్‌ను ఎందుకు పక్కన పెట్టారన్న అనిల్.. బెట్టింగ్ కేసులు ఉన్న వాళ్లందరూ లోకేష్ పక్కనే ఉన్నారంటూ మండిపడ్డారు.
చదవండి: మార్గదర్శిపై సీఐడీ విచారణకు రామోజీరావు, శైలజా కిరణ్ గైర్హాజరు
Comments
Please login to add a commentAdd a comment